Posts

Showing posts from September, 2026

Goppa Deva Naaku | గొప్ప దేవ నాకు | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.60 - తండ్రియగు దేవుడు నీవు నాతండ్రివి గొప్ప దేవ నాకు తండ్రివు-యాకాశమందు- గొప్ప దేవ నాకు దండ్రివి = తప్పకుండ వత్తు నీ-దరికి యేసు నామమందు-గొప్ప కరుణచేత న- న్నిప్పుడు తగజేర్చుకొనుము ॥ గొప్ప ॥ 1. నీవు మిగుల గొప్ప వాడవు నా సృష్టి కర్త -యీవు లెపుడు నిచ్చు వాడవు= భావమందు నిను దలంచి- పావనాత్మ నాకు నిచ్చి- జీవమార్గ మందు నిలిపి- కావు మనుచు వేడుకొందు ॥ గొప్ప ॥ 2. చిన్న వాని నంగి ప్రార్ధన-నీలోకమందు-మున్ను దయను విన్న వాడవు = సన్నుతుడగు యేసు నీదు - సన్నిధి నున్నాడు గాన-నన్ను గనికరించు మనుచు- నిన్ను నమ్మి వత్తు నిపుడు ॥ గొప్ప ॥ 3. విలువ గల్గు నీదు నాజ్ఞలు- నాహృదయమందు -బలువిధముల దలచు చుందును= బలుకులందు బనులయందు- బలముజూపి నిన్ను గొలిచి-యిలనునిన్ను బ్రీతి పరతు- నలయక నీ కరుణ మెయిని ॥ గొప్ప ॥ 4. మీది రాజ్యమందు జేర్చుము- కరుణా సముద్ర -బీద నైన నన్ను గరుణచే= సోదరులను గూడికొనుచు-మోద మొప్పగ నీదు సేవ- బాదుకొనుచు నుందును నీ పాదపద్మములను బట్టి ॥ గొప్ప ॥ ––పులిపాక జగన్నాధము Goppa Deva naaku tandrivu-aakaashamandu-goppa Deva naaku dandrivi = Ta...

Sukshēma Shubhakaala | సుక్షేమ శుభకాల | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.59 - సుక్షేమ శుభకాల 1. సుక్షేమ శుభకాల విశ్రాంతి దినమా విచార మెల్ల తీర్చు దైవాదివారమా ఈనాడు మేము కూడి దేవాలయంబున యా త్ర్యేక దేవ స్తుతి గావింతు మెంతయు 2. నీయందు సృష్టికర్త విశ్రమ మొందెను నీయందు యేసు క్రీస్తు మృత్యు బంధమును త్రెంచుచు తాను లేచి చావున్ జయించెన్ నీ యందు పావనాత్మ మాకియ్య బడెను 3. భూవాసు లీ దినంబు సంతోష పడుచు సువార్తవిని, పాడి మా యేసు స్తోత్రము పితృ పుత్ర శుద్ధాత్మ త్రిత్వంబౌ దేవుని ఉత్సాహ ధ్వనితోడ నెంతో స్తుతింతురు. అను: జాకబ్ చేంబర్లేన్ ––క్రిష్టఫర్ వర్డ్స్ వర్త్ 1. Sukshēma shubhakaala Vishraanti dinamaa Vichaara mella teerchu Daivaadivaaramaa Eenaadu memu koodi Devaalayambuna Yaa tryeka Deva stuti Gaavintu mentayu 2. Neeyandu Srushtikarta Vishrama mondenu Neeyandu Yesu Kreesthu Mrutyu bandhamunu Trenchuchu taanu lechi Chaavun jayinchen Nee yandu Paavanaatma Maakiyya badenu 3. Bhoovaasu lee dinambu Santosha paduchu Suvaartavini, paadi Maa Yesu stotramu Pitru putra Shuddhaatma Trittvambou Devuni Utsaaha dhvan...

Idi Yehovaa Kaliginchina | ఇది యెహోవా కలిగించిన | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.58 - ప్రభునికైన ప్రత్యేక దినములు ప్రభు దినము ఇది యెహోవా కలిగించిన దినము = సుదివసంబునను-జొప్పడు గడియలు-కొదువలేని దయ-గుల్కెడు వానివి 1. మోక్షము భూమియు స-మ్మోద మంది నుతు = లక్షరు గద్దె చుట్టు నాక్రమింతురు గాక 2. అతడీ దినమం-దంత మొందు సర= వితతి నుండి వే-వేగ వచ్చెను 3. ఆ పిశాచ రా-రాజ్యంబు కూలినది = ఆ పరేశు విజ-యము లీ దినమున 4. సేవక వరులు విల-సింపగ జేసి యా= పావనాద్భుతముల- బ్రచురముజేయుదు 5. దావీదుని వర-తనయుడై యభిషే=కావృతుడౌ రాజా- గ్రణికి హోసన్నా ––పురుషోత్తము చౌధరి Idi Yehovaa kaliginchina dinamu = Sudivasambunanu-joppadu Gadiyalu-koduvanileni daya-gulkedu vaanivi 1. Mokshamu bhoomiyu sa-mmooda mandi nutu = Laksharu gadd e chuttu naakraminturu gaaka 2. Atadee dinamam-danta mondu sara= Vitat i nundi ve-vega vachchenu 3. Aa pishaacha raa-raajyambu koolinadi = Aa Pareshu vija-yamu lee dinamuna 4. Sevaka varulu vila-simpaga jesi yaa= Paavanaadbhutamula- brachuramu jeyudu 5. Daaveeduni vara-tanayudai yabhishe-kaavritudau...

O Rakshakaa, Nee | ఓరక్షకా, నీ దివ్యనామము | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.57 - Saviour, again to thy dear Name we raise 1. ఓరక్షకా, నీ దివ్యనామము ఐక్యంబుతోను స్తుతియింతుము ఆరాధనాంత మొందు వేళయం దనుగ్రహించు నీదు దీవెనన్ 2. గృహంబు జేర నాత్మ శాంతిని ఒసంగి మాతో నుండుముసదా ఇచ్చట సేవ జేయు మమ్మును పాపంబు జేయుకుండగాయుము 3. మా చుట్టునుండు మబ్బునప్రభో ని దివ్యకాంతిన్మాకునియ్యుమా పాపాంధకార బాధనుండి నీ బిడ్డల మైన మమ్ముబ్రోవుమా ––జాన్ ఎల్లెర్టన్ అను: బర్నాల్డ్ లూకాస్ 1. O Rakshakaa, nee divyanaamamu Aikyambutonu stutiyintumu Aaraadhanaanta mondu velayam Danugrahinchu needu deevenan 2. Gruhambu jera naatma shaantini Osangi maato nundumusadaa Ichchata seva jeyu mammunu Paapambu jeyukundagaayumu 3. Maa chuttunundu mabbuna Prabho Nee divyakaantin maakuniyyumaa Paapaandhakaara baadha nundi nee Biddala maina mammu brovumaa ––Jaan Ellerton Anu: Barnald Lukas

Raatriyaye Nannedabaayaku | రాత్రియయ్యె నన్నెడబాయకు | Andhra Kraistava Keerthanalu

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.56 - Abide with me, fast falls the eventide 1. రాత్రియయ్యె నన్నెడబాయకు ధాత్రిపై జీకటులు గ్రమ్మెను సహాయ మేమి లేనివారికి సహాయుడా, నన్బాసిపోకుమీ. 2. ఏకాలంబైన నీ సహాయము లేక పిశాచిన్ గెల్వజాలను నీకంటె దిక్కు నాకు లేదుగా లోక ప్రకాశుడా నన్బాయకు. 3. నా చెంత నీవు చేరియుండగ ఏ చింతయైన నన్నుసోకునా ఏ శత్రువైన నన్ను గెల్చునా నా శైలమా, నన్బాసి పోకుమా. 4. సమృద్ధుడు సహాయుడాయెను ఓ మృత్యువా నీ ముల్లు గెల్చునా? సమాధి నీకు జయ మబ్బునా? మామధ్యమున్ సర్వేశపాయకు. 5. రేవు నే జేరబోవు వేళలోన్ కావుమయ్యా నీదీప్తి జూపుచున్ చావు జీవంబులందు నైనను నీవు తోడై నన్బాసి పోకుము. ––హెన్రీ ప్రాన్సిస్ లైట్ 1. Raatriyaye nannedabaayaku Dhaatripai jeekatulu grammenu Sahaaya memi lenivaariki Sahaayudaa, nanbaasipokumi. 2. Ekaalambaina nee sahaayamu Leka pishaachin gelvajaalanu Neekante dikku naaku ledugaa Loka prakaashudaa nanbaayaku. 3. Naa chenta neevu cheriyundaga Ye chintayaina nannusokunaa Ye shatruvaina nannu gelchunaa Naa shailamaa, nanbaasi pokumaa. 4. ...

Proddu Grunkuchunnadi | ప్రొద్దు గ్రుంకుచున్నది | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.55 - Day is dying in the west ॥ శుద్ధ, శుద్ధ, శుద్ధ సర్వేశుడా ఇద్దరాకాశంబులు సన్నుతించుచున్నవి సర్వోన్నతా ॥ 1. ప్రొద్దు గ్రుంకుచున్నది సద్దణంగుచున్నది యాకసంబు దివ్వెలు లోకమున్ వెల్గింపగా స్తుతించుడి ॥ శుద్ధ, శుద్ధ, శుద్ధ సర్వేశుడా ఇద్దరాకాశంబులు సన్నుతించుచున్నవి సర్వోన్నతా ॥ 2. జీవితాంతమందున నీ విచిత్ర జ్యోతులన్ జూచుచుండగాను మా కీ వొసంగు నీ కృపన్ నిత్యోదయం ॥ శుద్ధ, శుద్ధ, శుద్ధ సర్వేశుడా ఇద్దరాకాశంబులు సన్నుతించుచున్నవి సర్వోన్నతా ॥ 3. నిన్ను గోరువారము సన్ను తేశ నీ దరిన్ మమ్ముజేర్చుకొమ్ము నీ విమ్ము నిత్య సౌఖ్యమున్ స్తోత్రం నీకు. ॥ శుద్ధ, శుద్ధ, శుద్ధ సర్వేశుడా ఇద్దరాకాశంబులు సన్నుతించుచున్నవి సర్వోన్నతా ॥ ––మేరి లాల్బరీ. అను: ఒంగోలు దావీదు || Shuddha, Shuddha, Shuddha Sarveshudaa Iddar aakaashambulu Sannutinchuchunnavi Sarvonnataa || 1. Proddu grunkuchunnadi Saddanangu chunnadi Yaakasambu divvelu Lokamun velgimpagaa Stutinchudi || Shuddha, Shuddha, Shuddha Sarveshudaa Iddar aakaashambulu Sannutinchuchunnavi Sarvonnat...

Naa Yesoo, Aatma | నా యేసూ, ఆత్మ | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.54 - Sun of my soul, thou Saviour dear 1. నా యేసూ, ఆత్మ సూర్యుడా నీవున్న రాత్రి కమ్మదు నా యాత్మలో నీ విప్పుడు వసించి పాయకుండుమీ. 2. నేను నిద్రించు వేళలో నాకు నభయ మియ్యుము నే లేచి పని చేయగా నా యొద్ద నుండు రక్షకా. 3. నా తోడ రాత్రింబగళ్ళు నీ వుండి నడిపించుము నీవు నాతో లేకుండినన్ జీవింప జావజాలను. 4. నేడు నీ దివ్య వాక్యము వినిన పాపు లెల్లరిన్ క్షమించి గుణపరచి నీ మందలోకి జేర్చుము. 5. రోగిని స్వస్థపరచి బీదలను పోషించుమీ దుఃఖించువారి దుఃఖము బాపి యానంద మియ్యుము. ––జాన్‌ కేబిల్‌, అను; జాకబ్‌ చేంబర్లేన్‌ 1. Naa Yesoo, aatma Sooryudaa Neevunna raatri kammadu Naa yaatmalo nee vippudu Vasinchi paayakundumi. 2. Nenu nidrinchu velalo Naaku nabhaya miyyumu Ne lechi pani cheyagaa Naa yodda nundu Rakshakaa. 3. Naa toda raatrimbagallu Neevundi nadipinchumu Neevu naato lekundinan Jeevimpa jaavajaalanu. 4. Nedu nee divya vaakyamu Vinina paapu lellarin Kshaminchi gunaparachi Nee mandaloki jerchumu. 5. Rogini svasthaparachi Beedhalanu p...

Ee Saayamkaalamuna | ఈ సాయంకాలమున | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.53 - సాయంతన ప్రార్థన ఈ సాయంకాలమున -యేసు ప్రభో వేడెదము = నీ సుదయారస మొల్క - నిత్యంబు మము గావు ॥ ఈ ॥ 1. చెడ్డకలల్ రాకుండ- నడ్డగించుము ప్రభో=బిడ్డలము రాత్రిలో-భీతి బాపుము తండ్రీ ॥ ఈ ॥ 2. దుష్టుండౌ శోధకుని -ద్రొక్కుటకు బలమిమ్ము- భ్రష్టత్వమున మేము - పడకుండా గాపాడు ॥ ఈ ॥ 3. నీ యేక పుత్రుండౌ - శ్రీ యేసు నామమున -సాయంప్రార్ధన లెల్ల -సరగ నాలించుమా ॥ ఈ ॥ 4. జనక సుత శుద్ధాత్మ - ఘనదేవా స్తుతియింతు- అనిశము జీవించి రా జ్యంబు జేయు మామేన్ ॥ ఈ ॥ ––మల్లెల దావీదు Ee saayamkaalamuna-Yesu Prabho vededamu= Nee sudayaarasa molka-nityambu mamu gaavu || Ee || 1. Cheddakalal raakunda-naḍḍaginchumu Prabho=Biḍḍalamu raatrilo-bheethi baapumu Tandri || Ee || 2. Dushtundau shodhakuni-drokkutaku balamimmu-bhrashtatvamuna memu-padakunda gaapaadu || Ee || 3. Nee yeka putrundau-Sri Yesu naamamuna-saayam praarthana lella-saraga naalinchumaa || Ee || 4. Janaka suta Shuddhaatma-ghanadevaa stutiyintu-anishamu jeevinchi raajyambu jeyu maamen ...

Aakaashambu Bhumiyu | ఆకాశంబు భూమియు | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.52 - సాయంతన ప్రార్థన ॥ ఆకాశంబు ॥ 1. ఆకాశంబు భూమియు- అంతట చీకటి యాయెను=ప్రాకెడు చీకటి సమయమున ప్రార్థన చేతుము మా దేవా ॥ ఆకాశంబు ॥ 2. చక్కని చుక్కలు మింటను- చక్కగ మమ్మును జూడగ= ప్రక్కకురావె వేగముగా - ప్రభువా గావుము నీ నీడన్ ॥ ఆకాశంబు ॥ 3. చిన్న చిన్న పాపలు- చిన్న చిన్న పూవులు- ఎన్నో ఎన్నో జీవులు-నిన్నే గొలిచి నిద్రించున్ ॥ ఆకాశంబు ॥ 4. చిన్ని చిన్ని పాపలు- చిన్ని చిన్ని పడకలలో = చిన్ని కన్నులు మూయంగా -చెన్నుగ యేసుగావుమా ॥ ఆకాశంబు ॥ 5. నేలను బోయెడి బండ్లలో -నీటను బోయెడి ఓడలలో గాలి విమానంబుల లోన- కావుము దేవ ప్రయాణికులన్ ॥ ఆకాశంబు ॥ 6. రాత్రిలో నీదు దూతలు రమ్యంబైన రెక్కలతో = చిత్రంబుగ మమ్మును గ్రమ్మన్- నిద్రించెదము మా దేవా ॥ ఆకాశంబు ॥ 7. తెల్లవారుజామున- తెలివొంది మేమందరము = మెల్లగలేచి నుతియింపన్- మేల్కొల్పుము మా ప్రియతండ్రి ॥ ఆకాశంబు ॥ 8. జనక తనయా శుద్ధాత్మా- ఘనత మహిమ స్తోత్రములు= అనిశము నీకే చెల్లునుగా- అనిశము చెల్లును నీకామెన ॥ ఆకాశంబు ॥ ––ఏ.చార్లెస్ క్సింగర్ || Aakaashambu || 1. Aakaashambu bhumiyu- antata ...

Dinamu Gatiyinchenu | దినము గతియించెను | Andhra Kraistava Keerthanalu

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.51 - సాయంతన స్తవము దినము గతియించెను-దిన నాధుడ పరాద్రి- వెనుకడాగె-నికమా- మునిమాపు సంస్తవముగొనుము సంప్రీతిమై-ఘనుడ దేవా ॥ దినము ॥ 1. సరవి నంబరవీధి - సంజ కెంజాయలు- మురువుజూపె- ప్రభువా- దొరయు నీ ముఖకాంతి-కిరణ జాలము మాపై-నెఱప రమ్ము ॥ దినము ॥ 2. కటికిచీకటులు ది-క్తటముల గలిసియు-త్కటములైన-నీ-చెం- గట నున్న నెట్టి సం-కటమేని మమ్ము- దాకుటకు జంకు ॥ దినము ॥ 3. తలపు వలనను నోటి-పలుకు వలనను జెనటి-పనులవల్ల-మేము- వలసి చేసిన పాప-ముల నెల్ల క్షమియింపు-మ లఘుక్షాంతి దినము ॥ దినము ॥ 4. మమ్మురమ్మగు శోధ- నమ్ములపై విజ-యమ్ము నొందనీ- దినమ్ము మాకు సామర్థ్య మొసగితివి వంద-నమ్ము దేవ ॥ దినము ॥ 5. ఈ దినము మాకు స-మ్మోదంబుతో నిచ్చి- యాదుకొన్న- వరమౌ నీ దివ్యదానముల-కై దేవ! మాకృత-జ్ఞతను గొమ్ము ॥ దినము ॥ 6. అలసిన మా దేహములకు వలసిన నిదుర గలుగజేసి - నీ దూ-తల హస్తములలో మ-మ్ములను దాచుము భద్ర-ముగను దేవ ॥ దినము ॥ 7. అరుణోదయమున ని-న్నర్చించు కొఱకు నీ-కరము సాచి-మమ్ము- త్వరగా మేల్కొల్పుము-స్వాస్థ్య ప్రదాతవై-పరమదేవ ॥ దినము ॥ 8. దాత వీవె లోక- త్రాత-వీవె మాకు-నేత వీవె-యేసు-న...

Deva Neeku Stotramu | దేవ నీకు స్తోత్రము | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.50 - సాయం ప్రార్థన దేవ నీకు స్తోత్రము- ఈ రాత్రిలో -నీ వెలుగు దీవెనకై=కావుము నన్నిప్పుడు -రాజుల రాజా- ప్రోవు రెక్కల నీడలో ॥ దేవ ॥ 1. పూని యేసుని పేరిటన్-మన్నించుము-కాని పనులను జేసినన్= నేను నిదురపోవక ముందే సమా=ధాన మిమ్ము నాకు ॥ దేవ ॥ 2. చావు నొందు కెన్నడు-భీతి లేక-జీవింప నేర్పించుము-జీవ పునరుత్థానము -లో మహిమతో- లేవ మడియ నడ్పుము ॥ దేవ ॥ 3. నేను జీకటి నిద్రను- రోయుచు దుద-లేని దినంబునందు= మాన కుండగ దూతలన్-గూడి చేయ-గాన మెప్పుడు గల్గునో ॥ దేవ ॥ ––మత్తయి సమూయేలు Deva neeku stotramu- Ee raatrilo- Nee velugu deevenakai= Kaavumu Nannippudu-Raajula Raajaa-Provu rekkala needalo || Deva || 1. Pooni Yesuni peritan-manninchumu-Kaani panulanu jesinan= Nenu nidurapovaka munde sama=dhaana mimmu naaku || Deva || 2. Chaavu nondu kennadu-bheethi leka-jeevimpa nerpinchumu-Jeeva punarutthaanamu-lo mahimato-leva madiya nadpumu || Deva || 3. Nenu jeekati nidranu-royuchu duda-leni dinambunandu= Maana kundaga dootalan-goodi jeya-gaana ...

Vinave Naa Vinati | వినవే నా వినతి | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.49 - సాయంతనారాధన సాయంతన సమర్పణము వినవే నా వినతి నివేదన దయ- వెలయగ నో ప్రభువా= నిను శరణాందితి నను గుశలంబున- నునుపవె యో ప్రభువా ॥ వినవే ॥ 1. నిర్మల గతి సంధ్యా కాలంబున- నీ స్తవ మగు ప్రభువా= ధర్మదీప్తి నా కొసగి చేయు-దీప్తవంతునిగ నన్ను ॥ వినవే ॥ 2. నీ మహాదాశ్రయ మొసంగి దుర్గతిని- నేబడకుండగను= నామది తన్వాది సమస్తముతో-ననుగావవె ప్రభువా ॥ వినవే ॥ 3. ఎన్ని దినంబులు జగతి నున్న నీ-కన్న వేరే గలవా= పన్నుగ మది నీ పదసంగతమై- యున్నది రేపగలు ॥ వినవే ॥ 4. పాప కరుండను నే సుకృతా-పాది కర్మ మెఱుగ = నీ పాద సరోజము నాకొసగుము- నాపై నీ కృపజెలగ ॥ వినవే ॥ 5. నీ కొరకై నామనము దృఢంబౌగాక యేసుప్రభువా= నాకు బిశాచముచే భ్రమ జన్మము-గాకుండగ నేలు ॥ వినవే ॥ ––మిక్కిలి సమూయేలు Vinave naa vinati nivedana daya-velayaga no Prabhuvaa= Ninu Sharanaanditi nanu gushalambuna-nunupave yo Prabhuvaa || Vinave || 1. Nirmala gati sandhyaa kaalambuna-nee stava magu Prabhuvaa= Dharma deepti naa kosagi cheyu-deeptavantuniga nannu || Vinave || 2. Nee mahaadaashraya mo...

Stotramu Stotramu O | స్తోత్రము స్తోత్రము ఓ | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.48 - ఉదయ గీతి స్తోత్రము స్తోత్రము ఓ దేవా- ఈ వేకువనే-స్తోత్రము జేతుము మా దేవా= రాత్రి యందున మమ్ము రక్షించి గాపాడి- ధాత్రి మరియొక దినమున్= దయతో నిచ్చిన దేవా ॥ దేవా ॥ 1. పాప శోధనల నుండి- ప్రభువా మమ్ము కాపాడి బ్రోవుమయ్య= ఏక పాపము మమ్మున్- ఏల నియ్యకుండ- మాపు రేపులు మమ్ము-మనిపి బ్రోవుమయ్య ॥ దేవా ॥ 2. కన్న తండ్రి కంటెను- కనికరమున-కాపాడెడి మా దేవా= అన్న దమ్ములవలె మే మందరిని ప్రేమించి-మన్ననతో నీ దినము-మన నియ్యుమో ॥ దేవా ॥ 3. పితా సుతా శుద్ధాత్మ-లనెడి దేవా- ప్రీతితో గావుమయ్యా= నీతి మార్గములందు నిరతము మముగాచి-ఖ్యాతిగా నీ కొరకు బ్రతుకనిమ్మో ॥ దేవా ॥ ––బన్యన్ జోసఫ్ Stotramu Stotramu O Devaa- Ee vekuvane-Stotramu jetumu maa Devaa= Raatri yanduna mammu rakshinchi gaapaadi- Dhaatri mariyoka Dinamun- Dayato nichchina Devaa || Devaa || 1. Paapa shodhanala nundi-Prabhuvaa mammu kaapaadi brovumayya= Eka Paapamu mammun-Ela niyyakunda-maapu repulu mammu-manipi Brovumayya || Devaa || 2. Kanna tandri kantenu-Kanikaramuna-kaapaadedi maa...

Lechi Stutimpaboonudi | లేచి స్తుతింపబూనుడి | Andhra Kraistava Keerthanalu

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.47 - ప్రాతఃస్తము లేచి స్తుతింపబూనుడి-లోకేశ్వరుని -లేచి స్తుతింపబూనుడి = లేచి స్తుతించెదము-చూచుచు మనలను -బ్రోచి ప్రేమతో గరము- జాచి కాపాడు విభుని ॥ లేచి ॥ 1. రాత్రి జాముల యందున - రంజిలదన - నేత్రము తెరచినందున = మైత్రితో దేవదయకు పాత్రుల మైతిమి- శ్రోతముల కింపునబ-విత్ర గీతము పాడుచు ॥ లేచి ॥ 2. నిదురబోయిన వేళను- నిర్మలమైన -హృదయము మనకు నియ్యను =ముదముతో నిదురబొంది యుదయాన లేచితిమి-సదయుడైన క్రీస్తు - పదముల దరిజేరి ॥ లేచి ॥ 3. నిగమ వేద్యుడు మనలను-దనలోన నీ-పగలు కాపాడబూనెను= దిగులు బొందక పనులు- తెగువతో జరుపుకొనుచు-వగపుతో లేచి మ్రొక్కి-మిగుల శుద్ధాత్మ నడిగి ॥ లేచి ॥ 4. నేటి పాఠము యందు-నిర్భయముగ-దాటి వెలసి యుందు=సూటిగ నీదు టెక్కల-చాటుగను నిలుపు మనుచు-నీకుగా నెల్లవార-నిత్యము ప్రేమ నేల ॥ లేచి ॥ Lechi stutimpaboonudi-Lokeswaruni-Lechi stutimpaboonudi = Lechi stutinchedamu-choochuchu manalanu-brochi premato garamu- Jaachi kaapaadu Vibhuni || Lechi || 1. Raatri jaamula yanduna-ranjiladana-netramu terachinanduna = Maitrito Devadayaku paatrula ma...

Prabhuvaa Ninnaaraadimpanu | ప్రభువా నిన్నారాధింపను | Andhra Kraistava Keerthanalu

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.46 - ఉదయారాధన ప్రభువా నిన్నారాధింపను జేరితిమి యుదయ శుభకాంతి ప్రభవింపగా దేవా నేడు శుభకాంతి విరజిమ్మగా విభవముగను ప్రభాకరముగను- విరియు నీ తేజంబెలర్పగ - నభి దనంబులగూడి భక్తిని- యాత్మతో సత్యంబు తోడను ॥ ప్రభువా ॥ 1. 1.ఇరులుం గమ్మిన నుండి- యరుణోదయము దనుక- సరిగాపునీవేకాదా- దేవా రాత్రి- యరిగాపు నీవే గాదా= విరివిగా మా హృదయ సీమల- నెరసి యుండిన చీకటులు బో- దరిమి శాంతంబైన మనసుల-దయ బ్రసాదింపను భజింతుము ॥ ప్రభువా ॥ 2. అనఘా నీ సాన్నిధ్య-మున నుండగా మా దు-ర్మనసుల నరికట్టుమో- దేవా మాదుర్మనసుల శుచి జేయుము=వినయ భయభక్తులుదలిర్పగ వినుచు నీ వాక్యోపదేశము -లనిశమును ధ్యానింప నాత్మను- బనిచి తుదకు బ్రసన్నమగుము ॥ ప్రభువా ॥ 3. పని పాటలో మేమీ- దినము నీకే మహిమ నొనగూర్చ నడిపించుమో- దేవా నిన్నే-ఘన పరచన్నడిపించుము= తనువు శ్రమచే బడలి నను మా దారి దుర్గమమైన కనంబడ - వనటజెందక నేది చేసిన- బ్రభువు కొఱకని చేయ నడుపుము ॥ ప్రభువా ॥ ––మొలతాటి విద్యానందము Prabhuvaa ninnaaraadimpanu jeritimi yudaya shubhakaanti prabhavimpagaa Devaa nedu shubhakaanti virajimmagaa vibha...

Vendeda Naadagu Vinathini | వేడెద నాదగు వినతిని | Andhra Kraistava Keerthanalu

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.45 - ప్రాతఃకాల ప్రస్తుతి వేడెద నాదగు వినతిని గైగొన-వే జగదీశ ప్రభో= నేడు ప్రతి క్షణ మెడబాయక నా-తోడ నుండవె ప్రభో ॥ వేడెద ॥ 1. ప్రాతః స్తవము భవత్సన్నిధి స-ర్వంబున నగు నాదౌ= చేతస్సున ధర్మాత్మను సంస్థితి- జేయవే సత్కృపను ॥ వేడెద ॥ 2. నేపాతకి నజ్ఞానుడప్రభువా -నీవు కరుణజేయు= పాపాచరణము నందున జిత్తము-బాపుము నాకెపుడు ॥ వేడెద ॥ 3. పాపముగని భీతుడనై శంకా -పరత సతమునుండన్= నాపై నుంచుము నీదగు సత్కరు-ణా దృష్టిని బ్రేమన్ ॥ వేడెద ॥ 4. నాదగు పాప భరంబంతయు నీ- మీదనే యిడుచుందున్= నీదు మహాకృప నుండి యొసంగుము- నిర్మల గతి నాకున్ ॥ వేడెద ॥ 5. అవిరత మతి నిటుల లతులిత గతి నీ-స్తుతి నుతు లొనరింతున్= భవదంఘ్రులపై నాదగు భక్తిని-బ్రబలింపవే యేసు ॥ వేడెద ॥ ––విలియం డాసన్ Veendeda naadagu vinathini gaikona-ve jagadeesha prabho= Nedu prathi kshana medabaayaka naa-toda nundave prabho || Veededa || 1. Praatha stavamu bhavathsannidhi sa-rvambuna nagu naadau= Chethasssuna dharmathману sansthithi- jeeyave sathkrupanu || Veededa || 2. Neepaataki najnaa...

Sakala Jagajjaala Karthaa | సకల జగజ్జాల కర్తా | Andhra Kraistava Keerthanalu

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.44 - ఉదయారాధన సకల జగజ్జాల కర్తా- భక్త- సంఘ హృదయ తాప హర్తా=యక లంక గుణమణి-నికర పేటీ కృత-ప్రకట లోకచయ-పరమదయాలయ ॥ సకల ॥ 1. నాదు నెమ్మది తొలంగించుచుంట బ్రతి-వాదు లీమెయి నెంతో పాదుకొన్నారు= బాధ లందైనను- సాధులబ్రోవ న-నాది యైనట్టి నీ వాధారమై యుండ ॥ సకల ॥ 2. దిన కృత్యముల గష్ట మంత-చీక-టిని నే నీ కడభక్తి-మనవి జేయ= వినుచు నా కష్టము-వెస నష్టముగజేయ-ఘనముగ నాయందు గరుణ జేసితివి ॥ సకల ॥ 3. తమ కాపు నన్ను కాపాడగ- నేను-త్తమ నిద్రబొందితి-దనివి దీరం=కొమ రొప్ప మేల్కొన్న- గూలిన మృత్యు భ-యము బొంద నా డెంద -మందు నెల్లప్పుడు ॥ సకల ॥ 4. రాతిరి సుఖనిద్ర జెందంజేసి-రక్షింప నను నీకె-చెల్లు-ప్రాతః స్తుతుల్ జేయ = బగలు-జూచు తెల్వి- ఖ్యాతముగా నాకు- గలుగండేసితివి ॥ సకల ॥ ––విలియం డాసన్ Sakala jagajjaala karthaa- bhaktha- sangha hrudaya thaapa harthaa=yaka Lanka gunamani-nikara petee krutha-prakata lokachaya-paramadayaalaya || Sakala || 1. Naadu nemmadi tholanginchuchu ntabrati-vaadu leemeyi nentho Paadukonnaaru= baadha landainanu- saadhulabova na-naad...

Shree Yesu Kartanu Seevajeyutaku | శ్రీ యేసు కర్తను సేవజేయుటకు | Andhra Kraistava Keerthanalu

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.43 - ప్రాతఃకాల స్తుతి శ్రీ యేసు కర్తను-సేవజేయుటకు మేల్కొను- శ్రీయేసు కర్తను= శ్రేయముల నెఱింగి=నీకు= రేయిపవ లొసంగి - యెడ - బాయని యంత రంగి-య-పాయంబుద్రోయ స-హాయంబుజేయ ॥ శ్రీ యేసు ॥ 1. నిదుర యందు నేడు -క్షేమ మొదవగాచినాడు -సూర్యుడుదయ మాయెంజూడు - నీ హృదయమున సదమల -పదవు లుదయింప ॥ శ్రీ యేసు ॥ 2. అంధకార మణగెన్- హృద- యాంధకార మణగన్- ప్రభు- నందు దెలివి గలుగన్ ని-బంధనలు డెందమున- కందముగగూర్చి ॥ శ్రీ యేసు ॥ 3. కంటిపాప వలెను-నిను-గాయు వాని దయను-గనుగొంటివి స్తోత్రమును-జేయు-మింటికిని మంటి క-న్నింటికి కర్త యని ॥ శ్రీ యేసు ॥ 4. కలకల ధ్వనిజేయు-పక్కి-గములు లయను గూయు-స్వర-ములు ప్రభు స్తుతిజేయు -నీ-వలయక సొలయక-వెలయగ బాడు ॥ శ్రీ యేసు ॥ 5. సేవయందు నీకు-మంచి-యీవు లిడు పరాకు-గల-భావముబడ బోకు-నేడు-కావవే-కావవే కావవే యంచు ॥ శ్రీ యేసు ॥ 6. పగటి వారమంచు-ని ష్పలపు గ్రియలు ద్రుంచు యుగ యుగములు జీవించు-పురి-కెగయ నీ దిగులు విడు-తగు నమ్మకమున ॥ శ్రీ యేసు ॥ 7. మింటి నట బాడు- నీ-యొంటి బలిమి నేడు-ప్రభు నంటియుండ వాడు ని-న్నొంటి నెన్నంటి కె-న్నింటికి స్వీడడు ॥ శ్రీ యేసు ॥...

Tellavaarinaa Vela | తెల్లవారిన వేళ | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.42 - ప్రాతః స్తవము తెల్లవారిన వేళ -దెలి వొంది మన క్రీస్తు -దివ్య నామమంబాడరే- యో ప్రియులారా-దివస రక్షణ వేండరే=తల్లి రొమ్మున దాచు-పిల్ల రీతిని మనల-జల్లదనముగ రాతి-రెల్లగాచిన విభుని ॥ దెల్లవారిన వేళ ॥ 1. నిద్రయిన వేళ - నిపోలాపదలబాపి-నిశ లన్ని గడుపు విభునిన్= భద్రముగ వినతించి- భయభక్తితో మనము-ముద్రి తాక్షులంగేలు- మోడ్చి మొక్కుచును ॥ దెల్లవారిన వేళ ॥ 2. భానుడుదయం బయ్యె-బద్మములు వికసిల్లె- గానములు జేసెంబక్షుల్=మానసాబ్జము లలర-మనము కల్వరి మెట్ట-పై నెక్కు నినుడనెడి-ప్రభుని జూచి వేండ్మన్ ॥ దెల్లవారిన వేళ ॥ 3. దిట్టముగ ఆ మానేసం-ద్రియ కాయ శోధనలు-పట్టుకొని యుందు దినమున=దట్టముగ మన నాల్గు-తల్ల యేసుని కరుణ-జుట్టుకొని రక్షించు-శుభ మడుగుకొనుచున్ ॥ దెల్లవారిన వేళ ॥ 4. పాపభారము మనము-ప్రభుని పై నిడి గురుని-పాదముల చెంత నారగి= కాచు కర్త విశాల- కరము మాటున డాగి -యాపదలం దోలగించు-మని వేండుకొనుచున్ ॥ దెల్లవారిన వేళ ॥ ––పురుషోత్తమ చౌధరి Tellavaarinaa veela -deli vondi mana Kreesthu -divya naamambaadare- Yo priyulaaraa-divasa rakshana veendaree=t...

Meelukona Re Mee Manambula | మేలుకొనరే మీ మనంబుల | Andhra Kraistava Keerthanalu

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.41 - ప్రాతః కాల కీర్తన మేలుకొనరే- మీ మనంబుల- మేలిమిగ మీ మేరదప్పక-పాలు మాలక లేచి దేవుని-పాదములు పూజింప గ్రక్కున ॥ మేలుకొనరే ॥ 1. దిక్కు లెల్లను దేజరిల్లెను- దినకరుడుదయింపనయ్యెను= మొక్కు లకు ప్రతిఫలము నిచ్చెడు-మూల కర్తకు గొలువ సేయగ ॥ మేలుకొనరే ॥ 2. పక్షు లెల్లను కిలకిలంచును-బ్రభుని మహిమలు బల్కదొడగెను= రక్షకుని సకలోపకృతులను-రమ్యముగ నుతియించి పాడగ ॥ మేలుకొనరే ॥ 3. నిదురబోయిన వేళ మిమ్మొక- నిముషమైనను బాసియుండక= పదిలముగ రక్షించు దేవుని-బ్రస్తుతింప మహాముదంబున ॥ మేలుకొనరే ॥ 4. మేటియౌ హృదయాబ్జములలో-మీ కృతజ్ఞతా భూషణంబులు= నేటుగా ధరియించుకొని యిటు-నిర్మలాత్మని బూజసేయగ ॥ మేలుకొనరే ॥ 5. తెల్లవారగ దెలియరే యిది- తెలివిగల మానవ సమాజము= యుల్ల సిల్లుచు నీతి భాస్కరు-డుదయ మయ్యెను హృదయములపై ॥ మేలుకొనరే ॥ ––మిక్కిలి సమూయేలు Meelukona re- mee manambula- meelimiga mee meeradappaka-paalu Maalaka leechi deevuni-paadamulu poojimpa grakkuna || Meelukonaree || 1. Dikku lellanu deejarilleenu- dinakaruDudayimpanayyenu= mokku Laku prathiphala...

Shuddhi Shuddhi Shuddhi | శుద్ధి శుద్ధి శుద్ధి | Andhra Kraistava Keerthanalu

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.40 - Holy, Holy, Holy, Lord God Almighty 1. శుద్ధి, శుద్ధి, శుద్ధి! సర్వశక్త ప్రభు ప్రాతఃకాలస్తుతి నీకె చెల్లింతుము శుద్ధి, శుద్ధి, శుద్ధి! కృపగల దేవా! ముగ్గురై యుందు దైవ త్రైకుండా! 2. శుద్ధి, శుద్ధి, శుద్ధి! అని పరమందు బరవాసులెల్ల నిన్నే శ్లాఘింతురు శెరపుల్ కెరూబులు సాష్టాంగపడి నిత్యుడవైన నిన్ నుతింతురు. 3. శుద్ధి, శుద్ధి, శుద్ధి! తేజరిల్లు దేవ పాపి కన్ను చూడలేని మేఘ వాసివి అద్వితీయ ప్రభు, నీవు మాత్రమేను కరుణ, శక్తి, ప్రేమరూపివి. 4. శుద్ధి, శుద్ధి, శుద్ధి! సర్వశక్త ప్రభు సృష్టిజాలమంత నీ కీర్తిబాడును శుద్ధి, శుద్ధి, శుద్ధి! కృపగల దేవ ముగ్గురై యుండు దైవ త్రైకుండా! ––రెజినాల్డ్ హెబర్ - అను: జేకబ్ చెంబర్లేన్ 1. Shuddhi, shuddhi, shuddhi! Sarvashaktha prabhu Praathakaalaasthuthi neeke chellindhumu Shuddhi, shuddhi, shuddhi! Krupagala deevaa! Muggurai yundu daiva thraikuNdaa! 2. Shuddhi, shuddhi, shuddhi! Ani paramandu Baravaasulella ninne shlaaghindhuru Sherapul keroobuluH saashtaangapaDi Nithyudavaina nin nuthindhuru. 3. ...

Nrupaa Vimochakaa Prabhaa | నృపా విమోచకా ప్రభూ | Andhra Kraistava Keerthanalu

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.39 - O for a thousand tongues to sing 1. నృపా! విమోచకా! ప్రభూ వేలాది నోళ్ళు నీ కృపా జయప్రభావముల్ నుతింతు నెంతయున్ 2. కృపాధికార! దేవ! నీ సాయము జేయుమా భవత్ప్రభావ కీర్తులన్ జాటంగ నెల్లెడన్ 3. భయంబు చింతబాపును హర్షంబు పాపికి సౌఖ్యంబు జీవశాంతులు నీ నామ మిచ్చును. 4. విముక్తి జేయు ఖైదిని పాపంబు బాపును పాపాత్ము శుద్ధుజేయును శ్రీ యేసు రక్తము. 5. జనాళి! పాపు లెల్లరు! శ్రీయేసున్ నమ్ముడి కృపావిముక్తులందుండి సంపూర్ణ భక్తితో 6. అర్పించె యేసు ప్రాణమున్ నరాళిగావను; యజ్ఞపు దేవ గొట్టెపై నఘంబు వేయుడి 7. సత్కీర్తి స్తోత్ర ప్రేమల నభాన భూమిని సర్వత్ర దేవుడొందుగా సద్భక్త పాళిచే. ––చార్లెస్ వెస్లీ 1. Nrupaa! vimochakaa! prabhoo Veelaadi nollu nee Krupaa jayaprabhaavamul Nuthinthu nenthayun 2. Krupaadhikaara! deeva! nee Saayamu jeeyumaa Bhavathprabhaava keerthulan Jaatanga nelledan 3. Bhayambu chinthabaapunu Harshambu paapiki Saukhyambu jeevashaanthulu Nee naama michchunu. 4. Vimukthi jeeyu khaidini Paapambu baapunu Paapaathmu shuddhu...

Krupagala Deevuni | కృపగల దేవుని | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.38 - Let us, with a gladsome mind 1. కృపగల దేవుని సర్వదా నుతించుడి దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును 2. సర్వశక్తుడాయనే సర్వదా చాటించుడి దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును 3. పగటి నేలునట్లు సూర్యునిన్ సృజించెను దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును 4. సర్వజీవకోటిని బ్రోచు దేవుడెన్నడు దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును 5. కర్త మనయందును కనికర ముంచెను దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును 6. దైవ ఘన మహిమన్ జాటుచుండుడి యిలన్ దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును ––జాన్ మిల్టన్ - అను: బర్నార్డ్ లూకాస్ 1. Krupagala deevuni Sarvadaa nuthinchudi Divya krupaa premalu Ellakaala mundunu 2. Sarvashakthudaayane Sarvadaa chaatinchudi Divya krupaa premalu Ellakaala mundunu 3. Pagati neelunatlu Sooryunin srujinchenu Divya krupaa premalu Ellakaala mundunu 4. Sarvajeevakotini Brochu deevudennadu Divya krupaa premalu Ellakaala mundunu 5. Kartha manayandunu Kanikara munchenu Divya krupaa premalu Ellakaala mundunu 6. Daiva ghana mahiman J...

Maa Kartha Gatti Durgamu | మా కర్త గట్టి దుర్గము | Andhra Kraistava Keerthanalu

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.37 - A mighty fortress is our God 1. మా కర్త గట్టి దుర్గము నే నమ్ము ఆయుధంబు సంప్రాప్తమైన కష్టము ల నన్నిటి నణంచు ఆ పాత శత్రు వెంతో క్రూరుడు తదాయుధము లుపాయశక్తులు ఆతం డసమానుండు. 2. మేమో నశించి పోదుము మా శక్తి నిష్ఫలంబు మాకై ప్రభుని శూరుడు యుద్ధంబు చేసి పెట్టు ఆతండెవ్వండు? యేసు క్రీస్తును మా రక్షకుండు మరోక్కం డెవ్వడు? అతండె గెల్చుపొందు. 3. ప్రపంచ మంతటన్ గ్రమ్ము పిశాచు లేమి చేయు? మమ్మెల్ల మింగ నున్నను మాకేల భీతి వేయు? ఈ లోకాథిపు డుగ్రుడైనను దానేమి చేయు? దీర్పొందె నతడు నశించు మాటతోనే. 4. వాక్యంబు నిత్యమే గదా విరోధి వంచలేండు దైవాత్మ తోడగుం గదా తా నిన్ను నేడు రేపు మా కుటుంబము మా కీర్తి, యాస్తి ప్రాణంబు పోయినన్ నష్టంబు వానిదే రాజ్యంబు మాది యౌను. ––మార్టిన్ లూథర్ - అను: ఈ. పాల్ 1. Maa kartha gatti durgamu Ne nammu aayudhambu Sampraapthamaina kashtamu La nanniti nananchu Aa paatha shathru Ventho krooruDu Thadaayudhamu Lupaayashakthulu Aatham dasamaanundu. 2. Meemo nashinchi podumu Maa shakthi nishphalambu Maakai prabhuni shoorudu...

Sarvaadbhuthambulan | సర్వాద్భుతంబులన్ | Andhra Kraistava Keerthanalu

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.36 - Now thank we all our God 1. సర్వాద్భుతంబులన్ సర్వత్ర జేయు కర్తన్ సర్వాత్మలింతటన్ శ్లాఘింప జేర రండి! మా రాకపోకలన్ మమ్ పీడకుండను మా రక్షకుండిట్లే మమ్మాదరించును. 2. మహా దయాతళుండే మా జీవకాలమంత సహాయమూరటన్‌ సంతోషమిచ్చుగాక! మహత్తు ప్రేమను మా యందు నుంచును ఇహంబునన్‌ మమ్మున్‌ ఎన్నండుం బ్రోచును. 3. ప్రపంచ పాలకా! ప్రసిద్ధుండైన తండ్రీ! సుపుత్ర దేవుడా! సుజీవమిచ్చు నాత్మా! త్రైకూడా! ప్రఖ్యాతి కల్గగా అపారసన్నుతి నర్పింతు సర్వదా ––మార్టిన్ రింక్ హార్ట్ అను: ఎచ్. హార్న్స్ 1. Sarvaadbhuthambulan Sarvathra jeeyu karthan Sarvaathmalinthatan Sthuthimpam jeera randi! Maa raakapokalan Mame peedakundanu Maa rakshakundattai Mammaaradinchuchu. 2. Maho dayaashrudai Maa jeevakaalamantha Sahaayamooralan Santhoshamichchugaaka! 3. Prapancha paalakaa! Prasiddhundaina thandree! Suputhra deevudaa! Sujeevamichchu naathmaa! Sampoorna thrailokaa! Thribhyaathi kallagaa Apaarasannuthi Narpinthu sarvadaa ––Maartin Rink Haart anu: E. Haarns

Dahana Bali Neeku | దహన బలి నీకు | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.32 - అర్పణ కీర్తన దహన బలి నీకు ననిష్టము- మరియు-దైవ బలులు విరిగిన యాత్మలే=యెహోవ దేవ విరిగి నలిగిన-యట్టి-హృదయం బలక్ష్యంబు సేయవు ॥ దహన ॥ 1. నీ కటాక్షముతో సీయోనున-కిపుడే-నెనరుతోడను మేలు చేయుమి= ప్రాకటంబుగను యెరూషలే-మునకుం- ప్రాకారములను గట్టించుమి ॥ దహన ॥ 2. అంతట నీతి యుక్తంబు లౌ-బలులు- యాగములు సర్వాంగ హోమముల్= ఎంతో యిష్టంబౌ బలిపీఠము-మీంద -నెన్నో కోడెల జనులర్పింతురు ॥ దహన ॥ ––మల్లెల దావీదు Dahana bali neeku nanishtamu- mariyu-daiva balulu virigina Yaathmale=Yehova deeva virigi naligina-yatti-hrudayam balakshyambu Seeyavu || Dahana || 1. Nee kataakshamutho Seeyonuna-kipude-nenaruthodanu meelu cheeyumi= Praakatambuganu Yeroosaale-munakum- praakaaramulanu gattinchumi || Dahana || 2. Anthata neethi yukthambu lau-balulu- yaagamulu sarvaanga Homamul= entho yishtambau balipeethamu-meenda -nenno kodela Janularpinthuru || Dahana || ––Mallela Daaveedu

O Prabhundaa Nin Nuthinchu | ఓ ప్రభుండా నిన్ నుతించు | Andhra Kraistava Keerthanalu

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.31 - ఓ దేవా, నిన్ను స్తుతించుచున్నాము ఓ ప్రభుండా నిన్ నుతించు- చున్నాము వినయముతోడ- మా ప్రభుండ వంచు నిన్న-మానక మే మొప్పుకొందు ॥ ఓ ॥ 1. నిత్యుండవౌ తండ్రి లోకము-నిన్నారాధించుచు నుండు- సత్యదూతల్ మోక్షమందు-సర్వ ప్రధానుల్ సుభక్తిన్- నిత్య మేక కంఠముతోడ- నిన్ గొనియాడు చున్నారు ॥ ఓ ॥ 2. పరిశుద్ధ, పరిశుద్ధ-పరిశుద్ధ, సేనల దేవా- ధరపరలోకంబులు నీ -వరమహిమతో నొప్పునటంచు ॥ ఓ ॥ 3. కెరూబుల్ సెరూపుల్-నిన్చుం -గీర్తించుచున్నారహహా- సారెకున్ నిన్నపోస్తలుల-సంఘము స్తోత్రించుచుండున్ కూరిమిన్ బ్రవక్తల సంఘము-కొనియాడుచు నిన్ నుతియించు ॥ ఓ ॥ 4. మా మహా జనకా-నిన్ను-మాన్యుండౌ పుత్రున్-బహుశ్రేమగల మా పరిశుద్ధాత్మను- ప్రీతితో సంఘము భువి నొప్పుకొనున్ ॥ ఓ ॥ 5. నీవే క్రీస్తు రాజవు-నిత్య కుమారుండవు-నీ వలలో మానవులను- గావంగం బూనినయపుడు-పావన కన్యా-గర్భంబున బుట్టుట బహు దీనంబనక-చావు శ్రమ నోడించి-సజ్జనులను దివిం దెరచితివే ॥ ఓ ॥ 6. నీవు దేవుని కుడి పార్శ్వంబున- నిత్యము మహిమా సీనుండవు- నీవు మా న్యాయాధిపతివై- రావలయునని నమ్ముచుందుము- పావనంబౌ నీ రక్తంబున- సేవకులకుం దోడ్పడు మిప...

Mahima Sarvonnathamaina | మహిమ సర్వోన్నతమైన | Andhra Kraistava Keerthanalu

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.28 - దేవుని మహిమ మహిమసర్వోనృత-మైన దైవమున కి-మ్మహి సమాధానానుగ్రహము గల్గు న్ర్రభో ॥ మహిమ ॥ 1. నిన్ను స్తోత్రించుచు-నిన్ను బూజించుచు- నిన్ను మహిమ పర్చుచున్నాము లోకప్రభో ॥ మహిమ ॥ 2. ప్రభువైన దేవుండా- పరమండలపు రాజా- ప్రబలంబు గల తండ్రి- పరిశుద్ధంబగు ప్రభో ॥ మహిమ ॥ 3. వినయంబుతో నీదు- ఘన మహిమార్థంమై-వందనము లర్పించి విను-తింతుము సత్ప్రభో ॥ మహిమ ॥ 4. జనితైక పుత్రుడగు-ఘన క్రీస్తేసు ప్రభుదే-వుని గొర్రెపిల్ల జన-కుని కుమారుడ ప్రభో ॥ మహిమ ॥ 5. ధర పాపముల మోయు-వరపుణ్య శీలుండా-కరుణించి మా బీద మొరలాలించుము ప్రభో ॥ మహిమ ॥ 6. తండ్రియైన దేవుని-దక్షిణ భాగమున గూ-ర్చుండి యున్నావు కృప- జూపుమి సత్ప్రభో ॥ మహిమ ॥ 7. పరిశుద్ధుడవు నీవే-పరమ ప్రభుడవు నీవే- దురితాత్ములను గావ- మరణంబైతివి ప్రభో ॥ మహిమ ॥ 8. పరమ జనకుని మహిమన్-పరిశుద్ధాత్మైక్యంబై- సరణి మాకై యున్న- సర్వోన్నత ప్రభో ॥ మహిమ ॥ ––భేతాళ జాన్ Mahimasarvonrutha-maina daivamuna ki-mmahi samaadhaanaanugrahamu Galgu nrrabho || Mahima || 1. Ninnu sthothrinchuchu-ninnu boojinchuchu- ni...

Kalugunugaaka Deevuniki Mahima | కలుగునుగాక దేవునికి మహిమ | Andhra Kraistava Keerthanalu

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.27 - దైవ స్తుతి కలుగునుగాక- దేవునికి మహిమ-కలుగును గాక-కలుగు నున్చత మైన-ఘన స్థలములందున- నిలకు సమాధానం-నరుల కాయన దయ ॥ కలుగును ॥ 1. ప్రభువైన దేవా- పరమరాజా-సర్వపరిపాలా= పరిపూర్ణశక్తిగల- పరమ జనక నిన్ను-మహిని స్తుతించు -మరి పొగడు చున్నాము ॥ కలుగును ॥ 2. మహిమపర్చుచు-ఆరాధించు-చున్నాము నిన్ను= మహిమాతిశయమును- మదిందలంచియు నీకు-మహిని మా స్తుతి కృత-జ్ఞత నిచ్చుచున్నాము ॥ కలుగును ॥ 3. ఏక కుమారా- యేసు ప్రభువా-యెహోవా తనయా= లోక పాపము మోయు -ఏక దేవుని గొట్టె పిల్ల మమ్మును కనిక-రించుము చల్లంగ ॥ కలుగును ॥ 4. లోకపాపములు-మోయుచుంబోవు -యేసు రక్షకా= వాసిగ జనకుని- కుడివైపునం గూర్చుండు- యేసూ మా ప్రార్థన నా-లించి కనికరించు ॥ కలుగును ॥ 5. పరిశుద్ధుండవు-ప్రభుండవు నీవో- ప్రభువైన క్రీస్తూ= పరిశుద్ధాత్మతోం తండ్రి-యైన దేవుని యందుంబరిపూర్ణ మహిమతోం -ప్రబలుచున్నా వామేన్ ॥ కలుగును ॥ ––ఏర్పుల మోషే Kalugunugaaka- deevuniki mahima-kalugunu gaaka-kalugu nunchatha Maina-ghana sthalamulanduna- nilaku samaadhaanam-narula kaayana Daya || Kalugunu || 1. Pra...

Paralokamuna Nundu Deeva | పరలోకమున నుండు దేవ | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.25 - రక్షణ కొరకు కృతజ్ఞత పరలోకమున నుండు దేవ- నీ పదముల నొనరింతు సేవ= దురితంబులకు నేను- వెఅచి యున్నానని- కరుణించి నీ సుతుని -ధర కంపితివిగాదా= అరయంగా నీ ప్రేమ యింతనం- దరము గాదో పరమ జనక-మరణ పర్యంతంబు నిను నే-మరవంజాలను-వరకృపా నిధి ॥ పరలోక ॥ 1. యేసు క్రీస్తుని దయ సేయ-కున్న-మోస మొందెద నెందు కన్న= దోసంబులకు నేను- దాసుందనై ప్రతి- వాసరంబును నీదు- భాసు రాజ్ఞలు విడిచి= వేసటలు గల నరకమునంబడాద్రోసిన నది న్యాయమౌగద- నా సునాధా పేర్మిచేతను- నీ సుతుని నంపించినావు ॥ పరలోక ॥ 2. ఎన్నరాని మహిమ నుండి-యేసు-నన్నుం బాలింప నేతెంచి= యెన్న శక్యము గాక- యున్న పాపము లన్ని- ఛిన్నాభిన్నము జేసి= నన్ను సమ్మతిపరప-నన్న యగు నా రక్షకుండు- తన్ను తానర్చించి వెండియు- నున్నతుండై లేచి యిప్పుడు సన్నిధానం బొసంగా నాకు ॥ పరలోక ॥ ––పురుషోత్తము చౌధరి Paralokamuna nundu deeva- nee padamula nonarinthu seeva= Durithambulaku nenu- verachi yunnaanani- karuninchi nee suthuni -dhara Kampithivigaadaa= arayangaa nee prema yinthanam- daramu gaado parama Janaka-marana paryanthamb...

Bhoomandalamu Daani Sampoornathayunu | భూమండలము దాని సంపూర్ణతయును | Andhra Kraistava Keerthanalu

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.24 - సర్వము దేవుని సొత్తు భూమండలము దాని సం-పూర్ణతయును లోకమును= భూమండల వాసులును-బొల్చార యెహోవావే ॥ భూ ॥ 1. యెహోవ సంద్రము మీంద- భూమి పునాది వేసే- మహాజలముల మీంద -మన దేవుండది స్థిరపర్చె ॥ భూ ॥ 2. యెహోవ పర్వతమునకు -నెక్కంగంబాత్రుండెవండు= మహాలయంబు నందు- మరి నిల్వ యోగ్యుండెవడు ॥ భూ ॥ 3. అపవిత్ర మనసులేక- కపట ప్రమాణము లేక= సుపవిత్రమౌ చేతులును- శుద్ధాత్మ గల్గిన వాండే ॥ భూ ॥ 4. అలాటి వాండు ప్రభుని యాశీర్వచనము నొందు= భూలోకమున రక్షణ దేవుని నీతి మత్వము పొందు ॥ భూ ॥ 5. ప్రభు నాశ్రయించునట్టి- వారు యాకోబు దేవ= ప్రభు సన్ఫిధానము వెదకు- ప్రజ లెల్ల రట్టివారే ॥ భూ ॥ 6. ద్వారంబు లార యింక మీ-తల లెల్లంటైకెత్త వలెన్= రారాజు కొరకుంతలుపు-లారా మిమ్మెత్తుకొనుండి ॥ భూ ॥ 7. ఇలలో మహా మహిమంబు-గలిగిన యీ రాజెవండు =బలశౌర్యముల యెహోవ- బహుశూరుడౌ యెహోవ ॥ భూ ॥ ––మల్లెల దావీదు Bhoomandalamu daani sam-poornathayunu lokamunu= bhoomandala Vaasulunu-bolchaara Yehovaave || Bhoo || 1. Yehova sandramu meenda- bhoomi punaadi veese- mahaajalamula Meenda ...

Etula Neeku Sthuthu | ఎటుల నీకు స్తుతు | Andhra Kraistava Keerthanalu

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.23 - దేవుని స్తుతి ఎటుల నీకు స్తుతు లొనర్తుము -యెహోవ తనయ- యెటుల నీకుంనుతు లొనర్తుము =పటుతర పాపంబులనెడి- పంకమందుంజిక్కి మదిని- దిటముంజెడిన మమ్ముంబ్రోచి-దిక్కుంజూపి నట్టి యేసూ ॥ యెటుల ॥ 1. పాప కూపమందు నుండ గాం-బాప విమోచ- దాపుంజేర్చి కాపు జూపితి= శాపగ్రస్తులైన మా శాపము విముక్తిం జేయ- నీ పవిత్ర రక్తమే నా-ప్రాపుగా నొసంగితివి ॥ యెటుల ॥ 2. భార భరితిమైన యాత్మల-భారమును దీసి-భూరి సౌఖ్యములతో నింపను=భారకుండ-ఘోరమైన శ్రమలనొంది- మరణమొంది తిరిగిలేచి నీవు ధాత్రి-మహిమ నొందినట్టి దేవా ॥ యెటుల ॥ 3. నీతి హీనులమై యుండంగా-నోకర్త మాదు-భీతులన్నింబాపి నీ కృపన్= నీతి రక్షణవస్త్రములను-భాతిగ ధరింపంజేసి-భూతలంబునందు ఖ్యాతిగ సేవింపండేసితి ॥ యెటుల ॥ 4. నిర్మలుండవై- యీ భూమియందు-నిన్నుం బోలి నడుచుకొనుటకై= తిన్నని మార్గమును జూపి-అన్ని కీడులను జయింపం- బన్నుంగ విమలాత్మశక్తి- నున్నతముంగ నిడిన యేసూ ॥ యెటుల ॥ 5. పరమ రాజ్యమందు నిరతము-నీతోడనుండం-కరుణతోడ నెంచు కొంటివి= తిరిగి వచ్చి మమ్మును నీ=చిరప్రకాశ పురమునందుం- త్వరగంజేర్చి యందు సుఖము-దిరముగా నొసంగుదేవ ॥ యెటుల ॥ ...

Vyoma Simhaasanasthunda | వ్యోమ సింహాసనస్థుండ | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.22 - దేవుని ప్రభావ వర్ణన వ్యోమ సింహాసనస్థుండ- యుర్వి పాదపీఠస్థుండ= మామకీన దయా మయుండ-మమ్ముం గావుమో దేవుండ ॥ వ్యోమ ॥ 1. అంతరిక్ష లోకదీప- యద్భుతాదృశ్య స్వరూపా= యింత నీ మహిమ నోప-నెంతది నానాల్క చూప ॥ వ్యోమ ॥ 2. గాలి జెక్కల పైనెక్కి-గాఢాందకారమునందు= నేలికవై సంచరించు- నట్టి నిన్ను మొక్కుచుందు ॥ వ్యోమ ॥ 3. నీతి న్యాయ దీర్థశాంతా- నిర్మల దయా నితాంతా= ప్రీతినుంచవే శ్రీమంతా-పెద్దంగా నా కాలమంతా ॥ వ్యోమ ॥ 4. సర్వ భూలోక పూజితా- సత్య సద్గుణ రాజితా= గర్వ దుస్స్వభా వాహితా- కావు నన్నీ నాట పితా ॥ వ్యోమ ॥ 5. నమ్మిన యీ నన్నంతూల -నాడవు దీనాత్మపాలా= క్రమ్మి నీ ప్రేమతోం జాల-బ్రోతువు దయాలా వాలా ॥ వ్యోమ ॥ ––మిక్కిలి సమాయేలు Vyoma simhaasanasthunda- yurvi paadapeethasthunda= maamakeena dayaa Mayunda-mammum gaavumo deevunda || Vyoma || 1. Anthariksha lokadeepa- yadbhuthaadrushya svaroopaa= yintha nee mahima Nopa-nenthadi naanaalka choopa || Vyoma || 2. Gaali jekkala painekki-gaadhaandakaaramunandu= nelikavai sancharinchu- Natti ninnu ...

Thrithvamai Nithyathvamuna | త్రిత్వమై నిత్యత్వమున | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.21 - త్రిత్వమునకు స్తుతి త్రిత్వమై నిత్యత్వమున నే-కత్వమగు దేవా-నీ =సత్య సామర్థ్యత్వముల నిజ-తత్వము గణించి నిను- నిత్యము స్తుతించెదను ॥ త్రిత్వమై ॥ 1. ఎల్లలోకంబులు సృజించిన-చల్లని తండ్రి-నా=యుల్లమున నీ గొప్ప వింత- లెల్ల సంతసిల్ల శో- భిల్లం దలంచెదను ॥ త్రిత్వమై ॥ 2. వాసి కెక్కిన పరమరాజ్య ని-వాసమును విడిన-శ్రీ=యేసు నాధుండను కుమారా- దోషుల దోసంబులెల్లం-గాచి రక్షించినావు ॥ త్రిత్వమై ॥ 3. ఆదరణకారుండ- వగు శు-ద్ధాత్ముడా దేవా- యా= మోద నామము నంపంబడి యేసు -నాధుని సుబోధ లెల్ల-బోధపరచి పాదుకొల్పు ॥ త్రిత్వమై ॥ 4. సుతా శుద్ధాత్మ- ఒక్కదేవుండవు -ఎల్ల= పాపులను రక్షింప మిగుల-నోపికతో నాపదలు-బాపి కృపంజూపినావు ॥ త్రిత్వమై ॥ Thrithvamai nithyathvamuna ne-kathvamagu deevaa-nee =sathya saamarthyathvamula Nija-thathvamu ganinchi ninu- nithyamu sthuthinchedanu || Thrithvamai || 1. Ellalokambulu srujinchina-challani thandri-naa=yullamuna nee Goppa vintha- lella santhasilla sho- bhillam dalanchedanu || Thrithvamai || 2. Vaasi kekkina paramaraajya ni-v...

Chooda Goreda | చూడ గోరెద | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.19 - దేవుని మందిరావరణములు చూడ గోరెద -నీ-మంది రావరణములను చూడగోరెద = చూడ నాకు నాశ గలదు - సుందరావరణము లవి = చూడ నాదు ప్రాణమెంతో- సొమ్మసిల్లుచున్నదహా ॥ జూడ ॥ 1. నీదు నీవాసములు జూడ - నెంతో రమ్యమైతనర =నాదు హృదయము నకు నా-నంద మిచ్చు నిపుడు నెపుడు ॥ జూడ ॥ 2. జీవము గల ప్రభుని చూడ- జీవి నాలో కేక వేసె= కోవెలలకు దొఱికె గూటి–తావు నీ మందిరమున ॥ జూడ ॥ 3. పిచ్చుకలకు దొఱికె స్థలము -ముచ్చట బలిపీఠ మెదుట = పెట్టు కుతూహలముతోను- పిల్లల నవి మందిరమున ॥ జూడ ॥ 4. నీదు మందిరంబులోన - నిత్యవాసులైన వారు= నిక్కముగను ధన్యులగుచు-నిన్ను సన్నుతింతు రహా ॥ జూడ ॥ 5. ప్రభుని వలన బలమునొందు- ప్రజలు ధన్యులగుదు రిల= ప్రాణ ప్రియము యాత్ర సేయు- ప్రజల మార్గ మమర ధరను ॥ జూడ ॥ 6. నీదు యావరణములలో- నేను నొక్క దినము గడుప-నెంతో విలువ గలుగు నాకు-వేయినాళ్ల బ్రతుకు కన్న ॥ జూడ ॥ 7. కాన రండు మనము నిపుడే మనము లలర ప్రభుని జూడ= మందిర మునకేగి నిండు-మనశ్శాంతి బొంది బ్రతుక ॥ జూడ ॥ ––ఎం.జె. రామాంజులు Chooda goredha -nee-mandi raavaranamulanu choodagoreda = chooda naaku na...

Koodikoni Yunnaamu | కూడికొని యున్నాము | Andhra Kraistava Keerthanalu

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.18 - క్రైస్తవారాధన కూడికొని యున్నాము- సంఘ ప్రభో- కూడికొన్ని యున్నాము=తోడ నుండెద ననుచు నమ్ముచు-దొడ్డ దగు నీ పాద సన్నిధి ॥ కూడుకొని ॥ 1. ఎచట నా ప్రియ భక్తు-లెలమి గూడియున్న నచటికి నేతెంతు-నని పల్కితి= విచట నుండు మమ్ము-వీక్షించి కృపచేత నిపుడు దీవించు మీ-యేసు క్రీస్తునాధా ॥ కూడుకొని ॥ 2. గత కాలమందున-గానీ చేతలచే దుర్గతి నొందియుండగా- గనుగొంటివి= శత సంఖ్య గల పాప-చయ మీవు క్షమియించి-యతి శాంతి నిడితివి- యాత్మస్వరూపా ॥ కూడుకొని ॥ 3. నిరతము నీ ప్రేమ-నెనరున ధ్యానించి- పరమ ధర్మములందు- బరతగల్గి= యరులకు శుభములు-నిరతంబు జేయగ - దిరత మాకొసగుము-దేవుని ప్రియ తనయా ॥ కూడుకొని ॥ 4. అన్ని శోధనముల-నన్ని విపత్తుల- నన్ని కాలములందు-నాదరించి నిన్ను నమ్మిన జనుల-నీ సందిటను జేర్చి- పన్నుగ గాపాడు-ప్రభు యేసు క్రీస్తు ॥ కూడుకొని ॥ 5. అమలుడ నగు న-న్ననుకరించుండనుచు-నాన తిచ్చి నాడ- వాత్మజులుక= నమల మార్గమునందు- నరుగంగ మాకీవు- విమలాత్మ \ దయచేయు- వేగంబు మా తండ్రీ ॥ కూడుకొని ॥ ––పులిపాక జగన్నాధము Koodikoni yunnaamu- sangha prabho- koodikonni yunnaamu= toda...

Yehovaa Bhajana Cheeyandi | యెహోవా భజన చేయండి | Andhra Kraistava Keerthanalu

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.17 - దైవారాధన యెహోవా భజన చేయండి- పాప- నరులారా యీ రీతి మరచి పోకండి ॥ యెహోవా ॥ 1. యేసు పేరిటి ప్రార్థనంబు-మన- దోసములను పోగొట్టను వెరవు= భాసుర పరలోక సుఖము-కోటి-బాధలు-మనకున్న-సంతోషకరము ॥ యెహోవా ॥ 2. యేసు క్రీస్తును గొలువండి- యేసు దాసులతో వాదము లాడకండి= మోసపు దారి విడువండి-దోష-రాసుల నుర్విలోజేసికొన కండి ॥ యెహోవా ॥ 3. జీవ రక్షకుని నమ్మండి -నిత్య-సేవలో మెలగక చెడిపోవకండి= భావించి యాత్మన్ వేడండి-దేవ- దేవుని నెడబాసి- తెరవు విడకండి ॥ యెహోవా ॥ 4. మాయ లోకపు భ్రాంతుల్విడిచి - మను-ష్యాయువు భువిలోన జెల్లుటదలచి=మాయ మార్గము లెల్ల మరచి- మోక్ష-మార్గము మన మున మరవక తలచి ॥ యెహోవా ॥ 5. కాయము నొసగిన ప్రభుని యయిదు గాయంబు లాత్మలో గానంగ రాదా= ఆయు వస్థిర మని తెలిసి-మీరు-కాయ మాత్మయు నిపుడు-కర్తకు నిచ్చి ॥ యెహోవా ॥ ––యేసుదాసు నర్సయ్య Yehovaa bhajana cheyandi- paapa- narulaaraa yee reeti marachi pokandi || Yehovaa || 1. Yesu periti praardhanambu-mana-dosamulanu pogottanu veravu= bhasura paraloka sukhamu-koti-baadhala-manakunna-santoshakaramu ...

Yehovaa Naa Kaapari | యెహోవా నా కాపరి | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.15 - యెహోవా నా కాపరి యెహోవా నా కాపరి లే- మేమి గలుగదు =తన-మహా కృపతో బ్రోచి నన్ను-మనుపు నాతడే 1. పచ్చికగల గోట్ల నను ప-రుండజేయుచు =గడు- హెచ్చగు సౌఖ్యములు సదా- యిచ్చు నాతండే 2. శాంతికర జలములకు నను-సాగజేయుచు= వి-శ్రాంతి ప్రాణమున కొసంగు-విభుడు అతడే 3. గాఢాంధకారమైన లోయల- గుండ బోయిన= నే-కీడుకు భయపడ నిక నా-తోడు ఆయనే 4. దుద్దుకఱ్ఱతో శత్రువుల-దరు మగొట్టుచు= దన-దొడ్డ దండముతో నీతి- దారిలో నడుపు 5. అందరిలో నన్ను నెంచి- యధిక ప్రేమతో=గడు-విందు లొసగి తృప్తిపరచు-విభుడు ఆయనే 6. ముఖము కళగా నుండునట్లు- మంచి తైలమున్ = నా-సఖుడు నాకు బూయుచుండు సకల వేళలన్ 7. బ్రదుకు దినము లన్నిట నాకు-బంటులవలెనే= నను-వెదకి కృపా క్షేమములు నా-వెంటవచ్చును ––సరెళ్ల సమూయేలు సుబ్బయ్య Yehovaa naa kaapari le- memi galugadu =tana-mahaa krupato brochi nannu-manupu naatade 1. Pachchikagala gotla nanu pa-rundajeyuchu =gadu- hechchagu saukhyamulu sadaa- ichchu naatande 2. Shaantikara jalamulaku nanu-saagajeyuchu= vi-shraanti praanamuna kosangu-vibhudu atade 3. Gaa...

పరిశుద్ధ పరిశుద్ధ | Parisudha Parishudha | Telugu Christian Ringtone Download

పరిసుద పరిశుద (Parisudha Parishudha) తెలుగు క్రైస్తవ రింగ్‌టోన్ ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోండి. Android కి MP3, iPhone కి M4R — రెండూ అందుబాటులో ఉన్నాయి.

ఎమినచెయగలవు వోకల్ | Eminacheyagalavu Vocal | Telugu Christian Ringtone Download

ఎమినచెయగలవు వొచల్ (Eminacheyagalavu Vocal) తెలుగు క్రైస్తవ రింగ్‌టోన్ ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోండి. Android కి MP3, iPhone కి M4R — రెండూ అందుబాటులో ఉన్నాయి.

దీవిన్చవెయ్ సమ్రుదిగ | Deevinchavey Samrudiga | Telugu Christian Ringtone Download

దీవిన్చవెయ్ సమ్రుదిగ (Deevinchavey Samrudiga) తెలుగు క్రైస్తవ రింగ్‌టోన్ ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోండి. Android కి MP3, iPhone కి M4R — రెండూ అందుబాటులో ఉన్నాయి.

Naa Kaalagathu Levvi | నా కాలగతు లెవ్వి | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.13 - నీవే నా సహాయుడవు నా కాలగతు లెవ్వి- నా చేతులను లేవు- నాదు దేవ=యెపుడు- నీకే వాని మీద- నిత్యాధికారంబు -నిల్చి యుండు ॥ నా ॥ 1. తల్లి గర్భంబున- దనర సృజించితివి- ధరణి నన్ను= నీవు -తల్లికన్నను మిగుల-దయచేతజూచితివి- తండ్రి నన్ను ॥ నా ॥ 2. పాప కూపము నందు- బడియుండగా నన్ను- బారజూచి = చేయి చాపి యేసుని ద్వార చక్కగా దెచ్చితివి-చాలు దేవ ॥ నా ॥ 3. సుఖదుఃఖ కాలములు - శోధింప -బంపుదువు-శోభాయుక్త = నాకు-సుఖముగల్గ జేయు - సొంపుగ వానిచే-స్థూల శక్తి ॥ నా ॥ 4. సకల కాలంబుల జక్కగ లోబడి- సన్నుతింతు = నన్ను-అక లంకుని గాజేయు-మనుచు వేడుచునుందు నధికాసక్తి ॥ నా ॥ ––పులిపాక జగన్నాధము Naa kaalagatu levvi- naa chetulanu levu- naadu deva= yepudu- neeke vaani meeda- nityaadhikaarambu -nilchi yundu || Naa || 1. Talli garambuna- danara srujinchitivi- dharani nannu= neevu -tallikannanu migula-dayacheta joochitivi- tandri nannu || Naa || 2. Paapa koopamu nandu- badiyundagaa nannu- baarajoochi = cheyi chaapi Yesuni dwaara chakkagaa dechchitivi-chaal...

Entha Prema Entha Prema | ఎంత ప్రేమ యెంత ప్రేమ | Andhra Kraistava Keerthanalu

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.10 - దేవుని ప్రేమ ఎంత ప్రేమ యెంత ప్రేమ యెంత ప్రేమయా- దేవుడెంత గొప్ప ప్రేమయై వెలుంగు చుండునే ॥ ఎంత ॥ 1. ఎంత లోతు ఎంత నిడివి యెంత విరివయా దాని=నింత యంత యని వచించు మనుజుడెవ్వడు ॥ ఎంత ॥ 2. మనమునదలపోయ నూహ కంద దెంతయున్-దాని=జనువుగ జగమందు బొగడ మాట లందవే ॥ ఎంత ॥ 3. దేవదూతలైన దాని బాడ లేరట-యింక దేవుడే తన సుతునొసంగి ఇంత యది యనెన్ ॥ ఎంత ॥ 4. ఇంత గొప్ప ప్రేమ జూప నూరకుందునే-ప్రభు= జెంతజేరి సంత తంబు ప్రీతి జేసెదన్ ॥ ఎంత ॥ Entha prema yentha prema yentha premayaa- deevudentha goppa Premayai velungu chundune || Entha || 1. Entha lothu entha nidivi yentha virivayaa daani=nintha yantha Yani vachinchu manujudevvadu || Entha || 2. Manamunadalapoya nooha kanda denthayun-daani=januvuga Jagamandu bogada maata landave || Entha || 3. Deevadoothalaina daani baada leerata-yinka deevude thana suthunosangi Intha yadi yanen || Entha || 4. Intha goppa prema joopa noorakundune-prabhu= jenthajeeri santha Thambu preethi jeesedan || Entha ||

Prabalamuga Ne Prasthuthinchheda | ప్రబలముగ నే ప్రస్తుతించెద | Andhra Kraistava Keerthanalu

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.9 - స్తుతి గీతము ప్రబలముగ నే- ప్రస్తుతించెద -ప్రభుని కృపలన్ని= ప్రతి దినము నిను- ప్రచురపరచెద- ప్రభుడ నావిభుడా ॥ ప్ర ॥ 1. పొందుగోరి నా-యందు నిలిచిన బంధు మిత్రుడవు- మందమతి కా-నంద మొసగిన - మహిమ తేజుడవు ॥ ప్ర ॥ 2. చింతదీర్చి నా-భ్రాంతి మార్చితి- వెంత వింతిదియో=స్వాంతమున కడు-శాంతి గూర్చితి- వెంత కరుణిదియో ॥ ప్ర ॥ 3. నీతి కరపిన-జాతి మరిపిన -ఖ్యాతి యేసునిదే= నీరసుడ నను- గారవించిన -నీతి రాజితడే ॥ ప్ర ॥ 4. జీవమిచ్చిన జావవచ్చిన- దేవసుత నీవే= జీవదాయక- బ్రోవరా యిక-జాల మేలనురా ॥ ప్ర ॥ 5. నిమిషనిమిషము-నిను భజించెద - నెమ్మనంబునను = శమదమాది -సుగుణ శోభిత- సమ్మదిని నిమ్మా ॥ ప్ర ॥ ––చెట్టి భానుమూర్తి Prabalamuga ne- prasthuthincheda -prabhuni krupalanni= prathi dinamu Ninu- prachuraparacheda- prabhuda naavibhudaa || Pra || 1. Pondugori naa-yandu nilichina bandhu mithrudavu- mandamathi Kaa-nanda mosagina - mahima teejudavu || Pra || 2. Chinthadeerchi naa-bhraanthi maarchithi- ventha vinthidiyo=svaanthamuna Kadu-shaanthi goorch...