నీలోనే ఆనందం | Neelone Anandham | Telugu Christian Song Lyrics | Download
నీలోనే ఆనందం
నీలోనే ఆనందం నా దేవా
నీలోనే నాకు జీవం (2)
నిన్న నేడు నిరంతరం మారని దేవా (2)
ఈ లోకమంత నేను వేదకినా
నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం
నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా
నా హృదయం పొంగెను (2)
1. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నను
ఏది నా సొంతం కాదనుకున్నాను (2)
తప్పిపోయిన కుమారుని నేనయితే
నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసూ (2)
||ఈ లోకమంతా||
2. ఏ ప్రేమా నీ ప్రేమకు సాటిరాదయ్యా
ఎన్ని ఉన్నా నీతో సరియేదికాదయా (2)
నన్ను మరువని ప్రేమ నీదయ్యా
నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా (2)
||ఈ లోకమంతా||