Maa Kartha Gatti Durgamu | మా కర్త గట్టి దుర్గము | Andhra Kraistava Keerthanalu

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Song No.37 - A mighty fortress is our God

1. మా కర్త గట్టి దుర్గము
నే నమ్ము ఆయుధంబు
సంప్రాప్తమైన కష్టము
ల నన్నిటి నణంచు
ఆ పాత శత్రు
వెంతో క్రూరుడు
తదాయుధము
లుపాయశక్తులు
ఆతం డసమానుండు.

2. మేమో నశించి పోదుము
మా శక్తి నిష్ఫలంబు
మాకై ప్రభుని శూరుడు
యుద్ధంబు చేసి పెట్టు
ఆతండెవ్వండు?
యేసు క్రీస్తును
మా రక్షకుండు
మరోక్కం డెవ్వడు?
అతండె గెల్చుపొందు.

3. ప్రపంచ మంతటన్ గ్రమ్ము
పిశాచు లేమి చేయు?
మమ్మెల్ల మింగ నున్నను
మాకేల భీతి వేయు?
ఈ లోకాథిపు
డుగ్రుడైనను
దానేమి చేయు?
దీర్పొందె నతడు
నశించు మాటతోనే.

4. వాక్యంబు నిత్యమే గదా
విరోధి వంచలేండు
దైవాత్మ తోడగుం గదా
తా నిన్ను నేడు రేపు
మా కుటుంబము
మా కీర్తి, యాస్తి
ప్రాణంబు పోయినన్
నష్టంబు వానిదే
రాజ్యంబు మాది యౌను.

––మార్టిన్ లూథర్ - అను: ఈ. పాల్

1. Maa kartha gatti durgamu
Ne nammu aayudhambu
Sampraapthamaina kashtamu
La nanniti nananchu
Aa paatha shathru
Ventho krooruDu
Thadaayudhamu
Lupaayashakthulu
Aatham dasamaanundu.

2. Meemo nashinchi podumu
Maa shakthi nishphalambu
Maakai prabhuni shoorudu
Yuddhambu cheesi pettu
Aathandevvandu?
Yesu Kreesthunu
Maa rakshakundu
Marokkam devvadu?
Athande gelchupondu.

3. Prapancha manthatan grammu
Pishaachu leemi cheeyu?
Mammella minga nunnanu
Maakeela bheethi veeyu?
Ee lokaathipu
Dugrudainanu
Daanemi cheeyu?
Deerponde nathadu
Nashinchu maatathone.

4. Vaakyambu nithyame gadaa
Virodhi vanchaleendu
Daivaathma thodagum gadaa
Thaa ninnu nedu reepu
Maa kutumbamu
Maa keerthi, yaasthi
Praanambu poyinan
Nashtambu vaanide
Raajyambu maadi yaunu.

––Maartin Loothar - anu: Ee. Paal

Comments