భాసిల్లెను సిలువలో పాపక్షమా Lyrics – Bhasillenu Siluvalo Paapakshama Telugu Christian Song

భాసిల్లెను సిలువలో పాపక్షమా Telugu Christian Song Lyrics | Bhasillenu Siluvalo Paapakshama

భాసిల్లెను సిలువలో పాపక్షమా తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం Lyrics

భాసిల్లెను సిలువలో పాపక్షమా
యేసు ప్రభూ నీ దివ్య క్షమా

కలువరిలో నా పాపము పొంచి
సిలువకు నిన్ను యాహుతి చేసి
కలుషహరా కరుణించితివి (2)

దోషము చేసినది నేనెకదా
మోసముతో బ్రతికిన నేనెకదా
మోసితివా నా శాపభారం (2)

పాపము చేసి గడించితి మరణం
శాపమెగా నేనార్జించినది
కాపరివై నను బ్రోచితివి (2)

నీ మరణపు వేదన వృధా గాదు
నా మది నీ వేదనలో మునిగెను
క్షేమము కలిగెను హృదయములో (2)

ఎందులకో నాపై ఈ ప్రేమ
అందదయ్యా స్వామీ నా మదికి
అందులకే భయమొందితిని (2)

నమ్మిన వారిని కాదన వనియు
నెమ్మది నొసగెడి నా ప్రభుడవని
నమ్మితి నీ పాదంబులను (2)