Koodikoni Yunnaamu | కూడికొని యున్నాము | Andhra Kraistava Keerthanalu

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Song No.18 - క్రైస్తవారాధన

కూడికొని యున్నాము- సంఘ ప్రభో- కూడికొన్ని యున్నాము=తోడ

నుండెద ననుచు నమ్ముచు-దొడ్డ దగు నీ పాద సన్నిధి

॥ కూడుకొని ॥

1. ఎచట నా ప్రియ భక్తు-లెలమి గూడియున్న నచటికి నేతెంతు-నని
పల్కితి= విచట నుండు మమ్ము-వీక్షించి కృపచేత నిపుడు దీవించు
మీ-యేసు క్రీస్తునాధా

॥ కూడుకొని ॥

2. గత కాలమందున-గానీ చేతలచే దుర్గతి నొందియుండగా-
గనుగొంటివి= శత సంఖ్య గల పాప-చయ మీవు క్షమియించి-యతి
శాంతి నిడితివి- యాత్మస్వరూపా

॥ కూడుకొని ॥

3. నిరతము నీ ప్రేమ-నెనరున ధ్యానించి- పరమ ధర్మములందు-
బరతగల్గి= యరులకు శుభములు-నిరతంబు జేయగ - దిరత
మాకొసగుము-దేవుని ప్రియ తనయా

॥ కూడుకొని ॥

4. అన్ని శోధనముల-నన్ని విపత్తుల- నన్ని కాలములందు-నాదరించి
నిన్ను నమ్మిన జనుల-నీ సందిటను జేర్చి- పన్నుగ గాపాడు-ప్రభు
యేసు క్రీస్తు

॥ కూడుకొని ॥

5. అమలుడ నగు న-న్ననుకరించుండనుచు-నాన తిచ్చి నాడ-
వాత్మజులుక= నమల మార్గమునందు- నరుగంగ మాకీవు- విమలాత్మ \
దయచేయు- వేగంబు మా తండ్రీ

॥ కూడుకొని ॥

––పులిపాక జగన్నాధము

Koodikoni yunnaamu- sangha prabho- koodikonni yunnaamu= toda

nundedananuchu nammuchu-dodda dagu nee paada sannidhi

|| Koodukoni ||

1. Echata naa priya bhaktu-lelami goodiyunna nachatiki netentu-nani
palkiti= vichata nundu mammu-veekshinchi krupacheta nipudu deevinchu
mee-Yesu Kreestunaadhaa

|| Koodukoni ||

2. Gata kaalamanduna-gaani chetalache durgati nondiyundagaa-
ganugontivi= shata sankhya gala paapa-chaya meevu kshamiyinchi-yati
shaanti niditivi- yaatmaswaroopaa

|| Koodukoni ||

3. Niratamu nee prema-nenaruna dhyaaninchi- parama dharmamulandu-
baratagalgI= yarulaku shubhamulu-niratambu jeyaga- dirata
maakosagumu-devuni priya tanayaa

|| Koodukoni ||

4. Anni shodhanamula-nanni vipattula-nanni kaalamulandu-naadarinchi
ninnu nammina janula-nee sanditanu jerchi-pannuga gaapaadu-prabhu
Yesu Kreestu

|| Koodukoni ||

5. Amaluda nagu na-nnanukarinchundanuchu-naana tichchi naada-
vaatmajuluka= namala maargamunandu-naruganga maakeevu- vimalatma
dayacheyu- vegambu maa tandree

|| Koodukoni ||

––Pulipaaka Jagannaadhamu

Comments