Yehova Naa Mora Laalinchenu | యెహోవ నా మొర లాలించెను | Telugu Christian Song Lyrics
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Song No.16 - యెహోవా ప్రేమ
యెహోవ నా మొఅ లాలించెను-దన-మహా దయను నను గణించెను=
అహర్షిశల దీనహీనుండగు నా-దు హాయనెడు ధ్వని-గ్రహించి మనిపెను
॥ యెహోవ ॥
1. పిశాచి గడిమిం బడంగొట్టెను-దన-వశాన నను నిలువం బెట్టెను=
ప్రశాంత మధుర సు-విశేష వాక్ఫల నిశాంతమునంజే-ర్చి సేదందీర్చెను
॥ యెహోవ ॥
2. మదావళముం బోలు నామదిన్- ధన-ప్రదీప్త వాక్యాంకుశా హతిన్=
యధేచ్చలన్నిటి గుదించి పాపపు- మొదల్ తుదల్ నరికి దరికిం జేర్చెను
॥ యెహోవ ॥
3. అనీతి వస్త్ర మెడలించెను-యే-సునాధు రక్తమున ముంచెను=
వినూత్న యత్నమై- ద నూని యెన్నండు- గనన్ వినన్ ట్రే- మ నాకుం
॥ యెహోవ ॥
4. విలాపములకుం జెవి నిచ్చెను- శ్రమ-కలాపములకు సెలవిచ్చెను=
శిలానగము పై-కి లాగి నను సుఖ-కళావళుల్ మన-సులోన నిలిపెను
॥ యెహోవ ॥
5. అగణ్య పాపియని త్రోయక-న-న్ను గూర్చి తన సుతుని దాంచక
తెగించి మృతికొ-ప్పగించి పాపపు- నెగుల్ దిగుల్ సొగ-సుగా నణించెను
॥ యెహోవ ॥
––పురుషోత్తము చౌధరి
Yehova naa mora laalinchenu-dana-mahaa dayanu nanu ganinchenu=
Aharshishala deenaheenundagu naa-du haayanedu dhvani-grahinchi manipenu
|| Yehova ||
1. Pishaachi gadimim badangottenu-dana-vashaana nanu niluvam bettenu=
Prashaantha madhura su-visheesha vaakphala nishaanthamunamjee-rchi seedandeerchenu
|| Yehova ||
2. Madaavalamum bolu naamadin- dhana-pradeeptha vaakyaankushaa hathin=
Yadhechchalannitigudinchi paapapu- modal thudal nariki darikim jeerchenu
|| Yehova ||
3. Aneethi vasthra medalinchenu-ye-sunaadhu rakthamuna munchenu=
Vinoothna yathnamai- da nooni yennandu- ganan vinan tre- ma naakum
|| Yehova ||
4. Vilaapamulakum jevi nichchenu- shrama-kalaapamulaku selavichchenu=
Shilaanagamu pai-ki laagi nanu sukha-kalaavalul mana-sulona nilipenu
|| Yehova ||
5. Aganya paapiyani throyaka-na-nnu goorchi thana suthuni daanchaka
Teginchi mruthiko-ppaginchi paapapu- negul digul soga-sugaa naninchenu
|| Yehova ||
––Purushotthamu Chaudhari
Comments
Post a Comment