Dinamu Gatiyinchenu | దినము గతియించెను | Andhra Kraistava Keerthanalu
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Song No.51 - సాయంతన స్తవము
దినము గతియించెను-దిన నాధుడ పరాద్రి- వెనుకడాగె-నికమా-
మునిమాపు సంస్తవముగొనుము సంప్రీతిమై-ఘనుడ దేవా
॥ దినము ॥
1. సరవి నంబరవీధి - సంజ కెంజాయలు- మురువుజూపె- ప్రభువా-
దొరయు నీ ముఖకాంతి-కిరణ జాలము మాపై-నెఱప రమ్ము
॥ దినము ॥
2. కటికిచీకటులు ది-క్తటముల గలిసియు-త్కటములైన-నీ-చెం-
గట నున్న నెట్టి సం-కటమేని మమ్ము- దాకుటకు జంకు
॥ దినము ॥
3. తలపు వలనను నోటి-పలుకు వలనను జెనటి-పనులవల్ల-మేము-
వలసి చేసిన పాప-ముల నెల్ల క్షమియింపు-మ లఘుక్షాంతి దినము
॥ దినము ॥
4. మమ్మురమ్మగు శోధ- నమ్ములపై విజ-యమ్ము నొందనీ- దినమ్ము
మాకు సామర్థ్య మొసగితివి వంద-నమ్ము దేవ
॥ దినము ॥
5. ఈ దినము మాకు స-మ్మోదంబుతో నిచ్చి- యాదుకొన్న- వరమౌ నీ
దివ్యదానముల-కై దేవ! మాకృత-జ్ఞతను గొమ్ము
॥ దినము ॥
6. అలసిన మా దేహములకు వలసిన నిదుర గలుగజేసి - నీ దూ-తల
హస్తములలో మ-మ్ములను దాచుము భద్ర-ముగను దేవ
॥ దినము ॥
7. అరుణోదయమున ని-న్నర్చించు కొఱకు నీ-కరము సాచి-మమ్ము-
త్వరగా మేల్కొల్పుము-స్వాస్థ్య ప్రదాతవై-పరమదేవ
॥ దినము ॥
8. దాత వీవె లోక- త్రాత-వీవె మాకు-నేత వీవె-యేసు-నీతి సూర్యుండ
వి-ఖ్యాతి మహిమలు నీ కె-కలుగుగాక
॥ దినము ॥
––దాసరి మోజెస్
Dinamu gatiyinchenu-Dina naadhuda paraadri-venuka daage-nikamaa-
Munimaapu sanstavamugonumu sampreetimai-Ghanuda Devaa
|| Dinamu ||
1. Saravi nambaraveedhi-Sanja kenjaayalu-muruvujoope-Prabhuvaa-
Dorayu nee mukha kaanti-kirana jaalamu maapai-nerapa rammu
|| Dinamu ||
2. Katiki cheekatulu di-ktatamula galisiyu-tkatamulaina-nee-chen-
Gata nunna netti san-katameni mammu-daakutaku janku
|| Dinamu ||
3. Talapu valananu noti-paluku valananu jenati-panalavalla-memu-
Valasi chesina paapa-mula nella kshamiyimpu-ma laghukshaanti Dinamu
|| Dinamu ||
4. Mammurammagu shodha-nammulapai vija-yammu nondayi-dinammu
Maaku saamarthya mosagativi vanda-nammu Deva
|| Dinamu ||
5. Ee dinamu maaku sa-mmoodambuto nichchi-yaadukonna-varamou nee
Divya daanamula-kai Deva! Maakruta-jnatanu gomm u
|| Dinamu ||
6. Alasina maa dehamulaku valasina nidura galugajesi-nee doo-tala
Hastamulalo ma-mmulanu daachumu bhadra-muganu Deva
|| Dinamu ||
7. Arunodayamuna ni-nnarchinchu koraku nee-karamu saachi-mammu-
Tvaragaa melkolpumu-swaasthya pradaatavai-paramadeva
|| Dinamu ||
8. Daata veeve loka-traata-veeve maaku-neta veeve-Yesu-neeti sooryunda
Vi-khyaati mahimalu nee ke-kalugugaaka
|| Dinamu ||
––Daasari Moses
Comments
Post a Comment