సఖుడా దివ్య సఖుడా Lyrics – Sakhuda Divya Sakhuda Telugu Christian Song

సఖుడా దివ్య సఖుడా Telugu Christian Worship Song Lyrics | Sakhuda Divya Sakhuda Song Lyrics

సఖుడా దివ్య సఖుడా తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం Lyrics

సఖుడా - దివ్య సఖుడా
ప్రియుడా - ప్రాణ ప్రియుడా
నీతో అనుబంధము కాదే ఈ నాటిది
ఏనాటికీ వీడిపోదు - విభుడా యేసయ్యా
ఇన్నినాళ్ల తీపి జ్ఞాపిక - పలికే గీతిక

మౌనరాగమే - మధురగానమై
మరుపురానిదై - మదిలో నిలిచెగా
ఊహించని శోధనలే - శృతిలయలు నేర్పినాయి
పలుశ్రమలు నడిపినాయి నీ ప్రేమ శిఖరానికి
ఏకాంత వేళలో - ఏ కాంతి లేకున్ననూ
నా పాదములు జ్ఞారక - కాపాడే యేసయ్యా

సద్గుణ రాశివి నీవేనని
స్తుతి మహిమలు చెల్లించెదను
నిత్యము నిను కీర్తించెదను

నిండు మనస్సులో - ప్రేమ దీపమై
మారుమనస్సుకై - సత్యమార్గమై
పలికే ప్రేమనీవై - నీవు నాతో నున్నావు
నా హృదయసీమ నేలే - మహరాజుగా నిలిచావు
నీవు నా ముందుగా - నడిచే కాపరిగా
నా చేయి వీడకా - నడిపించే యేసయ్యా

సద్గుణ రాశివి నీవేనని
స్తుతి మహిమలు చెల్లించెదను
నిత్యము నిను కీర్తించెదను

రమ్యమైనది - భాగ్యమైనది
నిత్యమైనది - సరిపోల్చలేనిది
నీ మహిమ రాజ్యమందు - సీయోను శిఖరమందు
నే పరవశించి పాడే గొప్ప భాగ్యమిచ్చినావు
నూతనమైనది - ఎవరూ పాడలేని
శ్రేష్ఠమైన గీతం - నే పాడెద యేసయ్యా

సద్గుణ రాశివి నీవేనని
స్తుతి మహిమలు చెల్లించెదను
నిత్యము నిను కీర్తించెదను