భూమ్యాకాశములను సృజియించిన దేవా లిరిక్స్ | Bhoomyakashamulanu Srujiyinchina Deva Telugu Christian Song Lyrics
భూమ్యాకాశములను సృజియించిన దేవా | తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం లిరిక్స్
"భూమ్యాకాశములను సృజియించిన దేవా" ఒక హృదయాన్ని కదిలించే తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం. ఈ పాటలో సృష్టికర్త దేవుని మహిమ, ఆయన పరిశుద్ధ సన్నిధి, సిలువ ప్రేమ మరియు విరిగిన హృదయంతో చేసే నిజమైన ఆరాధన ఎంతో అందంగా వ్యక్తమవుతాయి. ఈ పేజీలో పూర్తి తెలుగు లిరిక్స్ మరియు అధికారిక వీడియోను చూడవచ్చు.
🎵 పూర్తి లిరిక్స్
పల్లవి
భూమ్యాకాశములను సృజియించిన దేవానీ సన్నిధిలోనే ప్రవేశించెదను
నీ పరిశుద్ధతను ప్రకాశించుటకు
నీ పరిపూర్ణతలో నన్ను నడిపించుము
మహిమా నీకే… ఘనతా నీకే…
ప్రతి దినం నా ఆరాధన నీకే
మహిమా నీకే… ఘనతా నీకే…
నిరంతరం ఈ స్తోత్రార్పణ నీకే
యేసయ్యా.. నీకే వందనం
చరణం 1
మట్టి ముద్దనైన నన్నుమనిషిగా రూపించావు
వట్టి వాడనైన గాని
మహిమతో నను నింపావు
నీ కౌగిలిలో నను హత్తుకొని
అర చేతులలో నను చెక్కుకొని
నీ సన్నిధి కాంతిని
నాపైనే ఉదయింపజేసావు
ఏమివ్వగలను నేను నీ ప్రేమకై
పగిలిన హృదయముతో ఆరాధింతును
చరణం 2
ఘోర పాపినైన నన్నుఎంతగా ప్రేమించావు
సిలువ పైన ప్రాణమిచ్చి
వింతగా నను మార్చావు
నా మనో నేత్రమును వెలిగించి
నా హృదయ కాఠిన్యమును మార్చి
అర్హతే లేని బలహీనుడనే
ఎన్నుకున్నావు
ఏమిచ్చి నీ ఋణమును నే తీర్తును
విరిగి నలిగిన మనస్సుతో ఆరాధింతును
మహిమా నీకే… ఘనతా నీకే…
ప్రతి దినం నా ఆరాధన నీకే
మహిమా నీకే… ఘనతా నీకే…
నిరంతరం ఈ స్తోత్రార్పణ నీకే
SEO Keywords
భూమ్యాకాశములను సృజియించిన దేవా లిరిక్స్, Bhoomyakashamulanu Srujiyinchina Deva Lyrics, Telugu Christian Song Lyrics, Telugu Christian Worship Songs, Christian Devotional Songs Telugu, Jesus Songs Telugu, Telugu Gospel Songs, Christian Praise and Worship, Worship Lyrics Telugu, Christian Music Telugu, Gospel Worship Songs

Comments
Post a Comment