Recent Songs
Popular Songs

Posts

Goppa Deva Naaku | గొప్ప దేవ నాకు | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.60 - తండ్రియగు దేవుడు నీవు నాతండ్రివి గొప్ప దేవ నాకు తండ్రివు-యాకాశమందు- గొప్ప దేవ నాకు దండ్రివి = తప్పకుండ వత్తు నీ-దరికి యేసు నామమందు-గొప్ప కరుణచేత న- న్నిప్పుడు తగజేర్చుకొనుము ॥ గొప్ప ॥ 1. నీవు మిగుల గొప్ప వాడవు నా సృష్టి కర్త -యీవు లెపుడు నిచ్చు వాడవు= భావమందు నిను దలంచి- పావనాత్మ నాకు నిచ్చి- జీవమార్గ మందు నిలిపి- కావు మనుచు వేడుకొందు ॥ గొప్ప ॥ 2. చిన్న వాని నంగి ప్రార్ధన-నీలోకమందు-మున్ను దయను విన్న వాడవు = సన్నుతుడగు యేసు నీదు - సన్నిధి నున్నాడు గాన-నన్ను గనికరించు మనుచు- నిన్ను నమ్మి వత్తు నిపుడు ॥ గొప్ప ॥ 3. విలువ గల్గు నీదు నాజ్ఞలు- నాహృదయమందు -బలువిధముల దలచు చుందును= బలుకులందు బనులయందు- బలముజూపి నిన్ను గొలిచి-యిలనునిన్ను బ్రీతి పరతు- నలయక నీ కరుణ మెయిని ॥ గొప్ప ॥ 4. మీది రాజ్యమందు జేర్చుము- కరుణా సముద్ర -బీద నైన నన్ను గరుణచే= సోదరులను గూడికొనుచు-మోద మొప్పగ నీదు సేవ- బాదుకొనుచు నుందును నీ పాదపద్మములను బట్టి ॥ గొప్ప ॥ ––పులిపాక జగన్నాధము Goppa Deva naaku tandrivu-aakaashamandu-goppa Deva naaku dandrivi = Ta...

Sukshēma Shubhakaala | సుక్షేమ శుభకాల | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.59 - సుక్షేమ శుభకాల 1. సుక్షేమ శుభకాల విశ్రాంతి దినమా విచార మెల్ల తీర్చు దైవాదివారమా ఈనాడు మేము కూడి దేవాలయంబున యా త్ర్యేక దేవ స్తుతి గావింతు మెంతయు 2. నీయందు సృష్టికర్త విశ్రమ మొందెను నీయందు యేసు క్రీస్తు మృత్యు బంధమును త్రెంచుచు తాను లేచి చావున్ జయించెన్ నీ యందు పావనాత్మ మాకియ్య బడెను 3. భూవాసు లీ దినంబు సంతోష పడుచు సువార్తవిని, పాడి మా యేసు స్తోత్రము పితృ పుత్ర శుద్ధాత్మ త్రిత్వంబౌ దేవుని ఉత్సాహ ధ్వనితోడ నెంతో స్తుతింతురు. అను: జాకబ్ చేంబర్లేన్ ––క్రిష్టఫర్ వర్డ్స్ వర్త్ 1. Sukshēma shubhakaala Vishraanti dinamaa Vichaara mella teerchu Daivaadivaaramaa Eenaadu memu koodi Devaalayambuna Yaa tryeka Deva stuti Gaavintu mentayu 2. Neeyandu Srushtikarta Vishrama mondenu Neeyandu Yesu Kreesthu Mrutyu bandhamunu Trenchuchu taanu lechi Chaavun jayinchen Nee yandu Paavanaatma Maakiyya badenu 3. Bhoovaasu lee dinambu Santosha paduchu Suvaartavini, paadi Maa Yesu stotramu Pitru putra Shuddhaatma Trittvambou Devuni Utsaaha dhvan...

Idi Yehovaa Kaliginchina | ఇది యెహోవా కలిగించిన | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.58 - ప్రభునికైన ప్రత్యేక దినములు ప్రభు దినము ఇది యెహోవా కలిగించిన దినము = సుదివసంబునను-జొప్పడు గడియలు-కొదువలేని దయ-గుల్కెడు వానివి 1. మోక్షము భూమియు స-మ్మోద మంది నుతు = లక్షరు గద్దె చుట్టు నాక్రమింతురు గాక 2. అతడీ దినమం-దంత మొందు సర= వితతి నుండి వే-వేగ వచ్చెను 3. ఆ పిశాచ రా-రాజ్యంబు కూలినది = ఆ పరేశు విజ-యము లీ దినమున 4. సేవక వరులు విల-సింపగ జేసి యా= పావనాద్భుతముల- బ్రచురముజేయుదు 5. దావీదుని వర-తనయుడై యభిషే=కావృతుడౌ రాజా- గ్రణికి హోసన్నా ––పురుషోత్తము చౌధరి Idi Yehovaa kaliginchina dinamu = Sudivasambunanu-joppadu Gadiyalu-koduvanileni daya-gulkedu vaanivi 1. Mokshamu bhoomiyu sa-mmooda mandi nutu = Laksharu gadd e chuttu naakraminturu gaaka 2. Atadee dinamam-danta mondu sara= Vitat i nundi ve-vega vachchenu 3. Aa pishaacha raa-raajyambu koolinadi = Aa Pareshu vija-yamu lee dinamuna 4. Sevaka varulu vila-simpaga jesi yaa= Paavanaadbhutamula- brachuramu jeyudu 5. Daaveeduni vara-tanayudai yabhishe-kaavritudau...

O Rakshakaa, Nee | ఓరక్షకా, నీ దివ్యనామము | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.57 - Saviour, again to thy dear Name we raise 1. ఓరక్షకా, నీ దివ్యనామము ఐక్యంబుతోను స్తుతియింతుము ఆరాధనాంత మొందు వేళయం దనుగ్రహించు నీదు దీవెనన్ 2. గృహంబు జేర నాత్మ శాంతిని ఒసంగి మాతో నుండుముసదా ఇచ్చట సేవ జేయు మమ్మును పాపంబు జేయుకుండగాయుము 3. మా చుట్టునుండు మబ్బునప్రభో ని దివ్యకాంతిన్మాకునియ్యుమా పాపాంధకార బాధనుండి నీ బిడ్డల మైన మమ్ముబ్రోవుమా ––జాన్ ఎల్లెర్టన్ అను: బర్నాల్డ్ లూకాస్ 1. O Rakshakaa, nee divyanaamamu Aikyambutonu stutiyintumu Aaraadhanaanta mondu velayam Danugrahinchu needu deevenan 2. Gruhambu jera naatma shaantini Osangi maato nundumusadaa Ichchata seva jeyu mammunu Paapambu jeyukundagaayumu 3. Maa chuttunundu mabbuna Prabho Nee divyakaantin maakuniyyumaa Paapaandhakaara baadha nundi nee Biddala maina mammu brovumaa ––Jaan Ellerton Anu: Barnald Lukas

Raatriyaye Nannedabaayaku | రాత్రియయ్యె నన్నెడబాయకు | Andhra Kraistava Keerthanalu

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.56 - Abide with me, fast falls the eventide 1. రాత్రియయ్యె నన్నెడబాయకు ధాత్రిపై జీకటులు గ్రమ్మెను సహాయ మేమి లేనివారికి సహాయుడా, నన్బాసిపోకుమీ. 2. ఏకాలంబైన నీ సహాయము లేక పిశాచిన్ గెల్వజాలను నీకంటె దిక్కు నాకు లేదుగా లోక ప్రకాశుడా నన్బాయకు. 3. నా చెంత నీవు చేరియుండగ ఏ చింతయైన నన్నుసోకునా ఏ శత్రువైన నన్ను గెల్చునా నా శైలమా, నన్బాసి పోకుమా. 4. సమృద్ధుడు సహాయుడాయెను ఓ మృత్యువా నీ ముల్లు గెల్చునా? సమాధి నీకు జయ మబ్బునా? మామధ్యమున్ సర్వేశపాయకు. 5. రేవు నే జేరబోవు వేళలోన్ కావుమయ్యా నీదీప్తి జూపుచున్ చావు జీవంబులందు నైనను నీవు తోడై నన్బాసి పోకుము. ––హెన్రీ ప్రాన్సిస్ లైట్ 1. Raatriyaye nannedabaayaku Dhaatripai jeekatulu grammenu Sahaaya memi lenivaariki Sahaayudaa, nanbaasipokumi. 2. Ekaalambaina nee sahaayamu Leka pishaachin gelvajaalanu Neekante dikku naaku ledugaa Loka prakaashudaa nanbaayaku. 3. Naa chenta neevu cheriyundaga Ye chintayaina nannusokunaa Ye shatruvaina nannu gelchunaa Naa shailamaa, nanbaasi pokumaa. 4. ...

Proddu Grunkuchunnadi | ప్రొద్దు గ్రుంకుచున్నది | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.55 - Day is dying in the west ॥ శుద్ధ, శుద్ధ, శుద్ధ సర్వేశుడా ఇద్దరాకాశంబులు సన్నుతించుచున్నవి సర్వోన్నతా ॥ 1. ప్రొద్దు గ్రుంకుచున్నది సద్దణంగుచున్నది యాకసంబు దివ్వెలు లోకమున్ వెల్గింపగా స్తుతించుడి ॥ శుద్ధ, శుద్ధ, శుద్ధ సర్వేశుడా ఇద్దరాకాశంబులు సన్నుతించుచున్నవి సర్వోన్నతా ॥ 2. జీవితాంతమందున నీ విచిత్ర జ్యోతులన్ జూచుచుండగాను మా కీ వొసంగు నీ కృపన్ నిత్యోదయం ॥ శుద్ధ, శుద్ధ, శుద్ధ సర్వేశుడా ఇద్దరాకాశంబులు సన్నుతించుచున్నవి సర్వోన్నతా ॥ 3. నిన్ను గోరువారము సన్ను తేశ నీ దరిన్ మమ్ముజేర్చుకొమ్ము నీ విమ్ము నిత్య సౌఖ్యమున్ స్తోత్రం నీకు. ॥ శుద్ధ, శుద్ధ, శుద్ధ సర్వేశుడా ఇద్దరాకాశంబులు సన్నుతించుచున్నవి సర్వోన్నతా ॥ ––మేరి లాల్బరీ. అను: ఒంగోలు దావీదు || Shuddha, Shuddha, Shuddha Sarveshudaa Iddar aakaashambulu Sannutinchuchunnavi Sarvonnataa || 1. Proddu grunkuchunnadi Saddanangu chunnadi Yaakasambu divvelu Lokamun velgimpagaa Stutinchudi || Shuddha, Shuddha, Shuddha Sarveshudaa Iddar aakaashambulu Sannutinchuchunnavi Sarvonnat...

Naa Yesoo, Aatma | నా యేసూ, ఆత్మ | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.54 - Sun of my soul, thou Saviour dear 1. నా యేసూ, ఆత్మ సూర్యుడా నీవున్న రాత్రి కమ్మదు నా యాత్మలో నీ విప్పుడు వసించి పాయకుండుమీ. 2. నేను నిద్రించు వేళలో నాకు నభయ మియ్యుము నే లేచి పని చేయగా నా యొద్ద నుండు రక్షకా. 3. నా తోడ రాత్రింబగళ్ళు నీ వుండి నడిపించుము నీవు నాతో లేకుండినన్ జీవింప జావజాలను. 4. నేడు నీ దివ్య వాక్యము వినిన పాపు లెల్లరిన్ క్షమించి గుణపరచి నీ మందలోకి జేర్చుము. 5. రోగిని స్వస్థపరచి బీదలను పోషించుమీ దుఃఖించువారి దుఃఖము బాపి యానంద మియ్యుము. ––జాన్‌ కేబిల్‌, అను; జాకబ్‌ చేంబర్లేన్‌ 1. Naa Yesoo, aatma Sooryudaa Neevunna raatri kammadu Naa yaatmalo nee vippudu Vasinchi paayakundumi. 2. Nenu nidrinchu velalo Naaku nabhaya miyyumu Ne lechi pani cheyagaa Naa yodda nundu Rakshakaa. 3. Naa toda raatrimbagallu Neevundi nadipinchumu Neevu naato lekundinan Jeevimpa jaavajaalanu. 4. Nedu nee divya vaakyamu Vinina paapu lellarin Kshaminchi gunaparachi Nee mandaloki jerchumu. 5. Rogini svasthaparachi Beedhalanu p...

Ringtones

View All →

Loading...

View more ringtones