Entha Prema Entha Prema | ఎంత ప్రేమ యెంత ప్రేమ | Andhra Kraistava Keerthanalu

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Song No.10 - దేవుని ప్రేమ

ఎంత ప్రేమ యెంత ప్రేమ యెంత ప్రేమయా- దేవుడెంత గొప్ప

ప్రేమయై వెలుంగు చుండునే

॥ ఎంత ॥

1. ఎంత లోతు ఎంత నిడివి యెంత విరివయా దాని=నింత యంత
యని వచించు మనుజుడెవ్వడు

॥ ఎంత ॥

2. మనమునదలపోయ నూహ కంద దెంతయున్-దాని=జనువుగ
జగమందు బొగడ మాట లందవే

॥ ఎంత ॥

3. దేవదూతలైన దాని బాడ లేరట-యింక దేవుడే తన సుతునొసంగి
ఇంత యది యనెన్

॥ ఎంత ॥

4. ఇంత గొప్ప ప్రేమ జూప నూరకుందునే-ప్రభు= జెంతజేరి సంత
తంబు ప్రీతి జేసెదన్

॥ ఎంత ॥

Entha prema yentha prema yentha premayaa- deevudentha goppa

Premayai velungu chundune

|| Entha ||

1. Entha lothu entha nidivi yentha virivayaa daani=nintha yantha
Yani vachinchu manujudevvadu

|| Entha ||

2. Manamunadalapoya nooha kanda denthayun-daani=januvuga
Jagamandu bogada maata landave

|| Entha ||

3. Deevadoothalaina daani baada leerata-yinka deevude thana suthunosangi
Intha yadi yanen

|| Entha ||

4. Intha goppa prema joopa noorakundune-prabhu= jenthajeeri santha
Thambu preethi jeesedan

|| Entha ||

Comments