మహాఘనుడా యెహోవా (Mahaghanuda Yehova) Lyrics – Telugu Christian Worship Song
మహాఘనుడా యెహోవా
మనోహరుడా యేసయ్యా
ప్రభుప్రేమ నాలో నింపుటకే
దిగివచ్చినావు మహిమాత్ముడా
త్రిత్వమై జీవించువాడవు
కీర్తించి మహిమపరతును
స్తుతించి ఆరాధింతును
నీకే నా ఆరాధన – హల్లేలూయా
ఏల్ ఎలోహీం నీవే – ఎల్షద్దాయ్ దేవుడవు
ఎబినేజరువు నీవే స్తుతి ఘనత మహిమ నీకే
నవనూతనమైన కార్యాలు చేసేది నీవేగా – నీవేగా
అత్యున్నతమైన స్థలములపై నడిపేది నీవేగా – నీవేగా
విధినే చేధించి నీవు భువినే వెలిగించగా
స్తుతినే నానోట పలికించి బహుగా దీవించగా
గళమెత్తి కీర్తింతును
కొండైనా లోయైనా సమభూమి చేసేది నీవేగా – నీవేగా
ఇబ్బంది కొలిమిలో నిర్మలము చేసినది నీవేగా – నీ వాక్కేగా
శ్రమలే నను వేధించిననూ కలతలే బాధించినా
కృపయే క్షణమైనా విడువక మహిమకే చేర్పించునని
నిరీక్షించి కీర్తింతును
ఐశ్వర్య ఘనతలు దయచేయువాడవు నీవేగా – నీవేగా
నీ మందిరములోని మేలులతో నింపేది నీవేగా – నా దేవా
నీవే భూమ్యాకాశములు పట్టజాలని దేవుడవు
నీవే సమాధానప్రభువై ఏలే మహరాజువు
నీ కీర్తి కీర్తింతును
