Nee Valane Lyrics | నీ వలనే | Telugu Christian Song

Nee Valane Lyrics | నీ వలనే | Telugu Christian Song

నీ వలనే

నీ వలనే దొరుకును సహాయము
నీ వలనే కలుగును జీవము
నీ వలనే దొరుకును ఆనందము
నీ వలనే కలుగును సమాధానము

కేవలం నీ వలనే యేసయ్య
కేవలం నీ కృప మాత్రమేనయ్యా "2"

గ్రుడ్డివారికి చూపును ఇచ్చితివి
చెవిటి వారికి వినికిడి నిచ్చితివి
మూగవారికి మాటలు ఇచ్చితివి
మరణించిన వారిని తిరిగి లేపితివి

నీ మాటలే జీవము యేసయ్య
నీవున్న చోటే అభిషేకం యేసయ్య
నీ మాటల్లోనే స్వస్థత యేసయ్య
నీ నామములోనే విడుదల యేసయ్య

త్రోవ విడిచి నీకు దూరముగా జీవించితిని
గమ్యము తెలియక తిరుగుచుంటిని
బలహీనుడనై నిరాశ్రయుడనై బ్రతుకూచుంటిని

నీ చిత్తము తెలియక నా జ్ఞానము నమ్మితి
అంధకారంలో నా వెలుగే నీవయ్య
బలహీనతలో నా బలమే నీవయ్యా
నా నిరీక్షణ ఆధారము నీవయ్య
నమ్మదగిన నా దేవుడవు నీవయ్య

Comments