Posts

Showing posts from July, 2024

O Prardhana Suprardhana | ఓ ప్రార్ధనా సుప్రార్ధనా | Telugu Christian Song Lyrics

Image
ఓ ప్రార్ధనా సుప్రార్ధనా | O Prardhana Suprardhana | Telugu Christian Song Lyrics | Download ఓ ప్రార్ధనా సుప్రార్ధనా ఓ ప్రార్ధనా సుప్రార్ధనా  నీ ప్రాభావంబున్ మరతునా  నా ప్రభువున్ ముఖా ముఖిన్  నే బ్రణుతింతు నీ ప్రభన్  నా ప్రాణమా సు ప్రార్ధనా  నీ ప్రేరణంబుచే గదా  నీ ప్రేమధార గ్రోలుదు  నో ప్రార్ధనా సుప్రార్ధనా  పిశాచి నన్ను యుక్తితో  వశంబు చేయ జూచుచో  నీ శాంతమైన దీప్తియే  నా శంక లెల్ల మానుపున్  నీ శక్తి నేను మరతునా  నా శైలమున ప్రార్ధనా  నా శోక మెల్ల దీర్చెడు  విశేషమైన ప్రార్ధనా  నీ దివ్యమైన రెక్కలే  నా దుఃఖ భార మెల్లను  నా దేవుడేసు చెంతకు  మోదంబు గొంచు బోవును  సదా శుభంబు లొందను  విధంబు జూప నీవెగా  నా ధైర్యమిచ్చుఁ ప్రార్ధనా  సుధా సుధార ప్రార్ధనా  అరణ్యమైన భూమిలో  నా రమ్యమౌ పిస్గా నగం  బు రంగుగాను నెక్కి నా  చిర గృహంబు జూతును  శరీరమున్ విదల్చి నే  బరంబు బోవు వేళలో  కరంబు నిన్ను మెచ్చెదన్  పరేశు ధ్యాన ప్రార్ధనా

Yesu Raajugaa Vachchuchunnaadu | యేసు రాజుగా వచ్చుచున్నాడు | Telugu Christian Song Lyrics

Image
యేసు రాజుగా వచ్చుచున్నాడు | Yesu Raajugaa Vachchuchunnaadu | Telugu Christian Song Lyrics | Download యేసు రాజుగా వచ్చుచున్నాడు యేసు రాజుగా వచ్చుచున్నాడు  భూలోకమంతా తెలుసుకొంటారు (2)  రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు (2)  రారాజుగా వచ్చు చున్నాడు (2)    ||యేసు||  మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు  పరిశుద్దులందరిని తీసుకుపోతాడు (2)  లోకమంతా శ్రమకాలం (2)  విడువబడుట బహుఘోరం        ||యేసు||  ఏడేండ్లు పరిశుద్దులకు విందవబోతుంది  ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది (2)  ఈ సువార్త మూయబడున్‌ (2)  వాక్యమే కరువగును          ||యేసు||  వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును  ఈ లోక రాజ్యాలన్ని ఆయన ఏలును (2)  నీతి శాంతి వర్ధిల్లును (2)  న్యాయమే కనబడును        ||యేసు||  ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర  సాగిలపడి నమస్కరించి గడగడలాడును (2)  వంగని మోకాళ్ళన్నీ (2)  యేసయ్య యెదుట వంగిపోవును        ||యేసు||  క్రైస్తవుడా మరువవద్దు ఆయన ర...

మార్గము చూపుము ఇంటికి | Maargamu Choopumu Intiki | Telugu Christian Song Lyrics

Image
మార్గము చూపుము ఇంటికి | Maargamu Choopumu Intiki | Telugu Christian Song Lyrics | Download మార్గము చూపుము ఇంటికి మార్గము చూపుము ఇంటికి – నా తండ్రి ఇంటికి  మాధుర్య ప్రేమా ప్రపంచమో – చూపించు కంటికి (2)  పాప మమతల చేత – పారిపోయిన నాకు  ప్రాప్తించె క్షామము  పశ్చాత్తాప్పమునొంది – తండ్రి క్షమ కోరుచు  పంపుము క్షేమము (2)  ప్రభు నీదు సిలువ – ముఖము చెల్లని నాకు  పుట్టించె ధైర్యము (2)                    ||మార్గము||  ధనమే సర్వంబనుచు- సుఖమే స్వర్గంబనుచు  తండ్రిని వీడితి  ధరణి భోగములెల్ల – బ్రతుకు ధ్వంసము జేయ  దేహీ నిను చేరితి (2)  దేహీ అని నీ వైపు – చేతులెత్తిన నాకు  దారిని జూపుము (2)     ||మార్గము||  దూర దేశములోన – బాగుందుననుకొనుచు  తప్పితి మార్గము  తరలిపోయిరి నేను – నమ్మిన హితులెల్ల  తరిమే దారిద్య్రము (2)  దాక్షిణ్య మూర్తి నీ – దయ నాపై కురిపించి  ధన్యుని చేయుము (2)                  ||మార్గము|...

Asaadhyamainadi Lene Ledu | అసాధ్యమైనది లేనే లేదు |Telugu Christian Song Lyrics

Image
అసాధ్యమైనది లేనే లేదు | Asaadhyamainadi Lene Ledu | Telugu Christian Song Lyrics | Download అసాధ్యమైనది లేనే లేదు      అసాధ్యమైనది లేనే లేదు       నన్ను బలపరచువాడు నాతో ఉండగా (2)       ఊహించలేని ఆశ్చర్యక్రియలలో       నా దేవుడు నన్ను నడిపించును (2)       సాధ్యమే అన్ని సాధ్యమే       నా యేసు తోడైయుండగా (2)  1. శోధన శ్రమలు వచ్చినను       ఏ మాత్రము నేను వెనుతిరిగినను (2)       సత్య స్వరూపి సర్వోన్నతుడైన       గొప్ప దేవుడు నన్ను బలపరచును (2) ||సాధ్యమే||  2. సాతాను శక్తులు ఎదిరించిన       వాక్యమనే ఖడ్గముతో జయించెదను (2)       సర్వశక్తుడు తన శక్తితో నింపి       సాతానుపై నాకు జయమిచ్చును (2) ||సాధ్యమే||

Nee Vaakyame Nannu Brathikinchenu | నీ వాక్యమే నన్ను బ్రతికించెను | Telugu Christian Song Lyrics

Image
నీ వాక్యమే నన్ను బ్రతికించెను | Nee Vaakyame Nannu Brathikinchenu | Telugu Christian Song Lyrics | Download నీ వాక్యమే నన్ను బ్రతికించెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను  బాధలలో నెమ్మదినిచ్చెను (2)  కృపా శక్తి దయా సత్య సంపూర్ణుడా  వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా (2)      ||నీ వాక్యమే||  జిగటగల ఊభినుండి లేవనెత్తెను  సమతలమగు భూమిపై నన్ను నిలిపెను (2)  నా పాదములకు దీపమాయెను (2)  సత్యమైన మార్గములో నడుపుచుండెను (2)       ||నీ వాక్యమే||  శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై  యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది (2)  అపవాది వేయుచున్న అగ్ని బాణములను (2)  ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పి వేయుచున్నది (2)       ||నీ వాక్యమే||  పాలవంటిది జుంటి తేనె వంటిది  నా జిహ్వకు మహా మధురమైనది (2)  మేలిమి బంగారు కన్న మిన్న అయినది (2)  రత్న రాసులకన్నా కోరతగినది (2)           ||నీ వాక్యమే||

Paapini Krupa Joopavayyaa | పాపిని కృప జూపవయ్యా | Telugu Christian Song Lyrics

Image
పాపిని కృప జూపవయ్యా | Paapini Krupa Joopavayyaa | Telugu Christian Song Lyrics | Download పాపిని కృప జూపవయ్యా పాపిని కృప జూపవయ్యా దాపు జేరితిని యేసయ్యా పాప భారము  క్రింద శ్రమపడి కృంగియున్నాను యేసయ్యా ||పాపి||  1. వేష భాషలతోడ నిండి మోసపోయితిని యేసయ్యా దోసిలొగ్గి నిన్ను       చేరితి దాసునిగ బ్రోవు యేసయ్యా ||పాపి||  2. నీతి లేని నాదు జీవిత మేల నికనయ్యా యేసయ్యా నీతి గరపి బ్రోవు       మయ్యా నీతి నిడవయ్యా యేసయ్యా ||పాపి||  3. నీదు సిలువలోని ప్రేమ నెంచదర మౌన? యేసయ్యా నాదు కలుష       మంత బాపి కనికరింపు మా యేసయ్యా ||పాపి||  4.  నీదు రక్తధారలేయిల పాపికాశ్రయము యేసయ్యా నీతిమంతుల       జేయుమయ్యా నీతిసూర్యుండా యేసయ్యా ||పాపి||  5. దాపుగోరినవారలకు నీ ప్రాపుజూపితివి యేసయ్యా పాపశాపము బాపి       నిత్య జీవమిడవయ్యా యేసయ్యా ||పాపి||  6. శాంతి గోరువార లెల్లనీ చెంతకరగినచో యేసయ్యా చింతలెల్ల దీర్చగలవు       శాంతి నొసగెదవు యేసయ్యా ||పాపి||  7. ప...

Vandanambonarthumo | వందనంబొనర్తుమో ప్రభో | Telugu Christian Song Lyrics

Image
వందనంబొనర్తుమో ప్రభో | Vandanambonarthumo | Telugu Christian Song Lyrics | Download వందనంబొనర్తుమో ప్రభో ప్రభో వందనంబొనర్తుమో ప్రభో ప్రభో  వందనంబొనర్తుమో ప్రభో ప్రభో  వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా  వందనంబు లందుకో ప్రభో                  ||వందనం||  ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు  గన్న తండ్రి మించి ఎపుడు గాచియు  ఎన్నలేని దీవెన లిడు నన్న యేసువా  యన్ని రెట్లు స్తోత్రములివిగో                ||వందనం||  ప్రాత వత్సరంపు బాప మంతయు  బ్రీతిని మన్నించి మమ్ము గావుము  నూత నాబ్దమునను నీదు నీతి నొసగుమా  దాత క్రీస్తు నాథ రక్షకా                        ||వందనం||  దేవ మాదు కాలుసేతు లెల్లను  సేవకాలి తనువు దినములన్నియు  నీ వొసంగు వెండి పసిడి జ్ఞానమంత నీ  సేవకై యంగీకరించుమా                      ||వందనం||  కోతకొరకు దాసజనము నంపుమ...

Ninne Sthutintunayya Yesayya | నిన్నే స్తుతియింతునయ్యా యేసయ్యా | Telugu Christian Song Lyrics

Image
నిన్నే స్తుతియింతునయ్యా యేసయ్యా | Ninne Sthutintunayya Yesayya | Telugu Christian Song Lyrics | Download నిన్నే స్తుతియింతునయ్యా యేసయ్యా నిన్నే స్తుతియింతునయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయ్య (2)  నీవే నా మార్గము సత్యము జీవము - నీవేనా రక్షణ విమోచన దుర్గము (2)  నీ సాటి దేవుడు లేడయ్య ఈ జగమందు  నీలాంటి దేవుడు లేడయ్య (2)  ఆరాధింతును నిన్నే ఆరాదింతును (2)|| నిన్నే||  1.  ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచవు - మమ్మును కాపడుటకు నీవే బలిగా మారవు (2)       నీ లాంటి దేవుడు లేడయ్య ఈ జగమందు - నీలాంటి  దేవుడు లేడయ్య (2)       ఆరాధింతును నిన్నే ఆరాదింతును (2) ||నిన్నే||  2.  నేను వెతకకపోయిన నన్ను వెదకితివి- నే ప్రేమించకపోయిననాకై ప్రాణము పెట్టితివి (2)       నీ లాంటి దేవుడు లేడయ్య ఈ జగమందు - నీలాంటి దేవుడు లేడయ్య (2)       ఆరాధింతును నిన్నే ఆరాదింతును (2) ||నిన్నే||

Neevu Chesina Upakaaramulaku | నీవు చేసిన ఉపకారములకు | Telugu Christian Song Lyrics

Image
నీవు చేసిన ఉపకారములకు | Neevu Chesina Upakaaramulaku | Telugu Christian Song Lyrics | Download నీవు చేసిన ఉపకారములకు నీవు చేసిన ఉపకారములకు  నేనేమి చెల్లింతును (2)  ఏడాది దూడెలనా… వేలాది పోట్టేల్లనా (2) ||నీవు చేసిన||  వేలాది నదులంత విస్తార తైలము  నీకిచ్చినా చాలునా (2)  గర్భ ఫలమైన నా జేష్ట్య పుత్రుని  నీకిచ్చినా చాలునా (2)                    ||ఏడాది||  మరణపాత్రుడనైయున్న నాకై  మరణించితివ సిలువలో (2)  కరుణ చూపి నీ జీవ మార్గాన  నడిపించుమో యేసయ్యా (2)            ||ఏడాది||  విరిగి నలిగిన బలి యాగముగను  నా హృదయ మర్పింతును (2)  రక్షణ పాత్రను చేబూని నిత్యము  నిను వెంబడించెదను (2)       ||ఏడాది||  ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు  నీకేమి చెల్లింతును (2)  కపట నటనాలు లేనట్టి హృదయాన్ని  అర్పించినా చాలునా (2)                          ||ఏడాది||

Ae Paapamerugani | ఏ పాపమెరుగని | Telugu Christian Lent Song Lyrics | Download

Image
ఏ పాపమెరుగని | Ae Paapamerugani | Telugu Christian Lent Song Lyrics | Download ఏ పాపమెరుగని యో పావన ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా  నా పాలి దైవమా నా పాపముల కొర కీ పాట్లు నొందినావా  ముళ్ళతో కిరీట – మల్లి నీ శిరముపై – జల్లాటమున మొత్తిరా  ముళ్ళ పోట్లకు శిరము – తల్లడిల్లగ సోమ్మ – సిల్లిపోతివ రక్షకా ||ఏ పాప||  కలువరి గిరి దనుక – సిలువ మోయలేక – కలవరము నొందినావా  సిలువ నీతో మోయ – తులువలు వేరొకని – తోడుగా నిచ్చినారా ||ఏ పాప||  చెడుగు యూదులు బెట్టు – పడరాని పాట్లకు – సుడివడి నడచినావా  కడకు కల్వరి గిరి – కడ కేగి సిల్వను – గ్రక్కున దించినావా ||ఏ పాప||  ఆ కాల కర్ములు – భీకరంబుగ నిన్ను – ఆ కొయ్యపై నుంచిరా  నీ కాలు సేతులు – ఆ కొయ్యకే సూది – మేకులతో గ్రుచ్చినారా ||ఏ పాప||  పలువిధంబుల శ్రమలు – చెలరేగ దండ్రికి – నెలుగెత్తి మొరలిడితివా  సిలువపై పలుమారు – కలుగుచుండెడి బాధ – వలన దాహము నాయెనా ||ఏ పాప||  బల్లిదుండగు బంటు – బల్లెమున నీ ప్రక్క – జిల్లి బడ బొడచినాడా  ఉల్లోలములవలె నల్ల నీరుబుకంగ జల్లారె గద కోపము ||ఏ పాప||  కట ...

Kroththa Yedu Modalu Bettenu | క్రొత్త యేడు మొదలు బెట్టెను | Telugu Christian Song Lyrics

Image
క్రొత్త యేడు మొదలు బెట్టెను | Kroththa Yedu Modalu Bettenu | Telugu Christian Song Lyrics | Download క్రొత్త యేడు మొదలు బెట్టెను క్రొత్త యేడు మొదలు బెట్టెను మన బ్రతుకు నందు  క్రొత్త యేడు మొదలు బెట్టెను  క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త యేట ప్రభుని సేవ  తత్తర పడకుండ జేయు టుత్తమొత్తమంబు జూడ          ||క్రొత్త||  పొందియున్న మేలులన్నియు బొంకంబు మీర  డెందమందు స్మరణ జేయుడి  ఇందు మీరు మొదలుపెట్టు పందెమందు గెల్వ వలయు  అందముగను రవిని బోలి అలయకుండా మెలయకుండా        ||క్రొత్త||  బలము లేని వారమయ్యీను బలమొందవచ్చు  కలిమి మీర గర్త వాక్కున  అలయకుండా అడుగుచుండ నలగకుండా మోదమొంది  బలమొసంగు సర్వ విధుల నెలమి మీర నొచ్చుచుండ            ||క్రొత్త||  పాప పంకమంటినప్పుడు ప్రభు క్రీస్తు యేసు  ప్రాపు జేరి మీరు వేడగా  సేపు మీర తనదు కరుణ పాపమంతా కడిగివేసి  పాప రోగ చిహ్నలన్ని బాపి వేసి శుద్ది చేయు                    ...

Devuni Sthuthiyinchudi | దేవుని స్తుతియించుడి | Telugu Christian Song Lyrics

Image
దేవుని స్తుతియించుడి | Devuni Sthuthiyinchudi | Telugu Christian Song Lyrics | Download దేవుని స్తుతియించుడి దేవుని స్తుతియించుడి  ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి        ||దేవుని||  ఆయన పరిశుద్ధ ఆలయమందు (2)  ఆయన సన్నిధిలో ఆ… ఆ… (2)      ||ఎల్లప్పుడు||  ఆయన బలమును ప్రసిద్ధి చేయు (2)  ఆకశవిశాలమందు ఆ… ఆ… (2)      ||ఎల్లప్పుడు||  ఆయన పరాక్రమ కార్యములన్ బట్టి (2)  ఆయన ప్రభావమును ఆ… ఆ… (2)  ||ఎల్లప్పుడు||  బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి (2)  స్వరమండలములతో ఆ… ఆ… (2)   ||ఎల్లప్పుడు||  సన్న తంతుల సితారతోను (2)  చక్కని స్వరములతో ఆ… ఆ… (2)    ||ఎల్లప్పుడు||  తంబురతోను నాట్యముతోను (2)  తంతి వాద్యములతో ఆ… ఆ… (2)     ||ఎల్లప్పుడు||  పిల్లనగ్రోవుల చల్లగనూది (2)  ఎల్లప్రజలు జేరి ఆ… ఆ… (2)           ||ఎల్లప్పుడు||  మ్రోగుతాళములతో ఆయనన్ స్తుతించుడి (2)  గంభీర తాళముతో ఆ… ఆ… (2)      ...

Prardhana Vinedi Pavanuda | ప్రార్థన వినెడి పావనుడా | Telugu Christian Song Lyrics

Image
ప్రార్థన వినెడి పావనుడా | Prardhana Vinedi Pavanuda | Telugu Christian Song Lyrics | Download      ప్రార్థన వినెడి పావనుడా       ప్రార్థన మాకు నేర్పుమయా                ||ప్రార్థన||  1. శ్రేష్టమైన భావము గూర్చి       శిష్య బృందముకు నేర్పితివి       పరముడ నిన్ను ప్రనుతించెదము       పరలోక ప్రార్థన నేర్పుమయా              ||ప్రార్థన||  2. పరమ దేవుడవని తెలిసి       కరము లెత్తి జంటగా మోడ్చి       శిరమునువంచి సరిగను వేడిన       సుంకరి ప్రార్థన నేర్పుమయా                ||ప్రార్థన||  3. దినదినంబు చేసిన సేవ       దైవ చిత్తముకు సరిపోవ       దీనుడవయ్యి దిటముగా కొండను       చేసిన ప్రార్థన నేర్పుమయా                ...

Entho Vintha Entho Chintha | ఎంతో వింత యెంతో చింత | Telugu Christian Song Lyrics

Image
ఎంతో వింత యెంతో చింత | Entho Vintha Entho Chintha | Telugu Christian Song Lyrics | Download ఎంతో వింత యెంతో చింత ఎంతో వింత యెంతో చింత  యేసునాధు మరణ మంత (2)  పంతము తో జేసి రంత  సొంత ప్రజలు స్వామి నంత (2)      ||ఎంతో||  పట్టి కట్టి నెట్టి కొట్టి  తిట్టి రేసు నాధు నకటా (2)  అట్టి శ్రమల నొంది పలుక  డాయె యేసు స్వామి నాడు (2)       ||ఎంతో||  మొయ్యలేని మ్రాను నొకటి  మోపి రేసు వీపు పైని (2)  మొయ్యలేక మ్రాని తోడ  మూర్చబోయే నేసు తండ్రి (2)      ||ఎంతో||  కొయ్యపై నేసయ్యన్ బెట్టి  కాలు సేతులలో జీలల్ (2)  కఠిను లంత గూడి కొట్టిరి  ఘోరముగ క్రీస్తేసున్ బట్టి (2)      ||ఎంతో||  దాహము గొన చేదు చిరక  ద్రావ నిడిరి ద్రోహు లకటా (2)  ధాత్రి ప్రజల బాధ కోర్చి  ధన్యుడా దివి కేగె నహహా (2)      ||ఎంతో||  బల్లెముతో బ్రక్కన్ బొడవన్  పారే నీరు రక్త మహహా (2)  ఏరై పారే యేసు రక్త  మెల్ల ప్రజల కెలమి నొసగు (2)    ...

Prabhu Yesuni Vadanamulo | ప్రభు యేసుని వదనములో | Telugu Christian Song Lyrics

Image
ప్రభు యేసుని వదనములో | Prabhu Yesuni Vadanamulo | Telugu Christian Song Lyrics | Download ప్రభు యేసుని వదనములో ప్రభు యేసుని వదనములో – నా దేవుడు కనిపించె (2)  పాపాత్ముల బ్రోచుటకై – కృపలొలికిన కలువరిలో (2)  పరలోకముకై – చిర జీవముకై (2)  ప్రార్ధించెను నా హృదయం              ||ప్రభు యేసుని||  దిశలన్నియు తిరిగితిని – నా పాపపు దాహముతో (2)  దౌష్ట్యములో మసలుచును – దౌర్జన్యము చేయుచును (2)  ధన పీడనతో – మృగ వాంఛలతో (2)  దిగాజారితి చావునకు              ||ప్రభు యేసుని||  యేసు నీ రాజ్యములో – భువి కేతెంచెడి రోజు (2)  ఈ పాపిని క్షమియించి – జ్ఞాపకముతో బ్రోవుమని (2)  ఇల వేడితిని – విలపించుచును (2)  ఈడేరెను నా వినతి              ||ప్రభు యేసుని||  పరదైసున ఈ దినమే – నా ఆనందములోను (2)  పాల్గొందువు నీవనుచు – వాగ్ధానము చేయగనే (2)  పరలోకమే నా – తుది ఊపిరిగా (2)  పయనించితి ప్రభు కడకు          ||ప్రభు యేసుని|...

Siluve Naa Sharanaayenu | సిలువే నా శరణాయెను రా | Telugu Christian Song Lyrics

Image
సిలువే నా శరణాయెను రా | Siluve Naa Sharanaayenu | Telugu Christian Song Lyrics | Download సిలువే నా శరణాయెను రా           సిలువే నా శరణాయెను రా       నీ… సిలువే నా శరణాయెను రా       సిలువ యందే ముక్తి బలము చూచితి రా       నీ… సిలువే నా శరణాయెను రా  1. సిలువను వ్రాలి యేసు – పలికిన పలుకులందు       విలువలేని ప్రేమామృతము గ్రోలితి రా       నీ… సిలువే నా శరణాయెను రా  2. సిలువను చూచు కొలది – శిల సమానమైన మనసు       నలిగి కరిగి నీరగుచున్నది రా       నీ… సిలువే నా శరణాయెను రా  3. సిలువను దరచి తరచితి – విలువకందగరాని నీ కృప       కలుషమెల్లను బాపగ చాలును రా       నీ… సిలువే నా శరణాయెను రా  4. పలు విధ పథములరసి – ఫలితమేమి గానలేక       సిలువ యెదుటను నిలచినాడను రా       నీ… సిలువే నా శరణాయెను రా  5. శరణు యేసు శరణు శరణు – శరణ...

Parama Jeevamu Naaku Nivva | పరమ జీవము నాకు నివ్వ | Telugu Christian Song Lyrics

Image
పరమ జీవము నాకు నివ్వ | Parama Jeevamu Naaku Nivva | Telugu Christian Song Lyrics | Download పరమ జీవము నాకు నివ్వ పరమ జీవము నాకు నివ్వ  తిరిగి లేచెను నాతో నుండ  నిరంతరము నన్ను నడిపించును  మరల వచ్చి యేసు కొని పోవును  యేసు చాలును – యేసు చాలును  యే సమయమైన యే స్థితికైన  నా జీవితములో యేసు చాలును  సాతాను శోధనలధికమైన  సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను  లోకము శరీరము లాగినను  లోబడక నేను వెళ్ళెదను              ||యేసు||  పచ్చిక బయలులో పరుండజేయున్  శాంతి జలము చెంత నడిపించును  అనిశము ప్రాణము తృప్తిపరచున్  మరణ లోయలో నన్ను కాపాడును            ||యేసు||  నరులెల్లరు నన్ను విడిచినను  శరీరము కుళ్ళి కృశించినను  హరించినన్ నా ఐశ్వర్యము  విరోధివలె నన్ను విడచినను        ||యేసు||

Jeevithaanthamu Varaku Neeke | జీవితాంతము వరకు నీకే | Telugu Christian Song Lyrics

Image
జీవితాంతము వరకు నీకే | Jeevithaanthamu Varaku Neeke | Telugu Christian Song Lyrics | Download జీవితాంతము వరకు నీకే జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని  నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి నడుపుము రక్షకా (2)   ||జీవితాం||  ఎన్ని యాటంకంబులున్నను ఎన్ని భయములు కల్గిన (2)   అన్ని పోవును నీవు నాకడ నున్న నిజమిది రక్షకా  ||జీవితాం||  అన్ని వేళల నీవు చెంతనె యున్న యను భవమీయవె (2) తిన్నగా నీ మార్గమందున పూనినడచెద రక్షకా ||జీవితాం||  నేత్రములు మిరుమిట్లు గొలిపెడి చిత్రదృశ్యములున్నను (2) శత్రువగు సాతాను గెల్వను చాలు నీ కృప రక్షకా ||జీవితాం||  నాదు హృదయమునందు వెలుపట నావరించిన శత్రులన్ (2) చెదర గొట్టుము రూపుమాపుము శ్రీఘ్రముగ నారక్షకా ||జీవితాం||   మహిమలో నీవుండు చోటికి మమ్ము జేర్చెదనంటివే (2) ఇహము దాటినదాక నిన్ను వీడనంటిని రక్షకా ||జీవితాం||   పాప మార్గము దరికి బోవక పాత యాశల గోరక (2)   ఎపుడు నిన్నే వెంబడింపగ కృప నొసంగుము రక్షకా ||జీవితాం||

Raajulaku Raajaina | రాజులకు రాజైన | Telugu Christian Song Lyrics | Download

Image
రాజులకు రాజైన | Raajulaku Raajaina | Telugu Christian Song Lyrics | Download     రాజులకు రాజైన ఈ మన విభుని       పూజ చేయుటకు రండి       ఈ జయశాలి కన్నా       మనకింకా రాజెవ్వరును లేరని        ||రాజులకు||  1. కరుణ గల సోదరుండై ఈయన       ధరణికేతెంచెనయ్యా (2)       స్థిరముగా నమ్ముకొనిన       మనకొసగు పరలోక రాజ్యమును        ||రాజులకు||  2. నక్కలకు బొరియలుండే నాకాశ       పక్షులకు గూళ్లుండెను (2)       ఒక్కింత స్థలమైనను       మన విభుని కెక్కడ లేకుండెను        ||రాజులకు||  3. త్వరపడి రండి రండి ఈ పరమ       గురుని యొద్దకు మీరలు (2)       దరికి జేరిన వారిని       ఈ ప్రభువు తరుమడెన్నడు దూరము        ||రాజులకు||

Ee Sayamkalamuna Yesu Prabho | ఈ సాయంకాలమున యేసు ప్రభో | Telugu Christian Song Lyrics

Image
ఈ సాయంకాలమున యేసు ప్రభో | Ee Sayamkalamuna Yesu Prabho | Telugu Christian Song Lyrics | Download ఈ సాయంకాలమున యేసు ప్రభో ఈ సాయంకాలమున యేసు ప్రభో వేడెదము  నీ సుదయారస మొల్క నిత్యంబు మముఁగావు ||ఈ ||  చెడ్డ కలల్ రాకుండ నడ్డగించుమి ప్రభో  బిడ్డలము రాత్రిలో భీతి బాపుము తండ్రీ ||ఈ ||   దుష్టుండౌ శోధకునిఁ ద్రొక్కుటకు బలమిమ్ము  భ్రష్టత్వమున మేము పడకుండఁ గాపాడు ||ఈ ||  నీ యేక పుత్రుండౌ శ్రీ యేసు నామమున  సాయం ప్రార్థన లెల్ల సరగ నాలించుమా ||ఈ ||  జనక సుత శుద్థాత్మ ఘనదేవా స్తుతియింతుం  అనిశము జీవించిరా జ్యంబుఁ జేయు మామేన్ ||ఈ||

Eelaatidaa Yesu Prema | ఈలాటిదా యేసు ప్రేమ | Telugu Christian Song Lyrics

Image
ఈలాటిదా యేసు ప్రేమ | Eelaatidaa Yesu Prema | Telugu Christian Song Lyrics | Download ఈలాటిదా యేసు ప్రేమ      ఈలాటిదా యేసు ప్రేమ -నన్ను       తూలనాడక తనదు జాలి చూపినదా        ||ఈలాటిదా||   1. ఎనలేని పాప కూపమున – నేను       తనికి మిణుకుచును నే దరి గానకుండన్       కనికరము పెంచి నాయందు – వేగ       గొనిపోవ నా మేలు కొరికిందు వచ్చె        ||ఈలాటిదా||  2. పెనుగొన్న దుఃఖాబ్ధిలోన – నేను       మునిగి కుములుచు నేడు పునగుండు నపుడు       నను నీచుడని త్రోయలేక – తనదు       నెనరు నా కగుపరచి నీతి జూపించె          ||ఈలాటిదా||  3. నెమ్మి రవ్వంతైనా లేక – చింత       క్రమ్మిపొగలుచు నుండ-గా నన్ను జూచి       సమ్మతిని నను బ్రోవ దలచి – కరము       జాచి నా చేయి బట్టి చక్కగా పిలిచె          ||ఈ...

Randi Suvaartha Sunaadamutho | రండి సువార్త సునాదముతో | Telugu Christian Song Lyrics

Image
రండి సువార్త సునాదముతో |  Randi Suvaartha Sunaadamutho | Telugu Christian Song Lyrics | Download రండి సువార్త సునాదముతో     రండి సువార్త సునాదముతో – రంజిలు సిలువ నినాదముతో       తంబుర సితార నాదముతో – ప్రభుయేసు దయానిధి సన్నిధికి  1. యేసే మానవజాతి వికాసం – యేసే మానవ నీతి విలాసం       యేసే పతిత పావన నామం – భాసుర క్రైస్తవ శుభనామం ||రండి||  2. యేసే దేవుని ప్రేమ స్వరూపం – యేసే సర్వేశ్వర ప్రతిరూపం       యేసే ప్రజాపతి పరమేశం – ఆశ్రిత జనముల సుఖవాసం ||రండి||  3. యేసే సిలువను మోసిన దైవం – యేసే ఆత్మల శాశ్వత జీవం       యేసే క్షమాపణ అధికారం – దాసుల ప్రార్ధన సహకారం ||రండి||  4. యేసే సంఘములో మన కాంతి – యేసే హృదయములో ఘనశాంతి       యేసే కుటుంబ జీవన జ్యోతి – పసిపాపల దీవెన మూర్తి  ||రండి||  5. యేసే జీవన ముక్తికి మార్గం – యేసే భక్తుల భూతల స్వర్గం       యేసే ప్రపంచ శాంతికి సూత్రం – వాసిగ నమ్మిన జనస్తోత్రం ||రండి||

శ్రీ యేసుండు జన్మించె | Sri Yesundu Janminche | Telugu Christian Song Lyrics | Download

Image
శ్రీ యేసుండు జన్మించె  | Sri Yesundu Janminche | Telugu Christian Song Lyrics | Download శ్రీ యేసుండు జన్మించె      శ్రీ యేసుండు జన్మించె రేయిలో (2)       నేడు పాయక బెత్లెహేము ఊరిలో (2)           ||శ్రీ యేసుండు||  1. ఆ కన్నియ మరియమ్మ గర్భమందున (2)       ఇమ్మానుయేలనెడి నామమందున (2)        ||శ్రీ యేసుండు||  2. సత్రమందున పశువులశాల యందున (2)       దేవపుత్రుండు మనుజుండాయెనందునా (2)  ||శ్రీ యేసుండు||  3. పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి (2)       పశుల తొట్టిలో పరుండ బెట్టబడి (2)             ||శ్రీ యేసుండు||  4. గొల్లలెల్లరు మిగుల భీతిల్లగా (2)       దెల్పె గొప్ప వార్త దూత చల్లగా (2)               ||శ్రీ యేసుండు||  5. మన కొరకొక్క శిశువు పుట్టెను (2)       ధరను మన దోషములబోగొట్టెను (2)    ...

Entha Jaali Yesuvaa | ఎంత జాలి యేసువా | Telugu Christian Song Lyrics | Download

Image
ఎంత జాలి యేసువా | Entha Jaali Yesuvaa | Telugu Christian Song Lyrics | Download ఎంత జాలి యేసువా      ఎంత జాలి యేసువా            యింతయని యూహించలేను      ||ఎంత||  1. హానికరుడ హింసకుడను       దేవదూషకుడను నేను (2)       అవిశ్వాసినైన నన్ను (2)       ఆదరించినావుగా      ||ఎంత||  2. రక్షకుండ నాకు బదులు       శిక్ష ననుభవించినావు (2)       సిలువయందు సొమ్మసిల్లి (2)       చావొందితివి నాకై      ||ఎంత||  3. ఏమి నీ కర్పించగలను       ఏమి లేమి వాడనయ్యా (2)       రక్షణంపు పాత్రనెత్తి (2)       స్తొత్రమంచు పాడెద      ||ఎంత||  4. నీదు నామమునకు యిలలో       భయపడెడు వారి కొరకై (2)       నాథుడా నీ విచ్చు మేలు (2)       ఎంత గొప్పదేసువా...

Vijaya Geethamul Paadare | విజయ గీతముల్ పాడరే | Telugu Christian Song Lyrics

Image
విజయ గీతముల్ పాడరే | Vijaya Geethamul Paadare | Telugu Christian Song Lyrics | Download విజయ గీతముల్ పాడరే      విజయ గీతముల్ పాడరే       క్రీస్తుకు జయ – విజయ గీతముల్ పాడరే (2)       వృజిన మంతటి మీద – విజయ మిచ్చెడు దేవ       నిజ కుమారుని నామమున్       హృదయములతో – భజన జేయుచు నిత్యమున్            ||విజయ||  1. మంగళముగ యేసుడే       మనకు రక్షణ – శృంగమై మరి నిలచెను       నింగిన్ విడిచి వచ్చెను       శత్రుని యుద్ధ – రంగమందున గెల్చెను       రంగు మీరగదన – రక్త బలము వలన       పొంగు నణగ జేసెను       సాతానుని బల్ – కృంగ నలిపి చీల్చెను ||విజయ||  2. పాపముల్ దొలగింపను       మనలను దన స్వ – రూపంబునకు మార్పను       శాపం బంతయు నోర్చెను       దేవుని న్యాయ – కోపమున్ భరియించెను   ...

Jeevithamanthaa Nee Prema | జీవితమంతా నీ ప్రేమ | Telugu Christian Song Lyrics

Image
జీవితమంతా నీ ప్రేమ | Jeevithamanthaa Nee Prema | Telugu Christian Song Lyrics | Download జీవితమంతా నీ ప్రేమ గానం      జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో దేవా       ప్రచురింతు మేము నీ కీర్తిన్ ఆనంద గానంబుతో (2)  1. సర్వ సమయములలో నీ స్తుతి గానం       ఎల్లవేళలయందు నీ నామ ధ్యానం (2)       మాకదియే మేలు ఈ జీవితమున       స్తుతియింతు నా రక్షకా – (2)         ||జీవితమంతా||  2. సృష్టినంతటిని నీ మాట చేత       సృజియించితివిగా మా దేవ దేవా (2)       నీ ఘనమగు మహిమం వర్ణింప తరమా       స్తుతియింతు నా రక్షకా – (2)         ||జీవితమంతా||  3. కలుషాత్ములమైన మా కొరకు నీ       విలువైన ప్రాణంబు నర్పించితివిగా (2)       కల్వరి గిరిపై చూపిన ప్రేమన్       స్తుతియింతు నా రక్షకా – (2)         ||జీవితమంతా||

Ninne Preminthunu | నిన్నే ప్రేమింతును | Telugu Christian Song Lyrics | Download

Image
నిన్నే ప్రేమింతును | Ninne Preminthunu | Telugu Christian Song Lyrics | Download    నిన్నే ప్రేమింతును      నిన్నే ప్రేమింతును,  నిన్నే ప్రేమింతును  -  యేసు       నిన్నే ప్రేమింతును,   నే వెనుదిరుగా       నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా       నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా  1. నిన్నే పూజింతును,  నిన్నే పూజింతును -  యేసు       నిన్నే పూజింతును,  నే వెనుదిరుగా       నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా       నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా  2. నిన్నే కీర్తింతును,  నిన్నే కీర్తింతును -  యేసు       నిన్నే కీర్తింతును,  నే వెనుదిరుగా       నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా       నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగ  3. నిన్నే ప్రార్దింతును,  నిన్నే ప్రార్ద...

Ella Velalandu | ఎల్లవేళలందు | Telugu Christian Song Lyrics

Image
ఎల్లవేళలందు | Ella Velalandu | Telugu Christian Song Lyrics | Download ఎల్లవేళలందు      ఎల్లవేళలందు – కష్టకాలమందు       వల్లభుండా యేసున్‌ స్తుతింతున్‌       ఎల్లను నీవే నా కెల్లెడల       వల్లపడదే వివరింపన్‌ (2)  1. విమోచకుడా – విమోచన నీవే       రక్షకుడవు – నా రక్షణ నీవే (2)        ||ఎల్లవేళలందు||  2. సృష్టికర్తవు – సహాయము నీవే       ఇష్టుడ నీవు – త్రిత్వము నీవే (2)        ||ఎల్లవేళలందు||  3. జ్ఞానము నీవే – నా పానము నీవే       దానము నీవే – నా గానము నీవే (2)        ||ఎల్లవేళలందు||  4. జ్యోతివి నీవే – నా నీతివి నీవే       ఆదియు నీవే – నా అంతము నీవే (2)        ||ఎల్లవేళలందు||  5. నిత్యుడ నీవే – నా సత్యుండ నీవే       స్తోత్రము నీవే – నా నేత్రము నీవే (2)        ||ఎల్లవేళలందు||  6. జ...

Geetham Geetham | గీతం గీతం జయ జయ గీతం | Telugu Christian Song Lyrics | Download

Image
గీతం గీతం జయ జయ గీతం | Geetham Geetham | Telugu Christian Song Lyrics | Download గీతం గీతం జయ జయ గీతం      గీతం గీతం జయ జయ గీతం       చేయి తట్టి పాడెదము (2)       యేసు రాజు లేచెను హల్లెలూయ       జయ మార్భటించెదము (2)       || గీతం||  1. చూడు సమాధిని మూసినరాయి       దొరలింపబడెను       అందు వేసిన ముద్ర కావలి నిల్చెను       దైవ సుతుని ముందు            || గీతం||  2. వలదు వలదు యేడువవలదు       వెళ్ళుడి గలిలయకు       తాను చెప్పిన విధమున తిరిగి లేచెను       పరుగిడి ప్రకటించుడి          || గీతం||  3. అన్న కయప వారల సభయు       అదరుచు పరుగిడిరి       ఇంక దూత గణముల ధ్వనిని వినుచు       వణకుచు భయపడిరి              || గీత...