నా ప్రాణ ప్రియుడా మహనీయుడా Telugu Christian Song Lyrics | Worship Song | Yesu Bhakti Geetham

నా ప్రాణ ప్రియుడా మహనీయుడా – Telugu Christian Worship Song Lyrics

నా ప్రాణ ప్రియుడా మహనీయుడా Telugu Christian worship song lyrics devotional poster image

నా ప్రాణ ప్రియుడా మహనీయుడా

నా ప్రాణ ప్రియుడా మహనీయుడా
నా యేసయ్యా నీతో ఉంటానయ్యా

నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా
నీతోనే ఉంటానేసయ్యా నిను విడువలేనయ్యా
|| నా ప్రాణ ||

చరణం 1:

ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా (2)
శ్రమలు శోధించినా నాతో నీవున్న ధైర్యమే కలిగేనా (2)
ప్రాణం పోయేంతవరకు నీతోనేనయ్యా
తుదిశ్వాస వరకు నీతో ఉంటానయ్యా (2)
|| నీవే కావలేసయ్యా ||

చరణం 2:

కన్నీరే సముద్రమైపోయినా తుఫాను అలలే చెలరేగినా (2)
నే నలిగిపోయినా నాతో నీవున్న ధైర్యమే కలిగేనా (2)
ప్రాణం పోయేంతవరకు నీతోనేనయ్యా
తుదిశ్వాస వరకు నీతో ఉంటానయ్యా (2)
|| నీవే కావలేసయ్యా ||

Comments