మనసా మరువకు యేసుని రాకడ – పూర్తి సాహిత్యం | THANDRI SANNIDHI MINISTRIES

మనసా మరువకు యేసుని రాకడ Telugu Christian song lyrics by THANDRI SANNIDHI MINISTRIES about second coming of Jesus

మనసా మరువకు యేసుని రాకడ?

మనసా మరువకు యేసుని రాకడ?
ఉండదు మనుగడ (2)
సిద్ధపాటు విస్మయించకు
సిగ్గుపడే రోజు చూడకు

చరణం 1 :

రాజ్యముపై రాజ్యము లేచును కాయం
అక్రమాలు విస్తరించి ప్రేమలు మాయం (2)
యేసు వార్త దిగంతాలు చేరును సత్యం (2)
విశ్వసించు వారంతా బ్రతుకును నిత్యం (2)

చరణం 2 :

చిన్న కొమ్ము రాజై ఏలును లోకం
వాని కాళ్ళు మొక్కి నోళ్లు పొందును భోగం (2)
నజరేయుని సంఘం పై చూపును ద్వేషం (2)
పరిశుద్ధుల గెలుచునట్లు చేయును యుద్ధం (2)

చరణం 3 :

ఎదురించిన సంఘం పై దుష్టని కోపం
తన వారిని రక్షించును దేవుని హస్తం (2)
శ్రమల చేత భక్తులవును శుద్ధ సువర్ణం (2)
ఆ మీదట ఎత్త బడును యేసుని సంఘం (2)