నీలాగా నన్ను ప్రేమించేది ఎవరు లిరిక్స్ | Neelaga Nannu Preminchedi Evaru Telugu Christian Song Lyrics
నీలాగా నన్ను ప్రేమించేది ఎవరు | తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం లిరిక్స్
నీలాగా నన్ను ప్రేమించేది ఎవరు అనేది యేసుక్రీస్తు ప్రేమ, సిలువ త్యాగం, రక్షణ, సమర్పణ మరియు ఆరాధన గురించి తెలియజేసే హృదయాన్ని హత్తుకునే తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం. ఈ పాటలో దేవుని అపారమైన ప్రేమను, ఆయన రక్త బలిదానాన్ని మరియు విశ్వాసి జీవితంలో క్రీస్తుకు సంపూర్ణ అంకితభావాన్ని ఎంతో అందంగా వర్ణించారు.
🎵 పూర్తి లిరిక్స్
▶ పల్లవి
నీలాగా నన్ను ప్రేమించేది ఎవరునీలాగా నన్ను కాచేది ఎవరు (2)
నీలాంటి దైవం లేరయ్యా
నీకు సరిసాటి లేరు యేసయ్య (2)
నీ రక్తము కార్చి
నా ప్రాణము పెట్టి
సురక్షితముగా నన్ను దాచిన యేసయ్య (2)
యేసయ్యా నా యేసయ్యా
నా కొరకై నీ ప్రాణం పెట్టితివే
యేసయ్యా నా యేసయ్యా
ఇక నా కొరకే జీవించుదునే (2)
▶ చరణం 1
నాన్నా నీ త్యాగము నే మరువలెనయానాన్నా నీ ప్రేమను వర్ణించలేనయ్య (2)
బదులుగ నీకు ఏమివ్వగలను
ప్రాణాత్మ దేహం సమర్పింతును (2)
నీ రక్తము కార్చి
నా ప్రాణము పెట్టి
సురక్షితముగా నన్ను దాచిన యేసయ్య (2)
యేసయ్యా నా యేసయ్యా
నా కొరకై నీ ప్రాణం పెట్టితివే
యేసయ్యా నా యేసయ్యా
ఇక నా కొరకే జీవించుదునే
ఓ ఓ ఓ..
▶ చరణం 2
కొలతలేని ఆత్మతో నను అభిషేకించయాహృదయానుసారీ అని నన్ను పిలువయా (2)
అతిపరిశుద్ధ స్థలములోనా
నిత్యత్వమూ నిన్నే ఆరాధింతును (2)
నీ రక్తము కార్చి
నా ప్రాణము పెట్టి
సురక్షితముగా నన్ను దాచిన యేసయ్య (2)
యేసయ్యా నా యేసయ్యా
నా కొరకై నీ ప్రాణం పెట్టితివే
యేసయ్యా నా యేసయ్యా
ఇక నా కొరకే జీవించుదునే (2)

Comments
Post a Comment