ఇది ఆశ్చర్యమే | Idi Ashcharyame | Christmas Song Lyrics Telugu | Jesus Song Lyrics | Download

ఇది ఆశ్చర్యమే,Idi Ashcharyame Lyrics, Telugu Christmas Song Lyrics, Idi Ashcharyame Jesus Song, Christmas Devotional Songs Telugu, Idi Ashcharyame Christmas Song Download, Telugu Christian Songs 2024, Jesus Birth Song Telugu, New Telugu Christmas Worship Songs, Idi Ashcharyame Song Meaning, Jesus Christmas Song Telugu, Telugu Christmas Music 2024, Telugu Christian Devotional Lyrics, Idi Ashcharyame Song by Jesus Worship, Idi Ashcharyame Latest Christmas Song Telugu, Telugu Christmas Celebration Songs

ఇది ఆశ్చర్యమే

కాలం సంపూర్ణమైనపుడు యేసయ్య భువికొచ్చెను

తానే మనలను ప్రేమించి రక్షకుడై జన్మించెను

రాజాధి రాజైనను ఇలలో దాసునిగా జీవించెను

సత్యమును స్థాపించుటకు దైవసుతునిగా ఉదయించెను

"ఇది ఆశ్చర్యమే - ఇది అద్భుతమే"

"ఆహా ఆనందమే - హాపీ హ్యాపీ క్రిస్మస్

"ఇది ఆశ్చర్యమే - ఇది అద్భుతమే"...

"ఆహా ఆనందమే - మెర్రి మెర్రి క్రిస్మస్


1. జ్ఞానులు సాగిలపడిరి - మ్రొక్కిరి ప్రభువుల ప్రభువును

అటువలె విశ్వసించుచు - పూజించెదం ప్రభు యేసును

సర్వోన్నతమైన స్థలములలోన - దేవదేవునికే మహిమ

తనకిష్టులైన ప్రజలందరికి - భూమి మీద సమాధానము


2. గొల్లలు దేవుని మాటను - గ్రహియించిరి దూత చెప్పగా

విధేయతే మనకు ముఖ్యము - గ్రహియించుము దేవుని చిత్తము

వాక్యమైన దేవుడు శరీరధారిగా - మన మధ్యలో నివసించెను

నమ్మి విశ్వసించుము కలుగు నిత్యజీవము - యేసు క్రీస్తే లోకరక్షకుడు