Etula Neeku Sthuthu | ఎటుల నీకు స్తుతు | Andhra Kraistava Keerthanalu
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Song No.23 - దేవుని స్తుతి
ఎటుల నీకు స్తుతు లొనర్తుము -యెహోవ తనయ- యెటుల
నీకుంనుతు లొనర్తుము =పటుతర పాపంబులనెడి- పంకమందుంజిక్కి
మదిని- దిటముంజెడిన మమ్ముంబ్రోచి-దిక్కుంజూపి నట్టి యేసూ
॥ యెటుల ॥
1. పాప కూపమందు నుండ గాం-బాప విమోచ- దాపుంజేర్చి కాపు
జూపితి= శాపగ్రస్తులైన మా శాపము విముక్తిం జేయ- నీ పవిత్ర రక్తమే
నా-ప్రాపుగా నొసంగితివి
॥ యెటుల ॥
2. భార భరితిమైన యాత్మల-భారమును దీసి-భూరి సౌఖ్యములతో
నింపను=భారకుండ-ఘోరమైన శ్రమలనొంది- మరణమొంది తిరిగిలేచి
నీవు ధాత్రి-మహిమ నొందినట్టి దేవా
॥ యెటుల ॥
3. నీతి హీనులమై యుండంగా-నోకర్త మాదు-భీతులన్నింబాపి నీ కృపన్=
నీతి రక్షణవస్త్రములను-భాతిగ ధరింపంజేసి-భూతలంబునందు
ఖ్యాతిగ సేవింపండేసితి
॥ యెటుల ॥
4. నిర్మలుండవై- యీ భూమియందు-నిన్నుం బోలి
నడుచుకొనుటకై= తిన్నని మార్గమును జూపి-అన్ని కీడులను జయింపం-
బన్నుంగ విమలాత్మశక్తి- నున్నతముంగ నిడిన యేసూ
॥ యెటుల ॥
5. పరమ రాజ్యమందు నిరతము-నీతోడనుండం-కరుణతోడ నెంచు
కొంటివి= తిరిగి వచ్చి మమ్మును నీ=చిరప్రకాశ పురమునందుం-
త్వరగంజేర్చి యందు సుఖము-దిరముగా నొసంగుదేవ
॥ యెటుల ॥
––మాముడూరి సైమన్
Etula neeku sthuthu lonarthumu -Yehova thanaya- yetula
Neekumnuthu lonarthumu =patuthara paapambulanedi- pankamandumjikki
Madini- ditamumjedina mammumbrochi-dikkumjoopi natti Yesoo
|| Yetula ||
1. Paapa koopamandu nunda gaam-baapa vimocha- daapumjeerchi kaapu
Joopithi= shaapagrasthulaina maa shaapamu vimukthim jeeya- nee pavithra rakthame
Naa-praapugaa nosangithivi
|| Yetula ||
2. Bhaara bharithimaina yaathmala-bhaaramunu deesi-bhoori saukhyamulatho
Nimpanu=bhaarakunda-ghoramaina shramalanondi- maranamondi thirigileechi
Neevu dhaathri-mahima nondinatti deevaa
|| Yetula ||
3. Neethi heenulamai yundangaa-nokartha maadu-bheethulannimbaapi nee krupan=
Neethi rakshanavasthramulanu-bhaathiga dharimpamjeesi-bhoothalambunandu
Khyaathiga seevimpandeesithi
|| Yetula ||
4. Nirmalundavai- yee bhoomiyandu-ninnum boli
Naduchukonutakai= thinnani maargamunu joopi-anni keedulanu jayimpam-
Bannunga vimalaathmashakthi- nunnathamunga nidina Yesoo
|| Yetula ||
5. Parama raajyamandu nirathamu-neethodanundam-karunathoda nenchu
Kontivi= thirigi vachchi mammunu nee=chiraprakaasha puramunandum-
Thvaragamjeerchi yandu sukhamu-diramugaa nosangudeeva
|| Yetula ||
––Maamudoori Saiman
Comments
Post a Comment