Lechi Stutimpaboonudi | లేచి స్తుతింపబూనుడి | Andhra Kraistava Keerthanalu

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Song No.47 - ప్రాతఃస్తము

లేచి స్తుతింపబూనుడి-లోకేశ్వరుని -లేచి స్తుతింపబూనుడి =

లేచి స్తుతించెదము-చూచుచు మనలను -బ్రోచి ప్రేమతో గరము-
జాచి కాపాడు విభుని

॥ లేచి ॥

1. రాత్రి జాముల యందున - రంజిలదన - నేత్రము తెరచినందున =
మైత్రితో దేవదయకు పాత్రుల మైతిమి- శ్రోతముల కింపునబ-విత్ర
గీతము పాడుచు

॥ లేచి ॥

2. నిదురబోయిన వేళను- నిర్మలమైన -హృదయము మనకు నియ్యను
=ముదముతో నిదురబొంది యుదయాన లేచితిమి-సదయుడైన
క్రీస్తు - పదముల దరిజేరి

॥ లేచి ॥

3. నిగమ వేద్యుడు మనలను-దనలోన నీ-పగలు కాపాడబూనెను=
దిగులు బొందక పనులు- తెగువతో జరుపుకొనుచు-వగపుతో లేచి
మ్రొక్కి-మిగుల శుద్ధాత్మ నడిగి

॥ లేచి ॥

4. నేటి పాఠము యందు-నిర్భయముగ-దాటి వెలసి యుందు=సూటిగ
నీదు టెక్కల-చాటుగను నిలుపు మనుచు-నీకుగా నెల్లవార-నిత్యము
ప్రేమ నేల

॥ లేచి ॥

Lechi stutimpaboonudi-Lokeswaruni-Lechi stutimpaboonudi =

Lechi stutinchedamu-choochuchu manalanu-brochi premato garamu-
Jaachi kaapaadu Vibhuni

|| Lechi ||

1. Raatri jaamula yanduna-ranjiladana-netramu terachinanduna =
Maitrito Devadayaku paatrula maitimee-shrotamula kimpunaba-vitra
Geetamu paaduchu

|| Lechi ||

2. Niduraboyina velanu-nirmalamaina-hrudayamu manaku niyyanu
=Mudamuto nidurabondi yudayaana lechitimi-Sadayudaina
Kreesthu-padamula darijeri

|| Lechi ||

3. Nigama vedyudu manalanu-danalona nee-pagalu kaapaadaboonenu=
Digulu bondaka panulu-teguvato jarupukonuchu-vagaputo lechi
Mrokk i-migula shuddhaatma nadigi

|| Lechi ||

4. Neti paathamu yandu-nirbhayamuga-daati velasi yundu=sootiga
Needu tekkala-chaatuganu nilupu manuchu-neekuga nellavaara-nityamu
Prema nela

|| Lechi ||

Comments