Mahima Sarvonnathamaina | మహిమ సర్వోన్నతమైన | Andhra Kraistava Keerthanalu
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Song No.28 - దేవుని మహిమ
మహిమసర్వోనృత-మైన దైవమున కి-మ్మహి సమాధానానుగ్రహము
గల్గు న్ర్రభో
॥ మహిమ ॥
1. నిన్ను స్తోత్రించుచు-నిన్ను బూజించుచు- నిన్ను మహిమ
పర్చుచున్నాము లోకప్రభో
॥ మహిమ ॥
2. ప్రభువైన దేవుండా- పరమండలపు రాజా- ప్రబలంబు గల తండ్రి-
పరిశుద్ధంబగు ప్రభో
॥ మహిమ ॥
3. వినయంబుతో నీదు- ఘన మహిమార్థంమై-వందనము లర్పించి
విను-తింతుము సత్ప్రభో
॥ మహిమ ॥
4. జనితైక పుత్రుడగు-ఘన క్రీస్తేసు ప్రభుదే-వుని గొర్రెపిల్ల జన-కుని
కుమారుడ ప్రభో
॥ మహిమ ॥
5. ధర పాపముల మోయు-వరపుణ్య శీలుండా-కరుణించి మా బీద
మొరలాలించుము ప్రభో
॥ మహిమ ॥
6. తండ్రియైన దేవుని-దక్షిణ భాగమున గూ-ర్చుండి యున్నావు కృప-
జూపుమి సత్ప్రభో
॥ మహిమ ॥
7. పరిశుద్ధుడవు నీవే-పరమ ప్రభుడవు నీవే- దురితాత్ములను గావ-
మరణంబైతివి ప్రభో
॥ మహిమ ॥
8. పరమ జనకుని మహిమన్-పరిశుద్ధాత్మైక్యంబై- సరణి మాకై యున్న-
సర్వోన్నత ప్రభో
॥ మహిమ ॥
––భేతాళ జాన్
Mahimasarvonrutha-maina daivamuna ki-mmahi samaadhaanaanugrahamu
Galgu nrrabho
|| Mahima ||
1. Ninnu sthothrinchuchu-ninnu boojinchuchu- ninnu mahima
Parchuchunnaamu lokaprabho
|| Mahima ||
2. Prabhuvaina deevundaa- paramandalapu raajaa- prabalambu gala thandri-
Parishuddhambagu prabho
|| Mahima ||
3. Vinayambutho needu- ghana mahimaarthammai-vandanamu larpinchi
Vinu-thinthumu sathprabho
|| Mahima ||
4. Janithaika puthrudagu-ghana Kreesthesu prabhude-vuni gorrepilla jana-kuni
Kumaaruda prabho
|| Mahima ||
5. Dhara paapamula moyu-varapunya sheelundaa-karuninchi maa beeda
Moralaalinchumu prabho
|| Mahima ||
6. Thandriyaina deevuni-dakshina bhaagamuna goo-rchundi yunnaavu krupa-
Joopumi sathprabho
|| Mahima ||
7. Parishuddhudavu neeve-parama prabhudavu neeve- durithaathmulanu gaava-
Maranambaithivi prabho
|| Mahima ||
8. Parama janakuni mahiman-parishuddhaathmaikyambai- sarani maakai yunna-
Sarvonnatha prabho
|| Mahima ||
––Bethaala Jaan
Comments
Post a Comment