Aakaashambu Bhumiyu | ఆకాశంబు భూమియు | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Song No.52 - సాయంతన ప్రార్థన

॥ ఆకాశంబు ॥

1. ఆకాశంబు భూమియు- అంతట చీకటి యాయెను=ప్రాకెడు చీకటి
సమయమున ప్రార్థన చేతుము మా దేవా

॥ ఆకాశంబు ॥

2. చక్కని చుక్కలు మింటను- చక్కగ మమ్మును జూడగ= ప్రక్కకురావె
వేగముగా - ప్రభువా గావుము నీ నీడన్

॥ ఆకాశంబు ॥

3. చిన్న చిన్న పాపలు- చిన్న చిన్న పూవులు- ఎన్నో ఎన్నో జీవులు-నిన్నే
గొలిచి నిద్రించున్

॥ ఆకాశంబు ॥

4. చిన్ని చిన్ని పాపలు- చిన్ని చిన్ని పడకలలో = చిన్ని కన్నులు
మూయంగా -చెన్నుగ యేసుగావుమా

॥ ఆకాశంబు ॥

5. నేలను బోయెడి బండ్లలో -నీటను బోయెడి ఓడలలో గాలి
విమానంబుల లోన- కావుము దేవ ప్రయాణికులన్

॥ ఆకాశంబు ॥

6. రాత్రిలో నీదు దూతలు రమ్యంబైన రెక్కలతో = చిత్రంబుగ
మమ్మును గ్రమ్మన్- నిద్రించెదము మా దేవా

॥ ఆకాశంబు ॥

7. తెల్లవారుజామున- తెలివొంది మేమందరము = మెల్లగలేచి
నుతియింపన్- మేల్కొల్పుము మా ప్రియతండ్రి

॥ ఆకాశంబు ॥

8. జనక తనయా శుద్ధాత్మా- ఘనత మహిమ స్తోత్రములు=
అనిశము నీకే చెల్లునుగా- అనిశము చెల్లును నీకామెన

॥ ఆకాశంబు ॥

––ఏ.చార్లెస్ క్సింగర్

|| Aakaashambu ||

1. Aakaashambu bhumiyu- antata cheekati yaayenu= Praak edu cheekati
samayamuna praarthana chetumu maa Devaa

|| Aakaashambu ||

2. Chakkani chukkalu mintanu- chakkaga mammunu joodaga= Prakkaku raave
vegamuga- Prabhuvaa gaavumu nee needan

|| Aakaashambu ||

3. Chinna chinna paapalu- chinna chinna poovulu- enno enno jeevulu- ninne
golichi nidrinchun

|| Aakaashambu ||

4. Chinni chinni paapalu- chinni chinni padakalalo= Chinni kannulu
mooyanga- chennuga Yesugaavumaa

|| Aakaashambu ||

5. Nelanu boyedi bandlalo- neetanu boyedi odalalo gaali
vimaanambula lona- kaavumu Deva prayaanikulan

|| Aakaashambu ||

6. Raatrilo needu dootalu ramyambaina rekkalato= chitrambuga
mammunu gramm an- nidrinchedamu maa Devaa

|| Aakaashambu ||

7. Tellavaar ujaamuna- telivondi memandar amu= Mellaga lechi
nutiyimpan- melkolpumu maa priyatandri

|| Aakaashambu ||

8. Janaka tanayaa Shuddhaatmaa- ghanata mahima stotramulu=
Anishamu neeke chellunugaa- anishamu chellunu neekaamena

|| Aakaashambu ||

––E. Charles Ksinger

Comments