Posts

Showing posts from February, 2026

మార్గము తెలిసిన తప్పిపోయాను (Margamu Telisina Thappipoyanu) Lyrics | Telugu Christian Worship Song

Image
మార్గము తెలిసిన తప్పిపోయాను – Telugu Christian Song Lyrics మార్గము తెలిసిన తప్పిపోయాను మార్గము తెలిసిన తప్పిపోయాను ఏటో తెలియక నిలిచిపోయాను వంద మంది కొరకు నీవు పోలేదు తప్పిపోయిన నన్ను నీవు వెదకి వచ్చావు నన్ను నీవు మరువక నన్ను నీవు విడువక జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు తృణీకరించక నన్ను త్రోసివేయక సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు చరణం 1: శ్రేష్టమైన జనులు ఉన్ననూ విలువలేని నా కోసం వచ్చావు ||2|| నన్ను వెదుకుట నీవు ఆపక నన్ను ప్రేమించుట నీవు మరువక ||2|| నూతన ప్రారంభం ఇచ్చావు నీ బుజములపై నన్ను మోసావు చరణం 2: రాళ్లు విసిరె మనుషులు మధ్యలో నన్ను ఆదుకొనుటకు నీవు వచ్చావు ||2|| నా చెయ్యి పట్టీ నన్ను లేపావు నా మరకలను తుడిచావు ||2|| నీ బిడ్దగా నన్ను మార్చివేసావు నన్ను త్రోసివేయని తండ్రీవి నీవే

నా ప్రాణ ప్రియుడా మహనీయుడా Telugu Christian Song Lyrics | Worship Song | Yesu Bhakti Geetham

Image
నా ప్రాణ ప్రియుడా మహనీయుడా – Telugu Christian Worship Song Lyrics నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిను విడువలేనయ్యా || నా ప్రాణ || చరణం 1: ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా (2) శ్రమలు శోధించినా నాతో నీవున్న ధైర్యమే కలిగేనా (2) ప్రాణం పోయేంతవరకు నీతోనేనయ్యా తుదిశ్వాస వరకు నీతో ఉంటానయ్యా (2) || నీవే కావలేసయ్యా || చరణం 2: కన్నీరే సముద్రమైపోయినా తుఫాను అలలే చెలరేగినా (2) నే నలిగిపోయినా నాతో నీవున్న ధైర్యమే కలిగేనా (2) ప్రాణం పోయేంతవరకు నీతోనేనయ్యా తుదిశ్వాస వరకు నీతో ఉంటానయ్యా (2) || నీవే కావలేసయ్యా ||

నీవే ఆశ నీవే శ్వాస Lyrics | Telugu Christian Worship Song | Yesu Devotional Song

Image
నీవే ఆశ నీవే శ్వాస – Telugu Christian Song Lyrics నీవే ఆశ నీవే శ్వాస నీవే ఆశ నీవే శ్వాస నీవే ధ్యాస యేసువా నీవే ప్రాణం నీవే గానం నీవే ధ్యానం నేస్తమా తలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను (2) నీ రూపులోనే నీ చేతి పనిగా – నను నీవు మలచితివే నీ శ్వాసతోనే నీ మహిమ కొరకై – నను సృజియించితివే ||నీవే|| చరణం 1: ఇహమున నా కొసగిన – ఈ ధర ఎంత భాగ్యమని తలచితి నే భ్రమచితి – అంతయు నాకు సొంతమని ఆశతో నేను పరుగెడితి ఇలలో చెలిమికై ప్రతి హృదయం స్వార్ధమాయే ప్రేమను ప్రేమగా చూపే మనసొకటి కలిగిన ఒక ప్రేమైన కాన రాదే ||నీవే|| చరణం 2: హృదయము పులకించెను – నీ ప్రేమ ప్రచించగానే దృఢమాయె నా మదిలో – ఇక అంతయు వ్యర్థమని నా జీవన గమనాన్ని నీ వైపు మలచి నీ అడుగులలో నే నడచి నీ ప్రియమైన ప్రేమగ ఇలలో జీవించి నీ కౌగిలిలో ఒదుగుదునే

అడిగే వాటికంటే ఊహించే వాటికంటే Lyrics | Telugu Christian Song | THANDRI SANNIDHI MINISTRIES

Image
అడిగే వాటికంటే ఊహించే వాటికంటే – Telugu Christian Song Lyrics | THANDRI SANNIDHI MINISTRIES అడిగే వాటికంటే ఊహించే వాటికంటే అడిగే వాటికంటే ఊహించే వాటికంటే అధికముగా చేయగలవు యేసయ్యా నన్ను నడిపే సారధివి నీవేనయ్యా (2) (నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా) "అడిగే" చరణం 1: చేసి ఉన్న ప్రార్ధన నేను మరచిపోయినా నువ్వు మరచిపోవుగా నా మంచి నాయనా (2) అవసరాన్ని తీర్చమనే నా దీన యాచన (2) పట్టజాలపోతినిగా నీవిచ్చిన దీవెన (2) "అధికముగా" చరణం 2: అల్పమైన వాటిని ఆశించును నా హృదయం అధికమైన మేళ్ళనూ దాచును నీ మంచితనం (2) ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం (2) ఏది నాకు కావాలో ఎంచి యిచ్చు నీ జ్ఞానం (2) "అధికముగా"

Telugu Christian Song Lyrics: ఆరాధన నీకే దేవా – Worship Song | THANDRI SANNIDHI MINISTRIES

Image
ఆరాధన నీకే దేవా – పూర్తి సాహిత్యం | THANDRI SANNIDHI MINISTRIES ఆరాధన నీకే దేవా ఆరాధన నీకే దేవా ఆనందము నీవే కావా (2) నా పాటలో పల్లవి ఆశల జల్లువి నీవేగా నా యేసయ్యా (2) //ఆరాధన నీకే దేవా/// చరణం 1: ఆత్మీయ పోరాటంలో ఎదురయ్యే ఒడిదుడుకులలో (2) ఎండబయలేదు క్షణమైన నీవు ఏ వేళనైనా నను విడిపోవు (2) (నా పాటలో...) //ఆరాధన నీకే దేవా/// చరణం 2: నా కనుల కన్నీరు తుడిచి నీ ప్రేమ కౌగిట చేర్చి (2) అపురూపమైన అనుభవము చూపి నన్నదరించినా నా యేసయ్యా (2) (నా పాటలో..) //ఆరాధన నీకే దేవా// చరణం 3: నాలోన నను తొలగించి నీ వశములో నన్ను నిలిపి (2) నాలోన చేరి నా హృదయమేలి నను వాడుకోనుము నా యేసయ్యా (2) (నా పాటలో..) //ఆరాధన నీకే దేవా//

అలసిపోనీకుమా అలుపు రానీకుమా Lyrics – THANDRI SANNIDHI MINISTRIES | Telugu Christian Song

Image
అలసిపోనీకుమా అలుపు రానీకుమా – పూర్తి సాహిత్యం | THANDRI SANNIDHI MINISTRIES అలసిపోనీకుమా... అలుపు రానీకుమా పల్లవి : అలసిపోనీకుమా... అలుపు రానీకుమా యేసయ్యా...యేసయ్యా... నీ దివ్య సేవలో... నీ దీన పాత్రను చరణం 1: రాజా యాజక పరిచర్యను చేయగా నన్ను పిలిచితివే కృంగిన వేలలో నా దారి చేరి ధైర్యమునే నింపినవా... కాపరివై నడిపినవా... ||అలసి|| చరణం 2: దేవా నీతో నా జీవితం - వాసివాదదు మన అనుబంధము వ్యర్ధము కాలేదే నా ప్రయాస... ఫలములనే ఇచ్చినవా...ఫలితమునే చూపినావా... ||అలసి|| చరణం 3: అంధకారాలే నాకెదురుగా - నిలిచి దాడి చేసినాను వెన్ను చూపక ముందుకు సాగే... బలమునే ఇచ్చినవా... బాహువునే చాపినవా... ||అలసి||

మనసా మరువకు యేసుని రాకడ Lyrics – THANDRI SANNIDHI MINISTRIES | Telugu Christian Song

Image
మనసా మరువకు యేసుని రాకడ – పూర్తి సాహిత్యం | THANDRI SANNIDHI MINISTRIES మనసా మరువకు యేసుని రాకడ? మనసా మరువకు యేసుని రాకడ? ఉండదు మనుగడ (2) సిద్ధపాటు విస్మయించకు సిగ్గుపడే రోజు చూడకు చరణం 1 : రాజ్యముపై రాజ్యము లేచును కాయం అక్రమాలు విస్తరించి ప్రేమలు మాయం (2) యేసు వార్త దిగంతాలు చేరును సత్యం (2) విశ్వసించు వారంతా బ్రతుకును నిత్యం (2) చరణం 2 : చిన్న కొమ్ము రాజై ఏలును లోకం వాని కాళ్ళు మొక్కి నోళ్లు పొందును భోగం (2) నజరేయుని సంఘం పై చూపును ద్వేషం (2) పరిశుద్ధుల గెలుచునట్లు చేయును యుద్ధం (2) చరణం 3 : ఎదురించిన సంఘం పై దుష్టని కోపం తన వారిని రక్షించును దేవుని హస్తం (2) శ్రమల చేత భక్తులవును శుద్ధ సువర్ణం (2) ఆ మీదట ఎత్త బడును యేసుని సంఘం (2)