Deva Samstuti Cheyave | దేవ సంస్తుతి చేయవే | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Song No.12 - యెహోవా దేవుని స్తుతి
దేవ సంస్తుతి చేయవే మనసా- శ్రీ -మంతుడగు యెహోవా సంస్తుతి
చేయవే మనసా= దేవ సంస్తుతి చేయుమా నా-జీవమా యెహోవా దేవుని-
పావన నామము నుతించుమా నా యంతరంగము- లో వసించు నో
సమస్తమా
॥ దేవ ॥
1. జీవమా, యెహోవా నీకు - జేసిన మేళ్లన్ మరవకు = నీవు చేసిన
పాతకంబులను-మన్నించి జబ్బు - లేవియున్ లేకుండజేయును-ఆ
కారణముచే
॥ దేవ ॥
2. చావు గోతి నుండి నిన్ను-లేవనెత్తి దయను గృపను= జీవ కిరీటముగ
వేయును- నీ శిరసుమీద జీవ కిరీటముగ వేయును- ఆ కారణముచే
॥ దేవ ॥
3. యౌవనంబు పక్షిరాజు- యౌవనంబు వలెనె క్రొత్త= యౌవనంబై
వెలయునట్లు -మేలిచ్చి నీదు భావమును సంతుష్టిపరచునుగా- ఆ
కారణముచే
॥ దేవ ॥
4. ప్రభువు నీతి పనులు చేయున్- బాధితులకు న్యాయ మిచ్చున్ =
విభుడు మార్గము తెలిపె, మోషేకు-దన కార్యములను-విప్పె
నిశ్రాయేలు జనమునకు - ఆ కారణముచే
॥ దేవ ॥
5. అత్యదిక ప్రేమ స్వరూపి-యైన దీర్ఘ శాంతపరుడు=నిత్యము
వ్యాజ్యంబు చేయడు- ఆ కృపోన్నతుడు- నీపై నెపుడు కోప
ముంచడు- ఆ కారణముచే
॥ దేవ ॥
6. పామరుల మని ప్రత్యపకార-ప్రతి ఫలంబుల్ పంపలేదు= భూమి
కన్న నాకసంబున్న-యెత్తుండు దైవ- ప్రేమ భక్తి జనుల యందున- ఆ
కారణముచే
॥ దేవ ॥
7. పడమటికి దూర్పెంత యెడమో- పాపములకును మనకు నంత=
యెడము కలుగజేసి యున్నాడు- మన పాపములను- ఎడముగానే
చేసియున్నాడు - ఆ కారణముచే
॥ దేవ ॥
8. కొడుకులపై దండ్రి జాలి-పడు విధముగా భక్తి పరుల= యెడల
జాలిపడును దేవుండు= తన భక్తిపరుల-యెడల జాలిపడునుదేవుండు-
ఆ కారణముచే
॥ దేవ ॥
9. మనము నిర్మితమయిన రీతి- తనకుదెలిసియున్న సంగతి = మనము మంటివార
మంచును-జ్ఞాపకముచేసి- కొనుచు కరుణ జూపుచుండును
ఆ కారణముచే
॥ దేవ ॥
10. పూసి గాలి వీవ నెగిరి- పోయి బసను దెలియని వాన= వాస పుష్పము
వలెను నరుడుండు- నరు నాయువు తృణ-ప్రాయము మన దేవ కృప
మెండు- ఆ కారణముచే
॥ దేవ ॥
11. పరమ దేవ నిబంధ నాజ్ఞల్ -భక్తితో గైకొను జనులకు= నిరతమును
గృప నిలిచి యుండును- యెహోవా నీతి- తరముల పిల్లలకు నుండును-
ఆ కారణముచే
॥ దేవ ॥
––ముంగమూరి దేవదాసు
Deva samstuti cheyave manasaa- Sree -mantudagu Yehovaa samstuti
cheyave manasaa= Deva samstuti cheyumaa naa-jeevamaa Yehovaa devuni-
paavana naamamu nutinchumaa naa yantaramgamu- lo vasinchu no
samastamaa
|| Deva ||
1. Jeevamaa, Yehovaa neeku - jesina mellanu maravaku = neevu chesina
paatakambulanu-manninchi jabbu - leviyun lekunḍajeyunu-aa
kaaranamuche
|| Deva ||
2. Chaavu gothi nundi ninnu-levanetti dayanu gripanu= jeeva kireetamuga
veyunu- nee shirasumeeda jeeva kireetamuga veyunu- aa kaaranamuche
|| Deva ||
3. Youvanambu pakshiraaju- youvanambu valene krottha= youvanambai
velayunatlu -melichchi needu bhaavamunu santushtiparachunugaa- aa
kaaranamuche
|| Deva ||
4. Prabhuvu neeti panulu cheyun- baadhitulaku nyaaya michchun =
vibhudu maargamu telipe, Mosheku-dana kaaryamulanu-vippe
nishraayelu janamunaku - aa kaaranamuche
|| Deva ||
5. Atyadhika prema swaroopi-yaina deergha shaantaparudu=nityamu
vyaajyambhu cheyadu- aa kriponnatudu- neepai nepudu kopa
munchadu- aa kaaranamuche
|| Deva ||
6. Paamarula mani pratyapakara-prati phalambul pampaledu= bhoomi
kanna naakasambunna-yettundu daiva- prema bhakti janula yanduna- aa
kaaranamuche
|| Deva ||
7. Padamatiki doorpenta yedamo- paapamulakunu manaku nanta=
yedamu kalugajesiyunnaadu- mana paapamulanu- edamugaane
chesiyunnaadu - aa kaaranamuche
|| Deva ||
8. Kodukulapai dandri jaali-padu vidhamuga bhakti parula= yedala
jaalipadunu devundu= tana bhaktiparula-yedala jaalipadunudevundu-
aa kaaranamuche
|| Deva ||
9. Manamu nirmitamayina reeti- tanakudelisiyunna sangati = manamu mantivaara
manchunu-jnaapakamuchesi- konuchu karuna joopuchundunu
aa kaaranamuche
|| Deva ||
10. Poosi gaali veeva negiri- poyi basanu deliyani vaana= vaasa pushpamu
valenu narudundu- naru naayuvu truna-praayamu mana deva krupa
mendu- aa kaaranamuche
|| Deva ||
11. Parama deva nibandha naajnal -bhaktito gaikonu janulaku= niratamunu
grupa nilichi yundunu- Yehovaa neeti- taramula pillalaku nundunu-
aa kaaranamuche
|| Deva ||
––Mungamoori Devadaasu
Comments
Post a Comment