Duppilanti Jeevitham Lyrics | దుప్పిలాంటి జీవితం
Duppilanti Jeevitham Lyrics | దుప్పిలాంటి జీవితం దుప్పిలాంటి జీవితం దుప్పిలాంటి జీవితం కడవరకు కలయెగా నా ప్రాణం నీకే అంకితం........ (2) జీవము గల దేవా నీ సన్నిధిని నే చేరేదను ప్రాణమిచ్చిన దేవా నీతోనే నే ఉండెదను నా ప్రాణమా... కరిగిపోకుమా నా హృదయమా కృంగిపోకుమా నా ప్రాణమా కరిగిపోకుమా నా హృదయమా... ఓ...ఓ... (2) ||దుప్పిలాంటి|| నా కన్నులు ఆత్మల కోసం కన్నీరు కార్చాలి ఆ కన్నులు నావే కానీ, చూపు నీదై ఉండాలి (2) పెదవులు నావైతే కానీ మాటలు నీవై ఉండాలి హృదయం నాదైతే కానీ స్పందన నీదై ఉండాలి ..(2) ||నా ప్రాణమా కరిగిపోకుమా|| నా ఆత్మ నీకోసం ప్రజ్వరిల్లాలి నా ఆయువు నీలోనే అంతం అవ్వాలి (2) నా హృదయంలో నీ ప్రేమ ప్రవహించాలి నా తుది శ్వాసవరకు నువ్వే నాకు కావాలి .. (2) ||నా ప్రాణమా కరిగిపోకుమా|| ధూళిలాంటి జీవితం కడవరకు కలయెగా నా ప్రాణం నీకే అంకితం.... (2) జీవము గల దేవా నీ సన్నిధిని నే చేరేదను ప్రాణమిచ్చిన దేవా నీతోనే నే ఉండెదను నా ప్రాణమా కరిగిపోకుమా నా హృదయమా కృంగిపోకుమా... ఓ.. ఓ.....