Goppa Deva Naaku | గొప్ప దేవ నాకు | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Song No.60 - తండ్రియగు దేవుడు నీవు నాతండ్రివి

గొప్ప దేవ నాకు తండ్రివు-యాకాశమందు- గొప్ప దేవ నాకు దండ్రివి

= తప్పకుండ వత్తు నీ-దరికి యేసు నామమందు-గొప్ప కరుణచేత న-
న్నిప్పుడు తగజేర్చుకొనుము

॥ గొప్ప ॥

1. నీవు మిగుల గొప్ప వాడవు నా సృష్టి కర్త -యీవు లెపుడు నిచ్చు
వాడవు= భావమందు నిను దలంచి- పావనాత్మ నాకు నిచ్చి-
జీవమార్గ మందు నిలిపి- కావు మనుచు వేడుకొందు

॥ గొప్ప ॥

2. చిన్న వాని నంగి ప్రార్ధన-నీలోకమందు-మున్ను దయను విన్న
వాడవు = సన్నుతుడగు యేసు నీదు - సన్నిధి నున్నాడు గాన-నన్ను
గనికరించు మనుచు- నిన్ను నమ్మి వత్తు నిపుడు

॥ గొప్ప ॥

3. విలువ గల్గు నీదు నాజ్ఞలు- నాహృదయమందు -బలువిధముల
దలచు చుందును= బలుకులందు బనులయందు- బలముజూపి
నిన్ను గొలిచి-యిలనునిన్ను బ్రీతి పరతు- నలయక నీ కరుణ మెయిని

॥ గొప్ప ॥

4. మీది రాజ్యమందు జేర్చుము- కరుణా సముద్ర -బీద నైన నన్ను
గరుణచే= సోదరులను గూడికొనుచు-మోద మొప్పగ నీదు సేవ-
బాదుకొనుచు నుందును నీ పాదపద్మములను బట్టి

॥ గొప్ప ॥

––పులిపాక జగన్నాధము

Goppa Deva naaku tandrivu-aakaashamandu-goppa Deva naaku dandrivi

= Tappakunda vattu nee-dariki Yesu naamamandu-goppa karunacheta na-
nippudu tagajerchukonumu

|| Goppa ||

1. Neevu migula goppa vaadavu-naa srushti karta-yeevu lepudu nichchu
vaadavu= Bhaavamandu ninu dalanchi-paavanaatma naaku nichchi-
jeevamaarga mandu nilipi-kaavu manuchu vedukondu

|| Goppa ||

2. Chinna vaani nangi praarthana-neelokamandu-munnu dayanu vinna
vaadavu = Sannutudagu Yesu needu-sannidhi nunnadu gaana-nannu
ganikarinchu manuchu-ninnu nammi vattu nipudu

|| Goppa ||

3. Viluva galgu needu naajnalu-naahrudayamandu-baluvidhambula
dalachu chundunu= Balukulandu banulayandu-balamujupi
ninnu golichi-yilanuninnu preeti paratu-nalayaka nee karuna meyini

|| Goppa ||

4. Meedi raajyamandu jerchumu-karunaa samudra-beeda naina nannu
garunache= Sodarulanu goodikonuchu-moda moppaga needu seva-
baadukonuchu nundunu nee paadapadmamulanu batti

|| Goppa ||

––Pulipaaka Jagannaadhamu

Comments