Gaanamu Jeeyudu | గానము జేయుడు | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Song No.2 - దేవుడు సర్వస్తోత్ర పాత్రుడు

గానము జేయుడు సు కీర్తనను= యెహోవాను గూర్చి క్రొత్త

గాను రక్తిగను

॥ గానము ॥

1. తన్నామము నుతించి యతిని-రక్ష జెన్నుగ సారె బ్ర-సిద్ధము జేసి=
పన్నుగ నన్యులలో దన్మహిమ-యం-దున్నత చిత్రము-లను జాటండి

॥ గానము ॥

2. ఘనతయు మహాత్మ్యమును- ద-ద్ఘనుని యెదుట నుండు-
ఘనబలమును- వినుతమౌ సౌందర్యమును-న- తనివి నిర్మల స్థల-
మున విలసిల్లు

॥ గానము ॥

3. పరిశుద్ధాలంకారముతో- నా పరమాత్మారాధన పరులై యుండండి =
ధరణి సకల జనులారా- లోక- గురుని యెదుట భీతి - గొనుచు నుండండి

॥ గానము ॥

4. పరిపాలించుచున్నా డనుచు తోడి- నరులతో జెప్పుడి - ద్ధర
గదలకుండ=స్థిరముగజేయు సత్యముగా- జనుల-కరిమురిగాను న్యా-
యము విమర్శించు

॥ గానము ॥

5. ఏమనిన నా మహాత్ముండు వచ్చు- నీ మహికి న్యాయము
నేర్పరచుటకు = భూమి జనులకు నీతి సత్య-ముల-తో మించు న్యాయ
మెం-తో విమర్శించు

॥ గానము ॥

6. జనులారా యా యెహోవాకు -మహి-మను బలమును సమర్పణము
జేయండీ- వినయముతో గానుకలను-దీసి-కొని తత్రాకారమందున
వసియింపండి

॥ గానము ॥

––విలియం డాసన్

Gaanamu jeeyudu su keerthananu= Yehovaanu goorchi krottha

Gaanu rakthiganu

|| Gaanamu ||

1. Thannaamamu nuthinchi yathini-raksha jennuga saare bra-siddhamu jeesi=
Pannuga nanyulalo danmahima-yam-dunnatha chithramu-lanu jaatandi

|| Gaanamu ||

2. Ghanathayu mahaathmyamunu- da-dghanuni yeduta nundu-
Ghanabalamunu- vinuthamau saundaryamunu-na- thanivi nirmala sthala-
Muna vilasillu

|| Gaanamu ||

3. Parishuddhaalankaaramutho- naa paramaathmaaraadhana parulai yundandi =
Dharani sakala janulaaraa- loka- guruni yeduta bheethi - gonuchu nundandi

|| Gaanamu ||

4. Paripaalinchuchunnaa danuchu thodi- narulatho jeppudi - ddhara
Gadalakunda=sthiramugajeeyu sathyamugaa- janula-karimurigaanu nyaa-
Yamu vimarshinchu

|| Gaanamu ||

5. Emanina naa mahaathmundu vachchu- nee mahiki nyaayamu
Nerparachutaku = bhoomi janulaku neethi sathya-mula-tho minchu nyaaya
Mem-tho vimarshinchu

|| Gaanamu ||

6. Janulaaraa yaa Yehovaaku -mahi-manu balamunu samarpanamu
Jeeyandee- vinayamutho gaanukalanu-deesi-koni thathraakaaramanduna
Vasiyimpandi

|| Gaanamu ||

––Viliyam Daasan

Comments