Kalugunugaaka Deevuniki Mahima | కలుగునుగాక దేవునికి మహిమ | Andhra Kraistava Keerthanalu
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Song No.27 - దైవ స్తుతి
కలుగునుగాక- దేవునికి మహిమ-కలుగును గాక-కలుగు నున్చత
మైన-ఘన స్థలములందున- నిలకు సమాధానం-నరుల కాయన
దయ
॥ కలుగును ॥
1. ప్రభువైన దేవా- పరమరాజా-సర్వపరిపాలా= పరిపూర్ణశక్తిగల- పరమ
జనక నిన్ను-మహిని స్తుతించు -మరి పొగడు చున్నాము
॥ కలుగును ॥
2. మహిమపర్చుచు-ఆరాధించు-చున్నాము నిన్ను= మహిమాతిశయమును-
మదిందలంచియు నీకు-మహిని మా స్తుతి కృత-జ్ఞత నిచ్చుచున్నాము
॥ కలుగును ॥
3. ఏక కుమారా- యేసు ప్రభువా-యెహోవా తనయా= లోక పాపము
మోయు -ఏక దేవుని గొట్టె పిల్ల మమ్మును కనిక-రించుము చల్లంగ
॥ కలుగును ॥
4. లోకపాపములు-మోయుచుంబోవు -యేసు రక్షకా= వాసిగ జనకుని-
కుడివైపునం గూర్చుండు- యేసూ మా ప్రార్థన నా-లించి కనికరించు
॥ కలుగును ॥
5. పరిశుద్ధుండవు-ప్రభుండవు నీవో- ప్రభువైన క్రీస్తూ= పరిశుద్ధాత్మతోం
తండ్రి-యైన దేవుని యందుంబరిపూర్ణ మహిమతోం -ప్రబలుచున్నా వామేన్
॥ కలుగును ॥
––ఏర్పుల మోషే
Kalugunugaaka- deevuniki mahima-kalugunu gaaka-kalugu nunchatha
Maina-ghana sthalamulanduna- nilaku samaadhaanam-narula kaayana
Daya
|| Kalugunu ||
1. Prabhuvaina deevaa- paramaraajaa-sarvaparipaalaa= paripoornashakthigala- parama
Janaka ninnu-mahini sthuthinchu -mari pogadu chunnaamu
|| Kalugunu ||
2. Mahimaparchuchu-aaraadhinchu-chunnaamu ninnu= mahimaathishayamunu-
Madindalanchiyu neeku-mahini maa sthuthi krutha-gjnatha nichchuchunnaamu
|| Kalugunu ||
3. Eka kumaaraa- Yesu prabhuvaa-Yehovaa thanayaa= loka paapamu
Moyu -eka deevuni gotte pilla mammunu kanika-rinchumu challanga
|| Kalugunu ||
4. Lokapaapamulu-moyuchumbovu -Yesu rakshakaa= vaasiga janakuni-
Kudivaipunam goorchundu- Yesoo maa praarthana naa-linchi kanikarinchu
|| Kalugunu ||
5. Parishuddhundavu-prabhundavu neevo- prabhuvaina Kreesthoo= parishuddhaathmatham
Thandri-yaina deevuni yandumbaripoorna mahimatham -prabaluchunnaa vaamen
|| Kalugunu ||
––Erpula Moshe
Comments
Post a Comment