Meelukona Re Mee Manambula | మేలుకొనరే మీ మనంబుల | Andhra Kraistava Keerthanalu
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Song No.41 - ప్రాతః కాల కీర్తన
మేలుకొనరే- మీ మనంబుల- మేలిమిగ మీ మేరదప్పక-పాలు
మాలక లేచి దేవుని-పాదములు పూజింప గ్రక్కున
॥ మేలుకొనరే ॥
1. దిక్కు లెల్లను దేజరిల్లెను- దినకరుడుదయింపనయ్యెను= మొక్కు
లకు ప్రతిఫలము నిచ్చెడు-మూల కర్తకు గొలువ సేయగ
॥ మేలుకొనరే ॥
2. పక్షు లెల్లను కిలకిలంచును-బ్రభుని మహిమలు బల్కదొడగెను=
రక్షకుని సకలోపకృతులను-రమ్యముగ నుతియించి పాడగ
॥ మేలుకొనరే ॥
3. నిదురబోయిన వేళ మిమ్మొక- నిముషమైనను బాసియుండక=
పదిలముగ రక్షించు దేవుని-బ్రస్తుతింప మహాముదంబున
॥ మేలుకొనరే ॥
4. మేటియౌ హృదయాబ్జములలో-మీ కృతజ్ఞతా భూషణంబులు=
నేటుగా ధరియించుకొని యిటు-నిర్మలాత్మని బూజసేయగ
॥ మేలుకొనరే ॥
5. తెల్లవారగ దెలియరే యిది- తెలివిగల మానవ సమాజము=
యుల్ల సిల్లుచు నీతి భాస్కరు-డుదయ మయ్యెను హృదయములపై
॥ మేలుకొనరే ॥
––మిక్కిలి సమూయేలు
Meelukona re- mee manambula- meelimiga mee meeradappaka-paalu
Maalaka leechi deevuni-paadamulu poojimpa grakkuna
|| Meelukonaree ||
1. Dikku lellanu deejarilleenu- dinakaruDudayimpanayyenu= mokku
Laku prathiphalamu nichchedu-moola karthaku goluva seeyaga
|| Meelukonaree ||
2. Pakshu lellanu kilakilanchunu-braphuni mahimalu balkhadodagenu=
Rakshakunis sakalopaKrutulanu-ramyamuga nuthiyinchi paaDaga
|| Meelukonaree ||
3. Nidurabooyina veela mimmoka- nimushaminanu baasiyundaka=
Padilumuga rakshinchu deevuni-brastuthimpa mahaamudambuna
|| Meelukonaree ||
4. Meetiyau hrudayaabjamulalo-mee krutagjnathaa bhooshanambulu=
Netugaa dhariyinchukoniyitu-nirmalaaathmani boojaseeyaga
|| Meelukonaree ||
5. Tellavaarage deliyare yidi- telivigala maanava samaajamu=
Yulla silluchu neethi bhaaskaru-Dudaya mayyenu hrudayamulupai
|| Meelukonaree ||
––Mikkili Samooyelu
Comments
Post a Comment