Naa Yesoo, Aatma | నా యేసూ, ఆత్మ | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Song No.54 - Sun of my soul, thou Saviour dear
1. నా యేసూ, ఆత్మ సూర్యుడా
నీవున్న రాత్రి కమ్మదు
నా యాత్మలో నీ విప్పుడు
వసించి పాయకుండుమీ.
2. నేను నిద్రించు వేళలో
నాకు నభయ మియ్యుము
నే లేచి పని చేయగా
నా యొద్ద నుండు రక్షకా.
3. నా తోడ రాత్రింబగళ్ళు
నీ వుండి నడిపించుము
నీవు నాతో లేకుండినన్
జీవింప జావజాలను.
4. నేడు నీ దివ్య వాక్యము
వినిన పాపు లెల్లరిన్
క్షమించి గుణపరచి
నీ మందలోకి జేర్చుము.
5. రోగిని స్వస్థపరచి
బీదలను పోషించుమీ
దుఃఖించువారి దుఃఖము
బాపి యానంద మియ్యుము.
––జాన్ కేబిల్, అను; జాకబ్ చేంబర్లేన్
1. Naa Yesoo, aatma Sooryudaa
Neevunna raatri kammadu
Naa yaatmalo nee vippudu
Vasinchi paayakundumi.
2. Nenu nidrinchu velalo
Naaku nabhaya miyyumu
Ne lechi pani cheyagaa
Naa yodda nundu Rakshakaa.
3. Naa toda raatrimbagallu
Neevundi nadipinchumu
Neevu naato lekundinan
Jeevimpa jaavajaalanu.
4. Nedu nee divya vaakyamu
Vinina paapu lellarin
Kshaminchi gunaparachi
Nee mandaloki jerchumu.
5. Rogini svasthaparachi
Beedhalanu poshinchumi
Duhkinchuvaari duhkh amu
Baapi yaananda miyyumu.
––Jaan Kebhil, anu; Jaakab ChembarlEin
Comments
Post a Comment