Raatriyaye Nannedabaayaku | రాత్రియయ్యె నన్నెడబాయకు | Andhra Kraistava Keerthanalu

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Song No.56 - Abide with me, fast falls the eventide

1. రాత్రియయ్యె నన్నెడబాయకు
ధాత్రిపై జీకటులు గ్రమ్మెను
సహాయ మేమి లేనివారికి
సహాయుడా, నన్బాసిపోకుమీ.

2. ఏకాలంబైన నీ సహాయము
లేక పిశాచిన్ గెల్వజాలను
నీకంటె దిక్కు నాకు లేదుగా
లోక ప్రకాశుడా నన్బాయకు.

3. నా చెంత నీవు చేరియుండగ
ఏ చింతయైన నన్నుసోకునా
ఏ శత్రువైన నన్ను గెల్చునా
నా శైలమా, నన్బాసి పోకుమా.

4. సమృద్ధుడు సహాయుడాయెను
ఓ మృత్యువా నీ ముల్లు గెల్చునా?
సమాధి నీకు జయ మబ్బునా?
మామధ్యమున్ సర్వేశపాయకు.

5. రేవు నే జేరబోవు వేళలోన్
కావుమయ్యా నీదీప్తి జూపుచున్
చావు జీవంబులందు నైనను
నీవు తోడై నన్బాసి పోకుము.

––హెన్రీ ప్రాన్సిస్ లైట్

1. Raatriyaye nannedabaayaku
Dhaatripai jeekatulu grammenu
Sahaaya memi lenivaariki
Sahaayudaa, nanbaasipokumi.

2. Ekaalambaina nee sahaayamu
Leka pishaachin gelvajaalanu
Neekante dikku naaku ledugaa
Loka prakaashudaa nanbaayaku.

3. Naa chenta neevu cheriyundaga
Ye chintayaina nannusokunaa
Ye shatruvaina nannu gelchunaa
Naa shailamaa, nanbaasi pokumaa.

4. Samruddhudu sahaayudaayenu
O mrutyuvaa nee mullu gelchunaa?
Samaadhi neeku jaya mabbunaa?
Maamadhyamun Sarveshapaayaku.

5. Revu ne jerabovu velalon
Kaavumayyaa needeepti joopuchun
Chaavu jeevambulandu nainanu
Neevu toodai nanbaasi pokumu.

––Henry Francis Light

Comments