Chooda Goreda | చూడ గోరెద | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Song No.19 - దేవుని మందిరావరణములు

చూడ గోరెద -నీ-మంది రావరణములను చూడగోరెద = చూడ

నాకు నాశ గలదు - సుందరావరణము లవి = చూడ నాదు ప్రాణమెంతో-
సొమ్మసిల్లుచున్నదహా

॥ జూడ ॥

1. నీదు నీవాసములు జూడ - నెంతో రమ్యమైతనర =నాదు హృదయము
నకు నా-నంద మిచ్చు నిపుడు నెపుడు

॥ జూడ ॥

2. జీవము గల ప్రభుని చూడ- జీవి నాలో కేక వేసె= కోవెలలకు దొఱికె
గూటి–తావు నీ మందిరమున

॥ జూడ ॥

3. పిచ్చుకలకు దొఱికె స్థలము -ముచ్చట బలిపీఠ మెదుట = పెట్టు
కుతూహలముతోను- పిల్లల నవి మందిరమున

॥ జూడ ॥

4. నీదు మందిరంబులోన - నిత్యవాసులైన వారు= నిక్కముగను
ధన్యులగుచు-నిన్ను సన్నుతింతు రహా

॥ జూడ ॥

5. ప్రభుని వలన బలమునొందు- ప్రజలు ధన్యులగుదు రిల= ప్రాణ
ప్రియము యాత్ర సేయు- ప్రజల మార్గ మమర ధరను

॥ జూడ ॥

6. నీదు యావరణములలో- నేను నొక్క దినము గడుప-నెంతో విలువ
గలుగు నాకు-వేయినాళ్ల బ్రతుకు కన్న

॥ జూడ ॥

7. కాన రండు మనము నిపుడే మనము లలర ప్రభుని జూడ= మందిర
మునకేగి నిండు-మనశ్శాంతి బొంది బ్రతుక

॥ జూడ ॥

––ఎం.జె. రామాంజులు

Chooda goredha -nee-mandi raavaranamulanu choodagoreda = chooda

naaku naasha galadu - sundaraavaranamu lavi = chooda naadu praanamentho-
sommasilluchunnadahaa

|| Jooda ||

1. Needu neevaasamulu jooda - nento ramyamaitanara =naadu hrudayamu
naku naa-nanda michchu nipudu nepudu

|| Jooda ||

2. Jeevamu gala prabhuni chooda- jeevi naalo keka vese= kovelalaku dorike
gooti–taavu nee mandiramuna

|| Jooda ||

3. Pichchukalaku dorike sthalamu -muchchata balipeetha meduta = pettu
kutoohalamutonU- pillala navi mandiramuna

|| Jooda ||

4. Needu mandirambulona - nityavaasulaina vaaru= nikkamuganu
dhanyulaguchu-ninnu sannutintu rahaa

|| Jooda ||

5. Prabhuni valana balamunondu- prajalu dhanyulagudu ril= praana
priyamu yaatra seyu- prajala maarga mamara dharanu

|| Jooda ||

6. Needu yaavaranamulalo- nenu nokka dinamu gadupa-nento viluva
galugu naaku-veyinaalla bratuku kanna

|| Jooda ||

7. Kaana randu manamu nipude manamu lalara prabhuni jooda= mandira
munakegi nindu-manashshaanti bondi bratuka

|| Jooda ||

––M.Je. RaamaanJulu

Comments