Ee Saayamkaalamuna | ఈ సాయంకాలమున | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Song No.53 - సాయంతన ప్రార్థన

ఈ సాయంకాలమున -యేసు ప్రభో వేడెదము =

నీ సుదయారస మొల్క - నిత్యంబు మము గావు

॥ ఈ ॥

1. చెడ్డకలల్ రాకుండ- నడ్డగించుము ప్రభో=బిడ్డలము
రాత్రిలో-భీతి బాపుము తండ్రీ

॥ ఈ ॥

2. దుష్టుండౌ శోధకుని -ద్రొక్కుటకు బలమిమ్ము- భ్రష్టత్వమున
మేము - పడకుండా గాపాడు

॥ ఈ ॥

3. నీ యేక పుత్రుండౌ - శ్రీ యేసు నామమున -సాయంప్రార్ధన
లెల్ల -సరగ నాలించుమా

॥ ఈ ॥

4. జనక సుత శుద్ధాత్మ - ఘనదేవా స్తుతియింతు- అనిశము
జీవించి రా జ్యంబు జేయు మామేన్

॥ ఈ ॥

––మల్లెల దావీదు

Ee saayamkaalamuna-Yesu Prabho vededamu=

Nee sudayaarasa molka-nityambu mamu gaavu

|| Ee ||

1. Cheddakalal raakunda-naḍḍaginchumu Prabho=Biḍḍalamu
raatrilo-bheethi baapumu Tandri

|| Ee ||

2. Dushtundau shodhakuni-drokkutaku balamimmu-bhrashtatvamuna
memu-padakunda gaapaadu

|| Ee ||

3. Nee yeka putrundau-Sri Yesu naamamuna-saayam praarthana
lella-saraga naalinchumaa

|| Ee ||

4. Janaka suta Shuddhaatma-ghanadevaa stutiyintu-anishamu
jeevinchi raajyambu jeyu maamen

|| Ee ||

––Mallela Daaveedu

Comments