సిలువలో సాగింది యాత్ర Lyrics | Siluvalo Saagindi Yatra Telugu Christian Song

సిలువలో సాగింది యాత్ర Lyrics – Siluvalo Saagindi Yatra Telugu Christian Song

సిలువలో సాగింది యాత్ర తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం Lyrics


సిలువలో సాగింది యాత్ర
కరుణామయుని దయగల పాత్ర (2)
ఇది ఎవరి కోసమో
ఈ జగతి కోసమే
ఈ జనుల కోసమే

పాలు కారు దేహము పైన
పాపాత్ముల కొరడాలెన్నో (2)
నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి (2)
నోరు తెరువ లేదాయే ప్రేమ
బదులు పలుక లేదాయే ప్రేమ (2)

వెనుక నుండి తన్నింది ఒకరు
తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు (2)
గేలి చేసినారు పరిహాసమాడినారు (2)
నోరు తెరువ లేదాయే ప్రేమ
బదులు పలుక లేదాయే ప్రేమ (2)

సిలువలో సాగింది యాత్ర Telugu Christian Song Lyrics | Siluvalo Saagindi Yatra

Comments