Posts

Showing posts from November, 2024

Panduga Christmas Panduga | పండుగ క్రిస్మస్ పండుగ | Christmas Song Lyrics Telugu

Image
పండుగ క్రిస్మస్ పండుగ | Panduga Christmas Panduga | Christmas Song Lyrics Telugu | Download పండుగ క్రిస్మస్ పండుగ పండుగ క్రిస్మస్ పండుగ నిండుగా ఊరంత నిండెగా ఇంటింట తారలతో పండుగ మదిలో ఎలుగై నిండెగా లోకరక్షకుని జననం మాకు ఎంతో శ్రేయస్కరం ఆనందించేదం ఆరాదించేదం అద్వితీయ కుమారుడని ఆడిపాడి కొనియాడేదం వచారు గొల్లలు జ్ఞానులు ఇచ్చారు తమ కానుకలు పొగిడినారు యూదుల రాజని లోక రక్షకుడు పుట్టాడని లోకమంతా వేలుగేనని

మా ఇంటి పేరు | Maa Inti Peru | Popular Telugu Christian Christmas Song Lyrics

Image
మా ఇంటి పేరు | Maa Inti Peru | Popular Telugu Christian Christmas Song Lyrics | Download మా ఇంటి పేరు పశువుల పాక మా ఇంటి పేరు పశువుల పాక పక్కింటి పేరు ఒలీవల తోట (2) ఎదురింటి పేరు కల్వరి కొండ మా వాడ పేరు సీయోను కోట || మా ఇంటి పేరు || మా తండ్రి యేసు పశువుల పాకలో తనను తాను చూడు తగ్గించుకొనెను (2) కుమారుడు క్రీస్తు ఒలీవల తోటలో (2) మోకాళ్ల కన్నిళ్ల ప్రార్దించె చూడు || మా ఇంటి పేరు || మా ఆత్మ దేవుడు కల్వరి కొండలో సంపూర్ణ సమర్పణ చేసెను చూడు (2) తగ్గింపు ప్రార్థన సమర్పణలో (2) మార్గము సత్వము జీవము చూడు || మా ఇంటి పేరు ||

Toorpu Deshapu Gnanulamu | తూర్పు దేశపు జ్ఞానులము | Telugu Christmas Song Lyrics

Image
తూర్పు దేశపు జ్ఞానులము | Toorpu Deshapu Gnanulamu | Telugu Christmas Song Lyrics | Jesus Song Lyrics Telugu | Download తూర్పు దేశపు జ్ఞానులము తూర్పు దేశపు జ్ఞానులము చుక్కను చూచి వచ్చితిమి /2/ కొండలు లోయలెడారులు దాటి మేము వచ్చితిమి /2/ ఓ … రాత్రి వింత తారహో రాజ తేజ రమ్యమౌ పశ్చిమ దిశ పోయి పోయి నడుపు మమ్ము శాంతికిన్ నేనర్పింతు బంగారము నీవంగీకరించు ప్రభో /2/ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ పాడుతు ఓ … రాత్రి వింత తారహో రాజ తేజ రమ్యమౌ పశ్చిమ దిశ పోయి పోయి నడుపు మమ్ము శాంతికిన్ నేనర్పింతు సాంబ్రాణి నీవంగీకరించు ప్రభో /2/ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ పాడుతు ఓ … రాత్రి వింత తారహో రాజ తేజ రమ్యమౌ పశ్చిమ దిశ పోయి పోయి నడుపు మమ్ము శాంతికిన్ నేనర్పింతు బోళమును నీవంగీకరించు ప్రభో /2/ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ పాడుతు ఓ … రాత్రి వింత తారహో రాజ తేజ రమ్యమౌ పశ్చిమ దిశ పోయి పోయి నడుపు మమ్ము శాంతికిన్ తూర్పు దేశపు జ్ఞానులము చుక్కను చూచి వచ్చితిమి /2/ కొండలు లోయలెడారులు దాటి మేము వచ్చితిమి /2/ ఓ … రాత్రి వింత తారహో రాజ తేజ రమ్యమౌ పశ్చిమ దిశ పోయి పోయి నడుపు మమ్ము శాంతికిన్

Chinta Ledika Yeshu Puttenu | చింత లేదిక యేసు పుట్టెను | Telugu Christian old Song Lyrics

Image
చింత లేదిక యేసు పుట్టెను | Chinta Ledika Yeshu Puttenu | Telugu Christian old Song Lyrics | Download చింత లేదిక యేసు పుట్టెను చింత లేదిక యేసు పుట్టెను వింతగను బెత్లేహమందున చెంత జేరను రండి సర్వ జనాంగమా సంతసమొందుమా (2) దూత తెల్పెను గొల్లలకు శుభవార్త నా దివసంబు వింతగా ఖ్యాతి మీరగ వారు యేసును గాంచిరి స్తుతులొనరించిరి || చింత లేదిక || చుక్క గనుగొని జ్ఞానులేంతో మక్కువతో నా ప్రభుని కనుగొన చక్కగా బేత్లేహ పురమున జొచ్చిరి కానుకలిచ్చిరి || చింత లేదిక || కన్య గర్భమునందు పుట్టెను కరుణగల రక్షకుడు క్రీస్తుడు ధన్యులగుటకు రండి వేగమే దీనులై సర్వ మాన్యులై || చింత లేదిక || పాపమెల్లను పరిహరింపను పరమ రక్షకుడవతరించెను దాపు జేరిన వారికిడు గుడు భాగ్యము మోక్ష భాగ్యము || చింత లేదిక ||

ఓ సద్భాక్తులారా | Telugu Christmas Song Lyrics | Jesus Old Christian Song Lyrics | Download

Image
ఓ సద్భాక్తులారా | Telugu Christmas Song Lyrics | Jesus Old Christian Song Lyrics | Download ఓ సద్భాక్తులారా ఓ సద్భాక్తులారా – లోక రక్షకుండు బెత్లేహేమందు నేడు జన్మించెన్ రాజాధి రాజు – ప్రభువైన యేసు నమస్కరింప రండి నమస్కరింప రండి నమస్కరింప రండి ఉత్సాహముతో సర్వేశ్వరుండు – నర రూపమెత్తి కన్యకు బుట్టి నేడు వేంచేసెన్ మానవ జన్మ – మెత్తిన శ్రీ యేసూ నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజింతుము ఓ దూతలారా – ఉత్సాహించి పాడి రక్షకుండైన యేసున్ స్తుతించుడి పరాత్పరుండా – నీకు స్తోత్రమంచు నమస్కరింప రండి నమస్కరింప రండి నమస్కరింప రండి ఉత్సాహముతో యేసు ధ్యానించి – నీ పవిత్ర జన్మ ఈ వేల స్తోత్రము నర్పింతుము అనాది వాక్య – మాయే నర రూప నమస్కరింప రండి నమస్కరింప రండి నమస్కరింప రండి ఉత్సాహముతో

Doota paata paadudi | దూత పాట పాడుడి | Christmas Song Lyrics Telugu

Image
దూత పాట పాడుడి | Doota paata paadudi | Christmas Song Lyrics Telugu | Jesus Song Lyrics | Download దూత పాట పాడుడి దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి ఆ ప్రభుండు పుట్టెను – బెత్లెహేము నందున భూజనంబు కెల్లను – సౌఖ్య సంభ్రమాయెను ఆకసంబు నందున – మ్రోగు పాట చాటుడి దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి ఊర్ధ్వ లోకమందున – గొల్వగాను శుద్దులు అంత్య కాలమందున – కన్య గర్భమందున బుట్టినట్టి రక్షకా – ఓ ఇమ్మానుయేల్ ప్రభో ఓ నరావతారుడా – నిన్ను నెన్న శక్యమా దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి రావే నీతి సూర్యుడా – రావే దేవా పుత్రుడా నీదు రాక వల్లను – లోక సౌఖ్య మాయెను భూ నివాసులందరూ – మృత్యు భీతి గెల్తురు నిన్ను నమ్ము వారికి – ఆత్మ శుద్ది కల్గును దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి

Yesu Puttenu Bethlehemulona | యేసు పుట్టెను బెత్లెహేములోనా | Christmas Song Lyrics

Image
యేసు పుట్టెను బెత్లెహేములోనా | Yesu Puttenu Bethlehemulona | Christmas Song Lyrics | Jesus Song Lyrics | Download యేసు పుట్టెను బెత్లెహేములోనా యేసు పుట్టెను బెత్లెహేములోనా బహు సందడాయేను సకల జనులలోనా యేసు పుట్టెను బెత్లెహేములోనా ప్రతి గుండె మురిసెను చిన్ని క్రీస్తులోనా ఆనందం సంతోషం ఉప్పొంగేనే ఉల్లాసం ఉత్సాహం విరభూసేనే (2) గొల్లల వేడుకతో జ్ఞానుల రాకతో విరజిల్లే పరిమళమే ఇది పండుగ పరవశమే (2) ఆకాశ మార్గాన మెరిసింది తారా జనులంతా ఈ వింతా చూచెను కనులారా భువినేలు దివి రాజు దిగివచ్చిన వేళా పులకించే ప్రతి హృదయం క్రిస్తేసుని చూడా జ్ఞానులొచ్చెను తార దారి చూపెను దీనుడైన దైవ సుతుని గాంచెను మోకరించెను సాగిలపడి మ్రొక్కేను సామ్రాణి బొలములర్పించేను బొలము తల్లి మరియ కంటినిండా యేసు దివ్య రూపు నిండా దూతలన్ని పాట పాడెను మహిలో దైవ సుతున్ని మహిమ పరిచెను (2) ప్రేమించే దేవుడు ఈ లోకాన్ని అంట పంపించే తన తనయుని మన కోసమేనంట ప్రాణాలే ఇచ్చేటి ప్రేమే తనదంట విడిపించి నడిపింప ఇల వచ్చేనంట లేత మొక్కల నులి లేత బుగ్గల వరదైవ చిరుదివ్య రూపుడు లోక పాపముల్ మోసుకొని పోయేడి ద...

Raaraaju yesu puttenu ilalo | రారాజు యేసు పుట్టేను | Telugu Christmas Song Lyrics

Image
రారాజు యేసు పుట్టేను | Raaraaju yesu puttenu ilalo | Telugu Christmas Song Lyrics | Jesus Song Lyrics | Download రారాజు యేసు పుట్టేను రారాజు యేసు పుట్టేను ఇలలో ||2||  మనుషుని కొరకు మనిషిగా మారి ||2||  దివిని విడచి నిను నను చేరెను ||2|| స్తుతియించెదము గనపరచెదము సన్నుతించెదము ||2||                                                                                      || రారాజు యేసు || 1.ఇదిగో ప్రజలందరికి కలుగబోవ  మహాసంతోష సువార్తమానము  దావీదు పట్టణమందు రక్షకుడు  మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు  ఒక శిశువు పోతి గుడ్డలతో చుట్టాబడొక త్రోట్టేలో ||2|| పండుకొని యుండుట మీరు చూచెదరిని దే...

Gatakaalamu Nee Krupalo | గతకాలము నీ కృపలో | Telugu Christian Song Lyrics

Image
గతకాలము నీ కృపలో | Gatakaalamu Nee Krupalo | Telugu Christian Song Lyrics | Jesus Song Lyrics | Download గతకాలము నీ కృపలో గతకాలము నీ కృపలో నను రక్షించి దినదినమున నీ దయలో నను బ్రతికించి నీ కనికరమే నాపై చూపించి నీ రెక్కల చాటున ఆశ్రయమిచ్చావయా! నా స్థితిగతులే ముందే నీవెరిగి ఏ కొదువే లేకుండా ఆశీర్వాదించావయా! "2" నా దేవా..నీకే వందనం నా ప్రభువా..నీకే స్తోత్రము.. నా దేవా..నీకే వందనం నా ప్రభువా..నీకే స్తోత్రము.. నా ప్రభువా..నీకే స్తోత్రము.. కష్టాలు తీరక..కన్నీళ్లు ఆగక దినమంతా వేదనలో నేనుండగా.. నష్టాల బాటలో..నా బ్రతుకు సాగక గతమంతా శోధనలో పడియుండగా.. ఏ భయము నను అవరించక.. ఏ దిగులు నను క్రుంగదీయక నాతోడునీడవై నిలిచావు నా చేయి పట్టి నడిపించావు కాలాలు మారగా..బంధాలు వీడగా లోకాన ఒంటరినై నేనుండగా నా వ్యాధి బాధలో..నా దుఃఖదినములో జీవితమే భారముతో బ్రతికుండగా అరచేతిలో నన్ను దాచిన కనుపాపల నన్ను కాచిన నీ చెలిమితోనే నను పిలిచావు నా చెంత చేరి ప్రేమించావు.. ఊహించలేదుగా ఈ స్థితిని పొందగా నా మనసు పరవశమై స్తుతి పాడగా ఇన్నాళ్ల నా కల నెరవేరుచుండగా నా స్వరము నీ వరమై కొనియాడగా నీవిచ్చినదే ఈ జీవితం నీ ...

ye Samayamandaina | ఏ సమయమందైనా | Telugu Jesus Song Lyrics

Image
ఏ సమయమందైనా | ye Samayamandaina | Telugu Jesus Song Lyrics | Christian Song Lyrics Telugu | Download ఏ సమయమందైనా ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదన్ (2) ఆరాధనా ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా ఆరాధనా ఆరాధనా గొర్రెపిల్ల క్రీస్తుకే ఆరాధనా || ఏ సమయమందైనా || చెరసాలలో నేను బంధీగా ఉన్నా సింహాల బోనులో పడవేసినా ||2|| కరువు ఖడ్గము హింస ఎదైననూ మరణ శాసనమే పొంచున్ననూ||2|| యేసు నామమే ఆధారము కాదా యేసు రక్తమే నా విజయము పగలు ఎండలలో రాత్రి వెన్నెలలో కునుకక కాపాడు యేసు దేవునికే || ఆరాధనా || నా జీవనాధారం శ్రీ యేసుడే నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే||2|| తన చేతులతో నన్ను నిర్మించెగా నా సృష్టికర్తను కొనియాడెదన్||2|| యెహోవ రాఫా నను స్వస్థ పరిచెను యెహోవ షమ్మా నాకు తోడుగా యెహోవ నిస్సీ నా ధ్వజముగా అల్ఫా ఒమేగా ఆది దేవునికే || ఆరాధనా ||

Idi Rakshana Mahotsavam | ఇది రక్షణ మహోత్సవం | Christmas Song Lyrics Telugu

Image
ఇది రక్షణ మహోత్సవం | Idi Rakshana Mahotsavam | Christmas Song Lyrics Telugu | Jesus Song Lyrics Telugu | Download ఇది రక్షణ మహోత్సవం ఇది రక్షణ మహోత్సవం క్రీస్తేసు జన్మోత్సవం సర్వలోక శుభకార్యం తండ్రి దేవుని నిర్ణయం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్ వి విష్ యూ హ్యాపీ క్రిస్మస్ "2" 1.తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రమును చూసి ఆత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి మ్రొక్కి కానుకలు అర్పించిరి జ్ఞానులు గుర్తించిరి యేసును రాజులరాజని ఆలోచించుము యేసే నిజదేవుడు నిన్ను రక్షించును నేడే వేడుము హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్ వి విష్ యూ హ్యాపీ క్రిస్మస్ "2" 2.పాపములు క్షమియింపను శాపపు కాడిని విరువను నిత్యజీవమివ్వను యేసు దిగి వచ్చెను మహిమనంత వీడెను, దాసుని రూపము దాల్చెను ఇమ్మానుయేలు తోడుందువాడు ఎంతో ప్రేమించెను పరమును వీడెను ఆలోచించుము యేసే నిజదేవుడు నిన్ను రక్షించును నేడే చేరుము హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్ వి విష్ యూ హ్యాపీ క్రిస్మస్ "2"

AA NINGILONA CHUKKA | ఆ నింగిలోని చుక్క | Christmas Song Lyrics Telugu

Image
ఆ నింగిలోని చుక్క | AA NINGILONA CHUKKA | Christmas Song Lyrics Telugu | Download jesus Song Lyrics Telugu నింగిలోని చుక్క నింగిలోని చుక్క తెచ్చెను నేడు ఎంతో సంతోషము నింగిలోని దూత తెచ్చెను నేడు గొప్ప శుభవార్తను (2) దావీదు కుమారుడు లోకాన్ని ఏలే రాజు పశువుల పాకలో జన్మించే మహారాజు (2) ||ఆ నింగిలోన|| 1. పాపపు బ్రతుకులను మార్చుటకు లోకములో జన్మించే ఆ దేవుడు నశించే ఆత్మలను రక్షించుటకు రా రాజుగా జన్మించెను(2) ఎన్నడు విడువడు ఎన్నడు ఎడబాయడు ఎన్నడు విడువడు నిన్ను ఎన్నడూ ఎడబాయడు "దావీదు కుమారుడు"2 2. రోగులకు స్వస్థత నిచ్చుట కు ఇమ్మానుయేలు గా దిగివచ్చాడు తన ప్రజల భుజములపై భారమును తొలగించుటకు జన్మించెను(2) నిజమైన దేవుడని ప్రతి నాలుక ఒప్పుకొను నిజమైన దేవుడని ప్రతి మోకాలు వంగును "దావీదు కుమారుడు"2 హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్

Bethlehem Oorilona | బెత్లహేము ఊరిలోన | Telugu Christmas Song Lyrics

Image
బెత్లహేము ఊరిలోన | Bethlehem Oorilona | Telugu Christmas Song Lyrics | Jesus Song Lyrics Download బెత్లహేము ఊరిలోన బెత్లహేము ఊరిలోన - పశువుల శాలలోన శ్రీ యేసు జన్మించాడు - రక్షణ భాగ్యం తెచ్చాడు (2) మనసారా ఆరాధిస్తూ - పాటలు పాడేదం రారాజు పుట్టాడని - సందడి చేసేదం (2) దివినేలే రారాజు - భువిలోన పుట్టాడు లోకానికే సంభరం - గతిలేని మన కొరకు స్థితి విడిచి పెట్టాడు - ఆహా ఎంతటి భాగ్యము (2) 1. చింతలేదు - బెంగలేదు యేసయ్య తోడుగా ఇమ్మానుయేలుగా - ఇశ్రాయేలు దేవునిగా (2) అనుదినము బలపరిచి నడిపిస్తాడు చింతలన్నీ తొలగించి ఆదరిస్తాడు(2) ||దివినేలే|| 2. వ్యాధిఅయిన బాధఅయినా - శోధన మరి ఏదైనా కన్నీటి లోయలో - కృంగిన వేళలో (2) స్వస్థ పరిచి నిన్ను విడిపిస్తాడు సమాధాన కర్తగా శాంతినిస్తాడు (2) ||దివినేలే|| 3. పాపులను రక్షింప -ప్రభు యేసు జన్మించే శాపమును తొలగింప - నరునిగ అరుదించే(2 యేసయ్యకు నీ హృదయం అర్పించితే నిజమైన శాంతి సమాధానమే (2) ||దివినేలే||

సంబరాలు మొదలాయే | ఇమ్మానుయేలు దేవుడు | Christmas Song Lyrics | Download

Image
సంబరాలు మొదలాయే | Sambaralu Modalaye | ఇమ్మానుయేలు దేవుడు | Christmas Song Lyrics | Download ఇమ్మానుయేలు దేవుడు ఇమ్మానుయేలు దేవుడు పరమును వీడి వచ్చాడు నరునిగా మనకై పుట్టాడు నిరతము మనతోడుంటాడు.. సంబరాలు మొదలాయే మన ఊరంతా ఈ రోజుతో.. నింగినేలా ఒకటాయే మన యేసయ్య రాకతో.. 1. లోకమునే ప్రేమించి తండ్రి చిత్తము చేసి సింహాసనమే వదిలి దిగి వచ్చాడే! పాపమునే తొలగించి శాపమునే విడిపించి పరిశుద్ధుడిగా ఇలలో జన్మించాడే! నశియించే వారిని రక్షింపగా వచ్చాడే! పరలోక మార్గమై లోకాన పుట్టాడే! దేవాధి దేవుడే మానవుడై వెలిశాడే!.. 2. రాజులకు రాజైన ప్రభువులకు ప్రభువైన దీనుడిగా భువిపైన ఉదయించాడే సర్వమునే పాలించే నరకమునే తప్పించే దైవకుమారుడిగా మనకై అరుదేంచాడే మనమంటే ఎంత ప్రేమో మనకై మరణించాడే మన తండ్రి చెంతకే మననే చేరుస్తాడే రానున్న రారాజై అతిత్వరలో వస్తాడే..

ఇది ఆశ్చర్యమే | Idi Ashcharyame | Christmas Song Lyrics Telugu | Jesus Song Lyrics | Download

Image
ఇది ఆశ్చర్యమే | Idi Ashcharyame | Christmas Song Lyrics Telugu | Jesus Song Lyrics | Download ఇది ఆశ్చర్యమే కాలం సంపూర్ణమైనపుడు యేసయ్య భువికొచ్చెను తానే మనలను ప్రేమించి రక్షకుడై జన్మించెను రాజాధి రాజైనను ఇలలో దాసునిగా జీవించెను సత్యమును స్థాపించుటకు దైవసుతునిగా ఉదయించెను "ఇది ఆశ్చర్యమే - ఇది అద్భుతమే" "ఆహా ఆనందమే - హాపీ హ్యాపీ క్రిస్మస్ "ఇది ఆశ్చర్యమే - ఇది అద్భుతమే"... "ఆహా ఆనందమే - మెర్రి మెర్రి క్రిస్మస్ 1. జ్ఞానులు సాగిలపడిరి - మ్రొక్కిరి ప్రభువుల ప్రభువును అటువలె విశ్వసించుచు - పూజించెదం ప్రభు యేసును సర్వోన్నతమైన స్థలములలోన - దేవదేవునికే మహిమ తనకిష్టులైన ప్రజలందరికి - భూమి మీద సమాధానము 2. గొల్లలు దేవుని మాటను - గ్రహియించిరి దూత చెప్పగా విధేయతే మనకు ముఖ్యము - గ్రహియించుము దేవుని చిత్తము వాక్యమైన దేవుడు శరీరధారిగా - మన మధ్యలో నివసించెను నమ్మి విశ్వసించుము కలుగు నిత్యజీవము - యేసు క్రీస్తే లోకరక్షకుడు

Ningilona Oka Thaare | నింగిలోన ఒక తారే | Christmas Song Lyrics Telugu

Image
నింగిలోన ఒక తారే | Ningilona Oka Thaare | Christmas Song Lyrics Telugu | Jesus Song Lyrics Telugu | Download నింగిలోన ఒక తారే " హమ్... హమ్... హమ్...హమ్... ఆ..ఆ...ఆ..అ.. ||2|| నింగిలోన ఒక తారే వెలిసెనే నీ జాడే తెలుపగా లోకమంతా దుతలే తిరిగేనే శుభవార్తె చాటగా " వచ్చినావయ్య మా కోసమే- వీడినావయ్య ఆ లోకమే ||2|| ఎవరు చేయని త్యాగం చేయ ఏతెంచావా ఈ లోకమే " మనసే పొంగేనే ఆనందంతో- బ్రతుకే నిండేనే సంతోషంతో ||2|| 1. " మానవరూపీయై భూవికరుదెంచావా మా కోసము బానిస బ్రతుకులకు విడుదల తెచ్చెను నీ జననము ||2|| " యేసువ నీ జన్మ తెచ్చె సంతోషము సరళమాయెను మోక్షపు మార్గము ||2|| ఆ మార్గం నీవయ్యా...                                                                                          || మనసే|| 2. "పశు...

Toorpu Dikku Chukka Butte | తూర్పు దిక్కు చుక్క బుట్టె | Christmas Song Lyrics Telugu

Image
తూర్పు దిక్కు చుక్క బుట్టె | Toorpu Dikku Chukka Butte | Christmas Song Lyrics Telugu | Jesus Song Lyrics Telugu | Download తూర్పు దిక్కు చుక్క బుట్టె తూర్పు దిక్కు చుక్క బుట్టె మేరమ్మా – ఓ మరియమ్మా ||2|| చుక్కను జూచి మేము వచ్చినాము మొక్కి పోవుటకు ||2|| ||తూర్పు దిక్కు|| బెత్లెహేము పురము లోని బాలుడమ్మా గొప్ప బాలుడమ్మా ||2|| మన పాపముల బాప పుట్టెనమ్మా మహిమవంతుడమ్మా ||2|| ||తూర్పు దిక్కు|| పశువుల పాకలోని బాలుడమ్మా పాపరహితుడమ్మా ||2|| పాపంబు బాపను పుట్టెనమ్మా సత్యవంతుడమ్మా ||2|| ||తూర్పు దిక్కు|| బంగారం సాంబ్రాణి బోళం తెచ్చినాము బాల యేసు నొద్దకు ||2|| బంగారు పాదముల మ్రొక్కెదము బహుగ పాడెదము ||2|| ||తూర్పు దిక్కు||

Tara Velisindi Aa Ningilo | తార వెలిసింది ఆ నింగిలో | Christmas Song Lyrics Telugu

Image
తార వెలిసింది ఆ నింగిలో | Tara Velisindi Aa Ningilo | Christmas Song Lyrics Telugu | Jesus Song Lyrics | Download తార వెలిసింది ఆ నింగిలో తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది (2) రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని (2) ||తార|| మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే (2) సంతోషమే ఇక సంబరమే లోక రక్షణ ఆనందమే స్తోత్రార్పణే మా రారాజుకే ఇది క్రిస్మస్ ఆర్భాటమే ||తార|| బంగారమును సాంబ్రాణియు బోళంబును తెచ్చాములే ఆ యింటిలో మా కంటితో నిను కనులారా గాంచాములే (2) మా ఇమ్మానుయేలువు నీవేనని నిను మనసారా కొలిచాములే మా యూదుల రాజువు నీవేనని నిను ఘనపరచి పొగిడాములే ||తార||

Aakaashapu Anditlo Chukkala | ఆకాశపు అందిట్లో చుక్కల | Christmas Song Lyrics Telugu

Image
ఆకాశపు అందిట్లో చుక్కల | Aakaashapu Anditlo Chukkala | Christmas Song Lyrics Telugu | Jesus Song Lyrics Telugu | Download ఆకాశపు అందిట్లో చుక్కల సాఖీ: సంబరాలు , సంతోషాలు యేసు ఉంటె చాలు సందడులు (2) ఆకాశపు అందిట్లో చుక్కల పందిరేసి మెరిసింది ఓ దివ్య తార  .. మెరిసింది ఓ దివ్య తార తూరుపు దిక్కుల్లో గొంతెత్తి చాటింది ఆ యేసు రక్షకుని జాడ  .. ఆ యేసు రక్షకుని జాడ సంబరాలు , సంతోషాలు యేసు ఉంటె చాలు సందడులు 1. గొల్లలందరు పూజింప వచ్చిన మంచి కాపరి  - దూతలందరు స్తుతించ వచ్చిన గొప్ప గొప్ప దేవుడు నీకు నాకు నెమ్మదిచ్చు నమ్మదగిన దేవుడు  - తప్పులెంచక ప్రేమ పంచు నాథుడు                                                                     ...

Vachindhi Christmas Vachindhi | వచ్చింది క్రిస్మస్ వచ్చింది | Telugu Christian Popular Christmas Song Lyrics

Image
వచ్చింది క్రిస్మస్ వచ్చింది | Vachindhi Christmas Vachindhi | Telugu Christian Popular Christmas Song Lyrics | Jesus Song Lyrics Telugu | Download వచ్చింది క్రిస్మస్ వచ్చింది వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది రక్షణ తెచ్చింది (2) ఉరువాడ పల్లెపల్లెలోన ఆనందమే ఎంతో సంతోషమే (2) మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను (2) రారండోయ్ వేడుక చేద్దాం కలిసి రారండోయ్ పండుగ చేద్దాం (2)                                                                                                     ||వచ్చింది (2)|| 1. దావీదు పట్టణములో భేత్లేహేము గ్రామములో      కన్యమరియ గర్బమునందు బాలుడిగా జన్మించెను (2)      అంధకారమే తొలగి...

BETHLEHEMU PURAMULO | బేత్లెహేము పురములో ఒక | Jesus Telugu Christmas Song Lyrics

Image
బేత్లెహేము పురములో ఒక | BETHLEHEMU PURAMULO | Jesus Telugu Christmas Song Lyrics | Christmas Song Lyrics Telugu | Download బేత్లెహేము పురములో ఒక బేత్లెహేము పురములో ఒక నాటి రాతిరి ఊహలకు అందని అద్భుతము జరిగెను లోక చరిత మార్చిన దైవకార్యము కన్యమరియ గర్భమందు శిశువు పుట్టెను అహహ్హ ఆశ్చర్యము ఓహోహో ఆనందము రారాజు యేసు క్రీస్తు ని జననము అహహ్హ ఏమా దృశ్యము ఓహొహ్హో ఆ మహత్యము సర్వోన్నతుని స్వరూపము ప్రత్యక్షము ధన్యులం హీనులం మనము ధన్యులం దైవమే మనల కోరి దరికి చేరెను మనిషిగా మన మధ్య చేరే దీన జన్మతో పశువుల తోట్టెలోన నిదుర చేసెను అంటు బాల యేసుని చూడ వచ్చి గొల్లలు మనకు శిశువు పుట్టెనంటూ పరవశించిపోయిరి పుట్టెను యూదులకు రాజు పుట్టెను వెతికిరి ఆ రాజు జాడ కొరకు వెతికిరి నడిపెను ఆకశాన తార కనపడి నిలిచెను యేసు ఉన్న చోటు తెలుపెను తడవు చేయకొచ్చిరి తూర్పు దేశ జ్ఞానులు యేసు చెంత మొకరించి కానుకలర్పించిరి దొరికెను రక్షకుడు మనకు దొరికెను తోడుగా ఇమ్మనియేలు మనకు దొరికెను దేవుని ప్రేమయే ప్రత్యక్షమాయెను యేసుని రూపమే మనకు సాక్షము యేసు జన్మ నింపేను లోకమంతా సంబరం నింపెను నిరీక్షణ కృపయు సమాధానము

Ambarana Velisenu Taara | అంబరాన వెలిసెను తార | Jesus Christmas Song Lyrics Telugu

Image
అంబరాన వెలిసెను తార | Ambarana Velisenu Taara | Jesus Christmas Song Lyrics Telugu | Latest Christmas Song Lyrics Telugu | Download అంబరాన వెలిసెను తార అంబరాన వెలిసెను తార సంబరాలు చేయగ రండి మానవాళి రక్షణ కొరకు మహరాజే ఇల పుట్టెను ప్రేమే క్రిస్మస్ - ఆరాధనే క్రిస్మస్ నిరీక్షణే క్రిస్మస్ నిత్యజీవమే క్రిస్మస్ వాక్యమే శరీరధారిగ మనకై వచ్చెను మంటిదేహమును మహిమగ మార్చుటకు విశ్వసించిన విజయము కలుగును నిత్యజీవానికి మనలను చేర్చును లేఖనాలు నెరవేర్చుటకు భువికే వచ్చెను వాగ్దానములు పరిపూర్ణము చేయుటకు సర్వలోకానికి సువార్త ప్రకటించుటకు పరలోక స్వాస్థ్యము అనుగ్రహించుటకు రోగులను స్వస్థ పరచుటకు చెంతకు చేరెను మరణపుభీతిని పారద్రోలుటకు అపవాది క్రియలను అణచివేయుటకు పరిశుద్దాత్మతో అభిషేంచుటకు

Lokaalanele Naadhudu | లోకాలనేలే నాధుడు | Christmas Song Lyrics Telugu 2024

Image
లోకాలనేలే నాధుడు | Lokaalanele Naadhudu | Christmas Song Lyrics Telugu | Jesus Song Lyrics Telugu | Download లోకాలనేలే నాధుడు ఆకాశ వీధుల్లో ఆనందం - ఆ నింగి తారల్లో ఉల్లాసం ఈ రేయి వెన్నెల్లో సంతోషం - ఇల పొంగేను లోలోన సంగీతం లోకాలకే రారాజుగా - యేసయ్య పుట్టాడుగా .. హేహెయ్ లోకాలనేలే నాధుడు వెలిసాడు నా మెస్సయ్య దరిచేరినాడు దీనుడై ధరలోన నా యేసయ్య ఇలలో జాడగా పలికిందిగా వింతైన ఓ తారక మదిలో నిండుగా ఓ పండుగ తెచ్చాడు నా రక్షక సదా దీపమై సంతోషమై పరమాత్ముడే ఈనాడే జన్మించె అహా సంతోషమే మహదానందమే ఇల వచ్చింది ఓ సంబరం సమాధానమే ఇల నీ కోసమే దిగివచ్చిందిగా ఈ దినం వాక్యమైన దేవుడేగా బాలుడై వచ్చెను పాపమంతా తీసివేయ రక్షణే తెచ్చెను వేడుకైన ఈ దినాన యేసునే వేడుకో అంతులేని చింతలేని పరమునే పొందుకో సదా తోడుగా నీ అండగా పరమాత్ముడే ఈనాడే జన్మించె

CHRISTMAS SUBHA VELALO | క్రిస్మస్ శుభవేళలో | Telugu Christmas Song Lyrics

Image
క్రిస్మస్ శుభవేళలో | CHRISTMAS SUBHA VELALO | Telugu Christmas Song Lyrics | Jesus Christmas Song Lyrics | Download క్రిస్మస్ శుభవేళలో క్రిస్మస్ శుభవేళలో - మన అందరి హృదయాలలో ఆనందమానందమే - మనసంతా సంతోషమే (2) " స్తుతియించి ఆరాదిద్దాం - ఆ ప్రభుని ఘనపరచి కీర్తించుదాం రక్షకుడు పుట్టాడని - మనకు రక్షణ తెచ్చాడని " దావీదు పురమందు రక్షకుడు మన కొరకై జన్మించాడు దేవాధిదేవుని కుమారుడు రిక్తునిగా భువికొచ్చాడు  (2) ఆ ప్రభువే నరుడాయెను - లోకమును ప్రేమించెను మన పాపము తొలగించెను - పరిశుథ్థులుగా చేసెను  (2)                                                                                               ||స్తుతియించి|| సర్వోన్నతమైన స్థలములలో - దేవునికే ...

Bethlehemulonanta – Sandadi | బెత్లహేములోనంటా – సందడి | Christmas Song Lyrics Telugu

Image
బెత్లహేములోనంటా – సందడి | Bethlehemulonanta – Sandadi | Christmas Song Lyrics Telugu | Jesus Song Lyrics Telugu | Download బెత్లహేములోనంటా – సందడి బెత్లహేములోనంటా – సందడి పశువుల పాకలో – సందడి దూతలు వచ్చెనంటా – సందడి పాటలు పాడేనంటా – సందడి (2) రారాజు పుట్టెనని – సందడి మా రాజు పుట్టెనని – సందడి (2) చేసారంట సందడే సందడి చేయబోదాము సందడే సందడి (2) హ్యాప్పీ హ్యాప్పీ.. హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్ అర్ధ రాత్రి వేళలో – సందడి దూతలు వచ్చెనంటా – సందడి రక్షకుడు పుట్టెనని – సందడి వార్తను తెలిపేనటా – సందడి (2) చేసారంట సందడే సందడి చెయ్యబోదాము సందడే సందడి చేసారంట సందడే సందడి చేయబోదాము సందడే సందడే సందడే సందడే సందడే హ్యాప్పీ హ్యాప్పీ.. హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్ గొల్లలు వచ్చిరంటా – సందడి మనసారా మ్రొక్కిరంటా – సందడి అందాల బాలుడంటా – సందడి అందరి దేవుడని – సందడి (2) రారాజు పుట్టెనని – సందడి మా రాజు పుట్టెన...

ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం | Idi Shubhodhayam | Telugu Christian Christmas Song Lyrics

Image
ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం | Idi Shubhodhayam | Telugu Christian Christmas Song Lyrics | Download | Jesus Christmas Song Lyrics Telugu | Download ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరి పుణ్యదినం  (2) రాజులనేలే రారాజు వెలసె పశువుల పాకలో పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో భయము లేదు మనకిలలో జయము జయము జయమహో ||ఇది|| గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయ భక్తితో పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో జయనాదమే ఈ భువిలో ప్రతిధ్వనించెను ఆ దివిలో ||ఇది||

Andala Taara Arudenche Naakai | అందాల తార అరుదెంచె నాకై | Telugu Christimas Song Lyrics

Image
అందాల తార అరుదెంచె నాకై | Andala Taara Arudenche Naakai | Telugu Christimas Song Lyrics Download | Jesus Song Lyrics Telugu అందాల తార అరుదెంచె నాకై అందాల తార అరుదెంచె నాకై - అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి -అవని చాటుచున్ ఆనందసంద్ర ముప్పోంగెనాలో - అమరకాంతిలో ఆది దేవుని జూడ - అశింపమనసు పయనమైతిమి 1. విశ్వాసయాత్ర - దూరమెంతైన - విందుగా దోచెను      వింతైన శాంతి - వర్షంచెనాలో - విజయపధమున      విశ్వాలనేలెడి - దేవకుమారుని - వీక్షించు దీక్షలో      విరజిమ్మె బలము - ప్రవహించె ప్రేమ - విశ్రాంతి నొసగుచున్ 2. యెరూషలేము - రాజనగరిలో - ఏసును వెదకుచు      ఎరిగిన దారి - తొలగిన వేల - ఎదలో క్రంగితి      ఏసయ్యతార - ఎప్పటివోలె - ఎదురాయె త్రోవలో      ఎంతో యబ్బురపడుచు - విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు 3.  ప్రభుజన్మస్ధలము - పాకయేగాని పరలోక సౌధమే      బాలునిజూడ - జీవితమెంత - పావనమాయెను      ప్రభుపాదపూజ - దీవెనకాగా - ప్రసరించె పుణ్యము      బ...