Deevaa Divyaanantha Prabhaava | దేవా దివ్యానంత ప్రభావ | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Song No.4 - దేవుని యనూనత్వములు

దేవా దివ్యానంత ప్ర-భావ- మాంపాహి ఘన యెహోవా= స్థావర

జంగమ -సహిత నిఖిల జగ-దావన పావన-భావ నిరంతర

॥ దేవా ॥

1. సార-కారుణ్య పారా-వారా - సర్వజ్ఞ నిర్వి-కారా- యేసు నామావ-
తారా- దీన జనోప-కారా=ఘోరమైన సం-సారాటవిబడి- దారిగనని
నను జేరబిలిచితివి

॥ దేవా ॥

2. అక్షీ-ణ విభవానంద - మోక్ష- రాజ్య మహిమా ధ్యక్ష సంతత సుజన-రక్షా-
కపట దుర్మనుజ-శిక్షా= పక్ష విపక్ష వి-లక్షణ రహిత క-టాక్షము నాదెస-
దీక్షను నిలుపవె

॥ దేవా ॥

3. సుంద-రాశ్చర్య గుణ-బృందా బంధుర నిత్యా-నందా-సాధు సజ్జన-
వంద్యా-ఖండిత కలుష-బృందా= మంద మతిని నా-డెందము కడు
దెలి వొంద జేసి నీ యందు నిలుపగదె

॥ దేవా ॥

4. నీవు - నన్ను సృష్టించి -నావు - నాగురురాద్దేవుడవు-క్రీస్తు యేసుని-
చావు - వలన నన్మనిపి-నావు= పావన జనక సు-తాత్మలతోడను- గేవల
మొక్కడ-వై వెలిగెడి ప్రభు

॥ దేవా ॥

5. ప్రేమ స్వరూప నిత్య- క్షేమ-పతిత పావన నామ -దాస లోకాబ్డి
సోమ-సర్వేశ పరమ-ధామ= నేమ మెఱుంగని- నీచుడ నధముడ-
నోమహాత్మ దయ-తో మన్నింపవె

॥ దేవా ॥

––పురుషోత్తము చౌధరి

Deevaa divyaanantha pra-bhaava- maampaahi ghana Yehovaa= sthaavara

Jangama -sahitha nikhila jaga-daavana paavana-bhaava niranthara

|| Deevaa ||

1. Saara-kaarunya paaraa-vaaraa - sarvagjna nirvi-kaaraa- Yesu naamaava-
Thaaraa- deena janopa-kaaraa=ghoramaina sam-saaraatavibadi- daariganani
Nanu jeerabilichithivi

|| Deevaa ||

2. Akshee-na vibhavaananda - moksha- raajya mahimaa dhyaksha santhatha sujana-rakshaa-
Kapata durmanuja-shikshaa= paksha vipaksha vi-lakshana rahitha ka-taakshamu naadesa-
Deekshanu nilupave

|| Deevaa ||

3. Sunda-raashcharya guna-brundaa bandhura nithyaa-nandaa-saadhu sajjana-
Vandyaa-khanditha kalusha-brundaa= manda mathini naa-dendamu kadu
Deli vonda jeesi nee yandu nilupagade

|| Deevaa ||

4. Neevu - nannu srushtinchi -naavu - naagururaaddeevudavu-Kreesthu Yesuni-
Chaavu - valana nanmanipi-naavu= paavana janaka su-thaathmalathodanu- geevala
Mokkada-vai veligedi prabhu

|| Deevaa ||

5. Prema svaroopa nithya- kshema-pathitha paavana naama -daasa lokaabdi
Soma-sarveesha parama-dhaama= neema merungani- neechuda nadhamuda-
Nomahaathma daya-tho manninpave

|| Deevaa ||

––Purushotthamu Chaudhari

Comments