స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ (Stuthi Keerthaneeyuda Ghanamaina Nee Prema) Lyrics – Telugu Christian Worship Song
స్తుతి కీర్తనీయుడా - ఘనమైన నీ ప్రేమ
నా హృదయవీణపై శృతి చేసి పాడనా
నా యేసురాజా - అనురాగ బంధమా
నను విడువలేని ఆత్మానుబంధమా
నా ప్రియ నేస్తమా - నా ప్రాణ బంధమా
నీ ప్రేమ కౌగిలిలో సన్నాదరించుమా
నీ సిలువ త్యాగం నేనెలా మరచిపోదును
ఇలలోన నీకై సాక్షిగా జీవింతును
నా నీతిసూర్యుడా - తేజో ప్రకాశమా
నీ వెలుగు జాడలలో నిను వెంబడించగా
నీ జీవ వాక్యం నింపెనే నాలో ధైర్యము
ప్రాణాత్మదేహం సర్వదా నీకే అంకితం
మహిమ సింహాసనం - నే చేరాలనే
నే కన్న కలలన్నీ నిజమైన వేళలో
నా జయము నీవై నిలిచినా శ్రేష్ఠ తరుణాన
నీలోనే లీనమై పోదునే నే నిరతము
