Posts

Showing posts from June, 2024

Aascharyamaina Prema | ఆశ్చర్యమైన ప్రేమ | Telugu Christian Song Lyrics

Image
ఆశ్చర్యమైన ప్రేమ | Aascharyamaina Prema | Telugu Christian Song Lyrics | Download ఆశ్చర్యమైన ప్రేమ      ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ       మరణము కంటె బలమైన ప్రేమది       నన్ను జయించె నీ ప్రేమ (2)   ||ఆశ్చర్యమైన||  1. పరమును వీడిన ప్రేమ – ధరలో పాపిని వెదకిన ప్రేమ       నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే      ||ఆశ్చర్యమైన||  2. పావన యేసుని ప్రేమ – సిలువలో పాపిని మోసిన ప్రేమ       నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమ నిచ్చే      ||ఆశ్చర్యమైన||  3. శ్రమలు సహించిన ప్రేమ – నాకై శాపము నోర్చిన ప్రేమ       విడనాడని ప్రేమది ఎన్నడూ యెడబాయదు        ||ఆశ్చర్యమైన||  4. నా స్థితి జూచిన ప్రేమ – నాపై జాలిని జూపిన ప్రేమ       నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే    ||ఆశ్చర్యమైన||  

సమానులెవరు ప్రభో | Samaanulevaru Prabho | Telugu Christian Song Lyrics | Download

Image
సమానులెవరు ప్రభో | Samaanulevaru Prabho | Telugu Christian Song Lyrics | Download సమానులెవరు ప్రభో      సమానులెవరు ప్రభో       నీ సమానులెవరు ప్రభో (2)       సమానులెవరు ప్రభో       సమస్త మానవ శ్రమాను భవమును (2)       సహించి వహించి ప్రేమించగల (నీ) (2)       ||సమానులెవరో||  1. సమాన తత్వము – సహోదరత్వము (2)       సమంజసము గాను మాకు దెలుప (నీ) (2)       ||సమానులెవరో||  2. పరార్ధమై భవ – శరీర మొసగిన (2)       పరోపకారా నరావ తారా (నీ) (2)       ||సమానులెవరో||  3. దయా హృదయ యీ – దురాత్మ లెల్లరున్ (2) నయాన భ      యాన దయాన బ్రోవ (నీ) (2)       ||సమానులెవరో||  4. ఓ పావనాత్ముడ – ఓ పుణ్య శీలుడ (2)       పాపాత్ములను బ్రోవ – పరమాత్మ సుత (నీ) (2)       ||సమానులెవరో||

Neethigala Yehovaa Sthuthi | నీతిగల యెహోవా స్తుతి | Telugu Christian Song Lyrics

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.16 - యెహోవా ప్రేమ యెహోవ నా మొఱ లాలించెను-దన-మహా దయను నను గణించెను= అహర్నిశల దీనహీనుడగు నా-దు హాయనెడు ధ్వని-గ్రహించి మనిపెను ॥ యెహోవ ॥ 1. పిశాచి గడియ బడగొట్టెను-దన-వశాన నను నిలువ బెట్టెను= ప్రశాంత మధుర సు-విశేష వాక్ఫల నిశాంతమునజే-ర్చి సేదదీర్చెను ॥ యెహోవ ॥ 2. మదావళము బోలు నామదిన్- ధన-ప్రదీప్త వాక్యాంకుశా హతిన్= యధేచ్ఛలన్నిటి గుదించి పాపపు- మొదల్ తుదల్ నరికి దరికి జేర్చెను ॥ యెహోవ ॥ 3. అనీతి వస్త్ర మెడలించెను-యే-సునాధు రక్తమున ముంచెను= వినూత్న యత్నమే - ద నూని యెన్నడు- గనన్ వినన్ బ్రే- మ నాకు జూపెను ॥ యెహోవ ॥ 4. విలాపములకు జెవి నిచ్చెను- శ్రమ-కలాపములకు సెలవిచ్చెను= శిలానగము పై-కి లాగి నను సుఖ-కళావళుల్ మన సులోన నిలిపెను ॥ యెహోవ ॥ 5. అగణ్య పాపియని త్రోయక-న-న్ను గూర్చి తన సుతుని దాచక తెగించి మృతికొ-ప్పగించి పాపపు- నెగుల్ దిగుల్ సొగ-సుగా నణించెను ॥ యెహోవ ॥ ––పురుషోత్తము చౌధరి Yehovaa naa mora laalinchenu-dana-mahaa dayanu nanu ganinchenU= aharnishala deenahInudagu naa-du haayanedu dhvani-grahinchi manipenu || Yehovaa ...

Aparaadhini Yesayya | అపరాధిని యేసయ్యా | Telugu Christian Song Lyrics

Image
అపరాధిని యేసయ్యా | Aparaadhini Yesayya | Telugu Christian Song Lyrics | Download అపరాధిని యేసయ్యా      అపరాధిని యేసయ్యా       కృపజూపి బ్రోవుమయ్యా (2)       నెపమెంచకయె నీ కృపలో       నపరాధములను క్షమించు (2)  1. సిలువకు నిను నే గొట్టి       తులువలతో జేరితిని (2)       కలుషంబులను మోపితిని       దోషుండ నేను ప్రభువా (2)  2. ప్రక్కలో బల్లెపుపోటు       గ్రక్కున పొడిచితి నేనే (2)       మిక్కిలి బాధించితిని       మక్కువ జూపితి వయ్యో (2)  3. ముళ్ళతో కిరీటంబు       నల్లి నీ శిరమున నిడితి (2)       నా వల్ల నేరమాయె       చల్లని దయగల తండ్రి (2)  4. దాహంబు గొనగా చేదు       చిరకను ద్రావ నిడితి (2)       నా వల్ల నేరమాయె       చల్లని దయగల తండ్రి (2)...

Nadipinchu Na Nava | నడిపించు నా నావా | Telugu Christian Song Lyrics

Image
నడిపించు నా నావా | Nadipinchu Na Nava | Telugu Christian Song Lyrics | Download నడిపించు నా నావా      నడిపించు నా నావా నడి సంద్రమున దేవా       నవ జీవన మార్గమున నా జన్మ తరియింప        ||నడిపించు||  1. నా జీవిత తీరమున నా అపజయ భారమున       నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు       నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప       నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము        ||నడిపించు||  2. రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము       రహదారులు వెదకిననూ రాదాయెను ప్రతిఫలము       రక్షించు నీ సిలువ రమణీయ లోతులలో       రతణాలను వెదకుటలో రాజిల్లు నా పడవ          ||నడిపించు||  3. ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి       అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి       ఆశ నిరాశాయే ఆవేదనెదురాయే      ...

Devaa Paapini | దేవా పాపిని | Telugu Christian Song Lyrics | Download

Image
దేవా పాపిని | Devaa Paapini | Telugu Christian Song Lyrics | Download దేవా పాపిని నిన్నాశ్రయించాను      దేవా పాపిని నిన్నాశ్రయించాను       ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా (2)     ||దేవా||  1. అపరాధినై అంధుడనై       అపవాదితో అనుచరుడై (2)       సంచరించితి చీకటిలో       వంచన చేసితి ఎందరినో – (2)     ||దేవా||  2. కలువరిలో సిలువొంద       కలవరమొందె జగమంతా (2)       పాపినైన నా కొరకు       మరణమునే భరించితివి       మరణమునే జయించితివి          ||దేవా||

Devude Naakaashrayambu | దేవుడే నాకాశ్రయంబు | Telugu Christian Song Lyrics

Image
దేవుడే నాకాశ్రయంబు | Devude Naakaashrayambu | Telugu Christian Song Lyrics | Download దేవుడే నాకాశ్రయంబు      దేవుడే నాకాశ్రయంబు – దివ్యమైన దుర్గము       మహా వినోదు డాపదల – సహాయుడై నన్ బ్రోచును       అభయ మభయ మభయ మెప్పు       డానంద మానంద మానంద మౌగ          ||దేవుడే||  1. పర్వతములు కదిలిన నీ – యుర్వి మారు పడినను       సర్వమున్ ఘోషించుచు నీ – సంద్ర ముప్పొంగినన్        ||అభయ||  2. దేవుడెప్డు తోడుగాగ – దేశము వర్ధిల్లును       ఆ తావు నందు ప్రజలు మిగుల – ధన్యులై వసింతురు      ||అభయ||  3. రాజ్యముల్ కంపించిన భూ – రాష్ట్రముల్ ఘోషించిన       పూజ్యుండౌ యెహోవా వైరి – బూని సంహరించును        ||అభయ||  4. విల్లు విరచు నాయన తెగ – బల్లెము నరకు నాయన       చెల్ల చెదర జేసి రిపుల – నెల్లద్రుంచు నాయనే          ...

Mahima Neeke Prabhu | మహిమ నీకే ప్రభూ | Telugu christian Song Lyrics

Image
మహిమ నీకే ప్రభూ | Mahima Neeke Prabhu | Telugu christian Song Lyrics | Download మహిమ నీకే ప్రభూ      మహిమ నీకే ప్రభూ – ఘనత నీకే ప్రభూ (2)       స్తుతి మహిమ ఘనతయు – ప్రభావము నీకే ప్రభూ (2)       ఆరాధనా… ఆరాధనా… (2)       ప్రియ యేసు ప్రభునకే – నా యేసు ప్రభునకే ||మహిమ||  1.  సమీపింపరాని తేజస్సునందు – వసియించు అమరుండవే       శ్రీమంతుడవే సర్వాధిపతివే – నీ సర్వము నాకిచ్చితివే (2)       ||ఆరాధనా||  2. ఎంతో ప్రేమించి నాకై ఏతించి – ప్రాణము నర్పించితివే       విలువైన రక్తం చిందించి – నన్ను విమోచించితివే (2)       ||ఆరాధనా||  3. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి – నను పిలచి వెలిగించితివే       నీ గుణాతిశయముల్‌ ధరనే ప్రచురింప – ఏర్పర్చుకొంటివే (2)       ||ఆరాధనా||

Srusti Pita Sarvonnata | సృష్టిపితా సర్వోన్నతా | Telugu Christian Song Lyrics

Image
సృష్టిపితా సర్వోన్నతా | Srusti Pita Sarvonnata | Telugu Christian Song Lyrics | Download సృష్టిపితా సర్వోన్నతా      సృష్టిపితా సర్వోన్నతా       సమర్పింతున్ సర్వస్వమున్  1. భూమి ఆకాశము నీవే భూధర శిఖరములు నీవే       భూ ప్రజలు నీవారే బలశౌర్యములు నీవే ||సృష్టి||  2. మా వెండి బంగారములు నీవే మాకున్న వరములు       నీవే మా దేహముల్ మా గేహముల్ మా జీవితము నీవే ||సృష్టి||  3. వెలలేని గాలి వెలుతురులు విలువైన పాడి పైరులు       వివిధంబులైన దీవెనలు నీ కరుణా వర్షములు ||సృష్టి||  4. పరిశుద్ధ గ్రంథపు పలుకులు పాలోక తేనె చినుకులు       ప్రభు యేసుని మాటలు మా వెల్గు బాటలు ||సృష్టి||  5. మాదంత నీదే మహా దేవా మా రాజువయ్యా       యెహోవా మా తనువుల్ మా బ్రతుకుల్ మా యావదాస్తి నీవే ||సృష్టి||  6. మేమిచ్చు కాన్క యేపాటిది? యే ప్రేమ నీకు సాటిది?       మోక్ష నాధా యేసుప్రభో అంగీకరించువిభో ||సృష్టి||  7. తండ్రి క...

Rajaadhi Raaja Raa Raa | రాజాధి రాజా రారా | Telugu Christian Song Lyrics

Image
రాజాధి రాజా రారా | Rajaadhi Raaja Raa Raa | Telugu Christian Song Lyrics | Download రాజాధి రాజా రారా      రాజాధి రాజా రారా – రాజులకు రాజువై రారా       రాజయేసు రాజ్యమేల రారా – రవికోటి తేజ యేసు రారా       ఓ …. మేఘ వాహనంబు మీద వేగమే       ఓ …. మించు వైభవంబు తోడ వేగమే  1. ఓ … భూ జనంబు లెల్ల తేరి చూడగా –       ఓ …. నీ జనంబు స్వాగతంబు నీయగా       నీ రాజ్య స్థాపనంబు సేయ – భూ రాజులెల్ల గూలి పోవ –       భూమి ఆకసంబు మారిపోవ       నీ మహా ప్రభావమున వేగ  2. ఆ … ఆకసమున దూత లార్భటింపగా –       ఆ … అది భక్త సంఘ సమేతంబుగా       ఆకసంబు మధ్య వీధిలోన ఏకమై మహా సభ జేయ –       యేసు నాధ! నీదు మహిమ లోన –  మాకదే మహానంద మౌగ  3. ఓ … పరమ యెరుషలేము పుణ్య సంఘమా –       ఓ … గొఱ్ఱియ పిల్ల క్రీస్తు పుణ్య సంఘమా –       పరమ దూతలార! భ...

Naavanni Angikarinchumi | నావన్ని అంగీకరించుమీ దేవా | Telugu Christian Song Lyrics

Image
నావన్ని అంగీకరించుమీ దేవా |  Naavanni Angikarinchumi | Telugu Christian Song Lyrics | Download నావన్ని అంగీకరించుమీ దేవా      నావన్ని అంగీకరించుమీ దేవా - నన్నెపుడు నీవు కరుణించుమీ       నావన్ని కృపచేత నీవలన నొందిన - భావంబునను నేను బహుదైర్యమొందెద  1. నీకు నా ప్రాణము నిజముగ నర్పించి - నీకు మీదుగట్టి నీ కొరకు నిల్పెద  2. సత్యంబు నీ ప్రేమ చక్కగా మధి బూని - నిత్యంబు గరముల నీ సేవ జేసెద  3. నీ సేవ జరిగెడు నీ ఆలయమునకు - ఆశచే నడిపించు మరల నా పదముల  4. పెదవులతో నేను బెంపుగ నీ వార్త - గదలక ప్రకటింప గలిగించు దృడభక్తి  5. నా వెండి కనకంబు నా తండ్రి గైకొనిమీ - యావంత యైనను నాశించ మదిలోన  6. నీవు నా కొసగిన నిర్మల బుద్దిచే - సేవ జేయగ నిమ్ము స్థిరభక్తితో నీకు  7. చిత్తము నీ కృపా యత్తంబు గావించి - మత్తిల్ల కుండగ మార్గంబు దెలుపుము  8. హృదయంబు నీకిత్తు సదనంబు గావించి - పదిలంబుగా దాని బట్టి కాపాడుము

Emmanuyelu Rakthamu | ఇమ్మానుయేలు రక్తము | Telugu Christian Song Lyrics

Image
ఇమ్మానుయేలు రక్తము | Emmanuyelu Rakthamu | Telugu Christian Song Lyrics | Download ఇమ్మానుయేలు రక్తము      ఇమ్మానుయేలు రక్తము       ఇంపైన యూటగు       ఓ పాపి! యందు మున్గుము       పాపంబు పోవును  1. యేసుండు నాకు మారుగా       ఆ సిల్వ జావగా       శ్రీ యేసు రక్త మెప్పుడు       స్రవించు నాకుగా  2. ఆ యూట మున్గి దొంగయు       హా! శుద్ధు-డాయెను       నేనట్టి పాపి నిప్పుడు       నేనందు మున్గుదు  3. నీ యొక్క పాప మట్టిదే       నిర్మూల మౌటకు       రక్షించు గొర్రె పిల్ల? నీ       రక్తంబే చాలును  4. నా నాదు రక్తమందున       నే నమ్మి యుండినన్       నా దేవుని నిండు ప్రేమ       నే నిందు జూచెదన్  5. నా ఆయుష్కాల మంతటా       నా సంతసం-...

Kummari O Kummari | కుమ్మరి ఓ కుమ్మరి | Telugu Christian Song Lyrics

Image
కుమ్మరి ఓ కుమ్మరి | Kummari O Kummari | Telugu Christian Song Lyrics | Download కుమ్మరి ఓ కుమ్మరి      కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి       జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా       ఆ ఆ ఆ చల్లగ చూడుమయ్యా  1. పనికిరాని పాత్రనని – పారవేయకుమా       పొంగి పొరలు పాత్రగా – నన్ను నింపుమా (2)       సువార్తలోని పాత్రలన్నీ – శ్రీ యేసుని పొగడుచుండ       సాక్షిగానుండు పాత్రగజేసి – సత్యముతో నింపుము తండ్రి       ఆ ఆ ఆ సత్యముతో నింపుము తండ్రి ||కుమ్మరి||  2. విలువలేని పాత్రను నేను – కొనువారు లేరెవ్వరు       వెలలేని నీదు రక్తంబుతో – వెలుగొందు పాత్రగజేసి (2)       ఆటంకములనుండి తప్పించి నన్ను – ఎల్లప్పుడు కావుమయ్యా       పగిలియున్న పాత్రను నేను – సరిచేసి వాడుమయ్యా       ఆ ఆ ఆ సరిచేసి వాడుమయ్యా ||కుమ్మరి||  3. లోకాశతో నిండి ఉప్పొంగుచూ – మార్గంబు నే దప్పిత...

Mangalame Yesunaku | మంగళమే యేసునకు | Telugu Christian Song Lyrics

Image
మంగళమే యేసునకు |  Mangalame Yesunaku | Telugu Christian Song Lyrics | Download మంగళమే యేసునకు      మంగళమే యేసునకు – మానుజావతారునకు (3)       శృంగార ప్రభువునకు (2)       క్షేమాధిపతికి మంగళమే            ||మంగళమే||  1. పరమ పవిత్రునకు – వర దివ్య తేజునకు (3)       నిరుపమానందునకు (2)       నిపుణ వేద్యునకు మంగళమే            ||మంగళమే||  2. దురిత సంహారునకు – వర సుగుణోదారునకు (3)       కరుణా సంపన్నునకు (2)       జ్ఞాన దీప్తునకు మంగళమే            ||మంగళమే||  3. సత్య ప్రవర్తునకు – సద్ధర్మ శీలునకు (3)       నిత్య స్వయంజీవునకు (2)       నిర్మలాత్మునకు మంగళమే            ||మంగళమే||  4. యుక్త స్తోత్రార్హునకు – భక్త రక్షామణికి (3)       సత్య పరంజ్యోతి య...

Yudhdhamu Yehovaade | యుద్ధము యెహోవాదే | Telugu Christian Song Lyrics

Image
యుద్ధము యెహోవాదే | Yudhdhamu Yehovaade | Telugu Christian Song Lyrics | Download యుద్ధము యెహోవాదే      యుద్ధము యెహోవాదే (4)  1. రాజులు మనకెవ్వరు లేరు       శూరులు మనకెవ్వరు లేరు (2)       సైన్యములకు అధిపతి అయినా       యెహోవా మన అండ            ||యుద్ధము||  2. వ్యాధులు మనలను పడద్రోసినా       బాధలు మనలను కృంగదీసినా (2)       విశ్వాసమునకు కర్త అయినా       యేసయ్యే మన అండ            ||యుద్ధము||  3. ఎరికో గోడలు ముందున్నా       ఎర్ర సముద్రము ఎదురైనా (2)       అద్బుత దేవుడు మనకుండా       భయమేల మనకింకా            ||యుద్ధము||  4. అపవాది అయిన సాతాను       గర్జించు సింహంవలె వచ్చినా (2)       యూదా గోత్రపు సింహమైనా       ...

Devuniki Sthothramu Gaanamu | దేవునికి స్తోత్రము గానము | Telugu Christian Song Lyrics

Image
దేవునికి స్తోత్రము గానము | Devuniki Sthothramu Gaanamu | Telugu Christian Song Lyrics | Download దేవునికి స్తోత్రము గానము      దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది       మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది  1. యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడని       ఇశ్రయేలీయులను పోగుచేయువాడని                ||దేవునికి||  2. గుండె చెదరిన వారిని బాగుచేయువాడని       వారి గాయములన్నియు కట్టుచున్నవాడని        ||దేవునికి||  3. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును       వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని            ||దేవునికి||  4. ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు       జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని          ||దేవునికి||  5. దీనులకు అండాయెనే భక్తిహీనుల కూల్చును       సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి...

Aayane Naa Sangeethamu | ఆయనే నా సంగీతము | Telugu Christian Song lyrics

Image
ఆయనే నా సంగీతము | Aayane Naa Sangeethamu | Telugu Christian Song lyrics | Download ఆయనే నా సంగీతము      ఆయనే నా సంగీతము బలమైన కోటయును       జీవాధిపతియు ఆయనే       జీవిత కాలమెల్ల స్తుతించెదము          ||ఆయనే||  1. స్తుతుల మధ్యలో నివాసం చేసి       దూతలెల్ల పొగడే దేవుడాయనే (2)       వేడుచుండు భక్తుల స్వరము విని       దిక్కు లేని పిల్లలకు దేవుడాయనే (2)          ||ఆయనే||  2. ఇద్దరు ముగ్గురు నా నామమున       ఏకీభవించిన వారి మధ్యలోన (2)       ఉండెదననిన మన దేవుని       కరములు తట్టి నిత్యం స్తుతించెదము (2)       ||ఆయనే||  3. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున       జీవిత కాలమెల్ల కీర్తించెదము (2)       రాకడలో ప్రభుతో నిత్యముందుము       మ్రొక్కెదము స్తుతించెదం పొగడె...

Hrudayamanedu Thalupu | హృదయమనెడు తలుపు నొద్ద | Telugu Christian Song Lyrics

Image
హృదయమనెడు తలుపు నొద్ద | Hrudayamanedu Thalupu | Telugu Christian Song Lyrics | Download హృదయమనెడు తలుపు నొద్ద హృదయమనెడు తలుపు నొద్ద – యేసు నాథుండు  నిలచి – సదయుడగుచు దట్టుచుండు – సకల విధములను (2)        ||హృదయ||  పరుని బోలి నిలుచున్నాడు – పరికించి చూడ  నతడు – పరుడు గాడు రక్షకుండు – ప్రాణ స్నేహితుడు (2)        ||హృదయ||  కరుణా శీలుండతడు గాన – గాచి యున్నాడు  యేసు – కరుణ నెరిగి గారవింప – గరము న్యాయంబు (2)        ||హృదయ||  ఎంత సేపు నిలువ బెట్టి – యేడ్పింతు రతని  నాత – డెంతో దయచే బిలుచుచున్నా – డిప్పుడు మిమ్ములను (2)        ||హృదయ||  అతడు మిత్రుడతడు మిత్రుం – డఖిల పాపులకు  మీర – లతని పిలుపు వింటి రేని – యతడు ప్రియుడగును (2)        ||హృదయ||  జాలి చేత దన హస్తముల – జాపి యున్నాడు  మిమ్ము – నాలింగనము సేయ గోరి – యనిశము కనిపెట్టు (2)        ||హృదయ||  సాటిలేని దయగల వాడు – సర్వేశు సుతుడు  తన – మాట విన...

Ruchi Choochi Erigithini | రుచి చూచి ఎరిగితిని | Telugu Christian Song Lyrics

Image
రుచి చూచి ఎరిగితిని | Ruchi Choochi Erigithini | Telugu Christian Song Lyrics | Download రుచి చూచి ఎరిగితిని రుచి చూచి ఎరిగితిని – యెహోవా ఉత్తముడనియు (2)  రక్షకు నాశ్రయించి – నే ధన్యుడనైతిని (2)         || రుచి చూచి||  గొప్ప దేవుడవు నీవే – స్తుతులకు పాత్రుడ నీవే (2)  తప్పక ఆరాధింతున్ – దయాళుడవు నీవే (2)   || రుచి చూచి||  మహోన్నతుడవగు దేవా – ప్రభావము గలవాడా (2)  మనసార పొగడెదను నీ – ఆశ్చర్యకార్యములన్ (2)   || రుచి చూచి||  మంచి తనము గల దేవా – అతి శ్రేష్టుడవు అందరిలో (2)  ముదమార పాడెద నిన్ను- అతి సుందరడవనియు (2)  || రుచి చూచి||  కృతజ్ఞతా చెల్లింతున్ – ప్రతి దాని కొరకు నేను (2)  క్రీస్తుని యందే తృప్తి – పొంది హర్షించెదను (2)     || రుచి చూచి||  ప్రార్ధింతును ఎడతెగక – ప్రభు సన్నిధిలో చేరి (2)  సంపూర్ణముగ పొందెదను – అడుగువాటన్నిటిని (2)    || రుచి చూచి||

Nee Dhanamu Nee Ghanamu | నీ ధనము నీ ఘనము | Telugu Christian Song lyrics

Image
నీ ధనము నీ ఘనము | Nee Dhanamu Nee Ghanamu | Telugu Christian Song lyrics | Download నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే      నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే       నీ దశమా భాగమునీయ వెనుదీతువా – వెనుదీతువా       ||నీ ధనము||  1. ధరలోన ధన ధాన్యముల నీయగా       కరుణించి కాపాడి రక్షింపగా (2)       పరలోక నాధుండు నీకీయగా       మరి యేసు కొరకీయ వెనుదీతువా          ||నీ ధనము||  2. పాడిపంటలు ప్రభువు నీకీయగా       కూడు గుడ్డలు నీకు దయచేయగా (2)       వేడంగ ప్రభు యేసు నామంబును       గడువేల ప్రభుకీయ నో క్రైస్తవా        ||నీ ధనము||  3. వెలుగు నీడలు గాలి వర్షంబులు       కలిగించె ప్రభు నీకు ఉచితంబుగా (2)       వెలిగించ ధర పైని ప్రభు నామము       కలిమి కొలది ప్రభున కర్పింపవా        ...

Parishudhdha Parishudhdha | పరిశుద్ధ పరిశుద్ధ | Telugu Christian Song Lyrics

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.20 - త్రియేక దేవుని స్తుతి పరిశుద్ధ పరిశుద్ధ- పరిశుద్ధ ప్రభువా= వరదూత లైన నిన్- వర్ణింపగలరా ॥ పరిశుద్ధ ॥ 1. పరిశుద్ధ జనకుడ-పరమాత్మ రూపుడ - నిరుపమ బలబుద్ధి-నీతి ప్రభావ ॥ పరిశుద్ధ ॥ 2. పరిశుద్ధ తనయుడ - నరరూపధారుడ= నరులను రక్షించు-కరుణా సముద్రా ॥ పరిశుద్ధ ॥ 3. పరిశుద్ధ మగు నాత్మ-వరము లిడు నాత్మ= పరమానంద ప్రేమ- భక్తుల కిడుమా ॥ పరిశుద్ధ ॥ 4. జనక కుమారాత్మ-లను నేక దేవా= ఘనమహిమ చెల్లును- దనర నిత్యముగా ॥ పరిశుద్ధ ॥ ––యెషయా వీర మార్టిన్ Parishuddha parishuddha- parishuddha prabhuvaa= varadoota laina nin- varnimpagalaraa || Parishuddha || 1. Parishuddha janakuda-paramaatma roopuda - nirupama balabuddhi-neeti prabhaava || Parishuddha || 2. Parishuddha tanayuda - nararoopadhaaruda= narulanu rakshinchu-karunaa samudraa || Parishuddha || 3. Parishuddha magu naatma-varamu lidu naatma= paramaananda prema- bhaktula kidumaa || Parishuddha || 4. Janaka kumaraatma-lanu neka devaa= ghanamahima chellunu- danara nityamugaa |...