Sakala Jagajjaala Karthaa | సకల జగజ్జాల కర్తా | Andhra Kraistava Keerthanalu

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Song No.44 - ఉదయారాధన

సకల జగజ్జాల కర్తా- భక్త- సంఘ హృదయ తాప హర్తా=యక

లంక గుణమణి-నికర పేటీ కృత-ప్రకట లోకచయ-పరమదయాలయ

॥ సకల ॥

1. నాదు నెమ్మది తొలంగించుచుంట బ్రతి-వాదు లీమెయి నెంతో
పాదుకొన్నారు= బాధ లందైనను- సాధులబ్రోవ న-నాది యైనట్టి నీ
వాధారమై యుండ

॥ సకల ॥

2. దిన కృత్యముల గష్ట మంత-చీక-టిని నే నీ కడభక్తి-మనవి జేయ=
వినుచు నా కష్టము-వెస నష్టముగజేయ-ఘనముగ నాయందు
గరుణ జేసితివి

॥ సకల ॥

3. తమ కాపు నన్ను కాపాడగ- నేను-త్తమ నిద్రబొందితి-దనివి
దీరం=కొమ రొప్ప మేల్కొన్న- గూలిన మృత్యు భ-యము బొంద నా
డెంద -మందు నెల్లప్పుడు

॥ సకల ॥

4. రాతిరి సుఖనిద్ర జెందంజేసి-రక్షింప నను నీకె-చెల్లు-ప్రాతః
స్తుతుల్ జేయ = బగలు-జూచు తెల్వి- ఖ్యాతముగా నాకు-
గలుగండేసితివి

॥ సకల ॥

––విలియం డాసన్

Sakala jagajjaala karthaa- bhaktha- sangha hrudaya thaapa harthaa=yaka

Lanka gunamani-nikara petee krutha-prakata lokachaya-paramadayaalaya

|| Sakala ||

1. Naadu nemmadi tholanginchuchu ntabrati-vaadu leemeyi nentho
Paadukonnaaru= baadha landainanu- saadhulabova na-naadi yainatti nee
Vaadharaamai yunda

|| Sakala ||

2. Dina krutyamula gashta mantha-cheeka-tini ne nee kadabhakthi-manavi jeeya=
Vinuchu naa kashtamu-vesa nashtamugajeeya-ghanamuga naayandu
Garuna jeesithivi

|| Sakala ||

3. Thama kaapu nannu kaapaadaga- neenu-ththama nidrabonditi-danivi
Deeran=koma roppa meelkonna- goolina mrutyu bha-yamu bonda naa
Denda -mandu nellapudu

|| Sakala ||

4. Raathiri sukhanidra jendamjeesi-rakshinpa nanu neeke-chellu-praatha
Sthuthul jeeya = bagalu-joochu telvi- khyaathamugaa naaku-
Galugandaesithivi

|| Sakala ||

––Viliyam Daasan

Comments