Posts

Showing posts from March, 2025

Jagamulanele Paripalaka | జగములనేలే పరిపాలక | Telugu Hosanna Ministries Song Lyrics New 2025

Image
జగములనేలే పరిపాలక | Jagamulanele Paripalaka | Telugu Hosanna Ministries Song Lyrics New 2025 | Download జగములనేలే పరిపాలక జగములనేలే పరిపాలక జగతికి నీవే ఆధారమ ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడెద నిరతము ప్రేమగీతము యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్య యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్య మహరాజుగా నా తోడువై నిలిచావు ప్రతిస్థలమున నా భారము నీవు మోయగా సుళువాయే నా పయనము నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడు నను వీడదే నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే సుకుమారుడా నీ చరితము నేనెంతవివరింతును నీ మహిమను ప్రకటించగా నేనెంత ధన్యుడను ఘనులకు లేదే ఈ శుభతరుణం నాకిది నీ భాగ్యమా జీవితమంతా నీకర్పించి నీ రుణము తీర్చనా పరిశుద్ధుడా సారథివై నడిపించు సీయోనుకే నా యాత్రలో నే దాటినా ప్రతి మలుపు నీ చిత్తమే నా విశ్వాసము నీపై నుంచి విజయమునే చాటనా నా ప్రతిక్షణము ఈ భావనతో గురి యొద్దకే సాగెద

రాజ జగమెరిగిన నా యేసురాజా | Raja Jagamerigina Na Yesuraja | Hosanna Ministries Song Lyrics 2025

Image
రాజ జగమెరిగిన నా యేసురాజా | Raja Jagamerigina Na Yesuraja | Hosanna Ministries Song Lyrics 2025 | Download రాజ జగమెరిగిన నా యేసురాజా రాజ జగమెరిగిన నా యేసురాజా రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము - అనుబంధము విడదీయగలరా - ఎవరైనను - మరి ఏదైనను దీన స్థితియందున - సంపన్న స్థితియందున నడచినను - ఎగిరినను - సంతృప్తి కలిగి యుందునే నిత్యము ఆరాధనకు - నా ఆధారమా స్తోత్రబలులు నీకే - అర్పించెద యేసయ్యా || రాజ || బలహీనతలయందున- అవమానములయందున పడినను - కృంగినను - నీ కృపకలిగి యుందునే నిత్యము ఆరాధనకు - నా ఆధారమా స్తోత్రబలులు నీకే - అర్పించెద యేసయ్యా || రాజ || సీయోను షాలేము - మన నిత్య నివాసము చేరుటయే నా ధ్యానము - ఈ ఆశ కలిగి యుందునే నిత్యము ఆరాధనకు - నా ఆధారమా స్తోత్రబలులు నీకే - అర్పించెద యేసయ్యా || రాజ ||

Kurisindi Tolakari Vana | కురిసింది తొలకరి వాన | Hosanna Ministries New Song Lyrics 2025

Image
కురిసింది తొలకరి వాన | Kurisindi Tolakari Vana | Hosanna Ministries New Song Lyrics 2025 | Song No 6 | Download కురిసింది తొలకరి వాన కురిసింది తొలకరి వాన నా గుండెలోన చిరుజల్లులా ఉపదేశమై - నీ వాక్యమే వర్షమై నీ నిత్య కృపయే వాత్సల్యమై  - నీ దయయే హెర్మోను మంచువలె... పొంగి పొరలి ప్రవహించె నా జీవితాన ఆనందించి ఆరాధించెద - నా యేసయ్య ధూళినై పాడైన ఎడారిగ ననుచేయక జీవజల ఊటలు ప్రవహింపచేశావు... కలతల కన్నీళ్లలో కనుమరుగై పోనీయక సాక్షి మేఘమై నిరీక్షణగ నిలిచావు... స్తుతులు స్తోత్రం నీకేనయ్య దయాసాగరా నీ మందిర గుమ్మములోని ఊటలతో శుద్ధిచేసి నా చీలమండలమునకు సౌందర్యం ఇచ్చితివి... నీ సన్నిధిలో నిలిచే భాగ్యము కోల్పోనీయక నీ ప్రభావ మేఘముతో సాక్షిగ నను నడిపితివి... తడిసి మునిగి తేలెదనయ్య ప్రేమసాగరా నా తొలకరి వర్షము నీవై చిగురింప చేసావు నా ఆశల ఊహలలో విహరింప చేసావు... నా కడవరి వర్షము నీవై ఫలియింప చేసావు నీ మహిమ మేఘములో నను కొనిపోయెదవు... హర్షధ్వనులతో హర్షించెదను కరుణాసాగరా

Akshayuda Na Priya | అక్షయుడా నా ప్రియ | New Hosanna Ministries Song Lyrics 2025

Image
అక్షయుడా నా ప్రియ | Akshayuda Na Priya | New Hosanna Ministries Song Lyrics 2025 | Download అక్షయుడా నా ప్రియ అక్షయుడా నా ప్రియ యేసయ్యా నీకే నా అభివందనం నీవు నాకోసమే తిరిగి వస్తావని నేను నీసొంతమై కలసిపోదామని యుగయుగములు నన్నేలుతావని నీకే నా ఘనస్వాగతం నీ బలిపీఠమందు పక్షులకు వాసమే దొరికెనే అవి అపురూపమైన నీ దర్శనం కలిగి జీవించునే నేనేముందును - ఆకాక్షింతును నీతో ఉండాలనే కల నెరవేరున నా ప్రియుడా యేసయ్యా చిరకాల ఆశను నెరవేర్చుతావని మదిలో చిరుకోరిక నీ అరచేతిలో నను చెక్కుకొని మరువలేనంటివే నీ కనుపాపగా నను చూచుకొని కాచుకున్నావులే నను రక్షించిన - ప్రాణమర్పించిన నను స్నేహించిన - నను ముద్రించిన నా ప్రియుడా యేసయ్యా పానార్పణముగా నా జీవితమును అర్పించుకున్నానయ నీవు స్థాపించిన ఏ రాజ్యమైన కొదువ లేకుండునే బహు విస్తారమైన నీ కృపయే మేలుతో నింపునే అది స్థిరమైనదై - క్షేమము నొందునే నీ మహిమాత్మతో - నెమ్మది పొందునే నా ప్రియుడా యేసయ్యా రాజ్యాలనేలే శకపురుషుడ నీకు సాటేవ్వరు

ఆశ్రయుడా నా యేసయ్యా | Asrayuda Na Yesayya | Hosanna Ministries Song Lyrics 2025

Image
ఆశ్రయుడా నా యేసయ్యా | Asrayuda Na Yesayya | Hosanna Ministries Song Lyrics 2025 | Download ఆశ్రయుడా నా యేసయ్యా ఆశ్రయుడా నా యేసయ్యా స్తుతి మహిమ ప్రభావము నీకేనయా విశ్వవిజేతవు - సత్యవిధాతవు నిత్యమహిమకు - ఆధారము నీవు లోక సాగరాన క్రుంగినవేళ నిత్యమైన కృపతో వాత్సల్యము చూపి - నను చేరదీసిన నిర్మలుడా నీకేనయా ఆరాధన - నీకేనయా స్తుతి ఆరాధన తెల్లని వెన్నెల కాంతివి నీవు చల్లని మమతల మనస్సే నీవు కరుణనుచూపి కలుషము బాపి నను ప్రేమించిన ప్రేమవు నీవు జనులకు దైవం - జగతికి దీపం నీవుగాక ఎవరున్నారు నీవే నీవే ఈ సృష్టిలో కొనియాడబడుచున్న మహరాజువు జీవిత దినములు అధికములగునని వాగ్దానము చేసి దీవించితివి ఆపత్కాలమున అండగనిలిచి ఆశలజాడలు చూపించితివి శ్రీమంతుడవై సిరికేరాజువై వెతలనుబాసి నాస్థితి మార్చితివి అనురాగమే నీ ఐశ్వర్యమా సాత్వికమే నీ సౌందర్యమా నీచిత్తముకై అరుణోదయమున అర్పించెదను నా స్తుతి అర్పణ పరిశుద్ధులలో నీ స్వాస్థ్యముయొక్క మహిమైశ్వర్యము నే పొందుటకు ప్రతి విషయములో స్తుతి చెల్లించుచు పరిశుద్ధాత్మలో ప్రార్థించెదను పరిశుద్ధుడా పరిపూర్ణుడా నీ చిత్తమే నాలో నెరవేర్చుమా

Jaya Sanketama | జయ సంకేతమా | Hosanna Ministries Song Lyrics 2025

Image
జయ సంకేతమా | Jaya Sanketama | Hosanna Ministries Song Lyrics 2025 | Jesus Song Lyrics Download | Lyrics జయ సంకేతమా జయ సంకేతమా దయాక్షేత్రమా నను పాలించు నా యేసయ్యా అపురూపము నీ ప్రతి తలపు అలరించిన ఆత్మీయ గెలుపు నడిపించే నీ ప్రేమ పిలుపు నీ ప్రేమ నాలో ఉదయించగా-నా కొరకు సర్వము సమకూర్చెనే నన్నేల ప్రేమించ మనస్సాయెను - నీ మనస్సెంతో మహోన్నతము కొంతైనా నీ ఋణము తీర్చేదెలా - నీవు లేక క్షణమైనా బ్రతికేదెలా విరిగినలిగిన మనస్సుతోనిన్నే - సేవించెద నా యజమానుడా నిలిచెను నా మదిలో నీ వాక్యమే - నాలోన రూపించే నీ రూపమే దీపము నాలో వెలిగించగా - నా ఆత్మదీపము వెలిగించగా రగిలించే నాలో స్తుతి జ్వాలలు - భజియించి నిన్నే కీర్తింతును జీవిత గమనం స్థాపించితిని - సీయోను చెర నడిపించుమా నీ కృప నాయెడల విస్తారమే - ఏనాడూ తలవని భాగ్యమిది నీ కృప నాకు తోడుండగా - నీ సన్నిధియే నాకు నీడాయెను ఘనమైనకార్యములు నీవుచేయగా - కొదువేమిలేదాయె నాకెన్నడు ఆత్మబలముతో నను నడిపించే - నా గొప్ప దేవుడవు నీవేనయ్య బహు గొప్పదేవుడవు నీవేనయ్య

Oohakandani premalo | ఊహకందని ప్రేమలోని | Hosanna Ministries Song Lyrics

Image
ఊహకందని ప్రేమలోని | Oohakandani premalo | Telugu Christian Song Lyrics | Hosanna Ministries Song Lyrics New | Download ఊహకందని ప్రేమలోని ఊహకందని ప్రేమలోని బావమే నీవు హృదయమందు పరవసించు గానమే నీవు మనస్సు నిండిన రమ్యమైన గమ్యమే నీవు మరపురాని కలల సౌధం గురుతులే నీవు ఎడబాయలేనన్న నిజస్నేహమే నీవు నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు తల్లడిల్లె తల్లికన్న మించి ప్రేమించి తనువుతీరే వరకు నన్ను విడువలేనంది అదియే... నే గాయపరచిన వేళలో కన్నీరు కార్చినప్రేమగా నులివెచ్చనైన ఒడికి చేర్చి ఆదరించిన ప్రేమయె నీ గుండెలో నను చేర్చిన నీ అమరమైన ప్రేమయె నింగి నేలను కలిపిన బలమైన వారధిగా నేలకొరిగిన జీవితాన్ని లేవనెత్తెనుగా అదియే... తన మహిమ విడినత్యాగము ఈ భువికి వచ్చిన భాగ్యము నను దాటిపోక వెదకిన నీ మధురమైన ప్రేమయే నీ సర్వమిచ్చిన దాతవు నను హత్తుకున్న స్వామివి దేహమందు గాయమైతే కుదుటపడును కదా గుండెగాయము గురుతుపట్టిన నరుడులేడు కదా నీవే నీవే యేసయ్యా... నా అంతరంగము తరచి చూసిన గాఢమైన ప్రేమవు నను భుజముపైన మోసిన అలసిపోనీ ప్రేమవు నీవు లేనిదే నా బ్రతుకులో విలువంటు లేనే లేదయ