Anni Kaalambula Nunna | అన్ని కాలంబుల నున్న | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Song No.1 - సృష్టికర్త ప్రస్తుతి

అన్ని కాలంబుల-నున్న యెహోవా ని -న్నెన్నదరంబ యో-కన్న తండ్రి=

వన్నె కెక్కిన మోక్ష-వాసాళి సన్నుతు-లున్నతమైన యుండ - మున్నె నీకు

॥ నన్ని ॥

1. నిన్ను బ్రకటనసేయ-నిఖిల లోకములను -బన్నుగజేసిన బలుడ
వీవె= ఉన్న లోకంబుల- నుడుగక కరుణా సం- పన్నతతో నేలు-
ప్రభుడ వీవె= అన్ని జీవుల నెఱిగి - యాహార మిచ్చుచు నున్న సర్వజ్ఞుం-
డవు నీవే-ఎన్న శక్యము గాక ఉన్న లక్షణముల-సన్ను తించుటకు
నే- జాలుదునా

॥ నన్ని ॥

2. పుట్టింప నీవంచు-బోషింప నీవంచు - గిట్టింప నీవంచు-గీర్తింతును =
వట్టి పనికి మాలి-నట్టి మానవుల చేపట్టి రక్షింప బా-ధ్యుండవంచు=
దట్టమైన కృపను- దరిజేర్చ నాకిచ్చి -పట్టయి నిలచియుండు -
ప్రభుడవంచు= గట్టడచే గడ- ముట్టుదనుక నా -పట్టుకొలది నిన్ను
- బ్రస్తుతించు

॥ నన్ని ॥

3. కారుణ్యనిధి వీవు- కఠినాత్ముడను నేను- భూరి శుద్ధుడ వీవు-
పాపి నేను= సార భాగ్యుడ వీవు జగతిలో నాకన్న- దారిద్రుడే లేడు-
తరచి చూడ= సార సద్గుణబుల - సంపన్నుడవు నీవు- ఘోర దుర్గుణ
సం-చారి నేను = ఏ రీతి స్తుతియింతు- నే రీతి సేవింతు- నేర మెన్నక
ప్రోవ - నెర నమ్మితి

॥ నన్ని ॥

––భేతాళ జాన్

Anni kaalambula-nunna Yehovaa ni -nnennadaramba yo-kanna thandri=

Vanne kekkina moksha-vaasaali sannuthu-lunnathamaina yunda - munne neeku

|| Nanni ||

1. Ninnu brakatanaseeya-nikhila lokamulanu -bannugajeesina baluda
Veeve= unna lokambula- nudugaka karunaa sam- pannathatho nelu-
Prabhuda veeve= anni jeevula nerigi - yaahaara michchuchu nunna sarvagjnum-
Davu neeve-enna shakyamu gaaka unna lakshanamula-sannu thinchutaku
Ne- jaaludunaa

|| Nanni ||

2. Puttimpa neevanchu-boshimpa neevanchu - gittimpa neevanchu-geerthinthunu =
Vatti paniki maali-natti maanavula cheepatti rakshimpa baa-dhyundavanchu=
Dattamaina krupanu- darijeercha naakichchi -pattayi nilachiyundu -
Prabhudavanchu= gattadachee gada- muttudanuka naa -pattukoladi ninnu
- Brasthuthinchu

|| Nanni ||

3. Kaarunyanidhi veevu- kathinaathmudanu nenu- bhoori shuddhuda veevu-
Paapi nenu= saara bhaagyuda veevu jagathilo naakanna- daaridrude leedu-
Tarachi chooda= saara sadgunabula - sampannudavu neevu- ghora durguna
Sam-chaari nenu = e reethi sthuthiyinthu- ne reethi seevinthu- nera mennaka
Prova - nera nammithi

|| Nanni ||

––Bethaala Jaan

Comments