O Prabhundaa Nin Nuthinchu | ఓ ప్రభుండా నిన్ నుతించు | Andhra Kraistava Keerthanalu

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Song No.31 - ఓ దేవా, నిన్ను స్తుతించుచున్నాము

ఓ ప్రభుండా నిన్ నుతించు- చున్నాము వినయముతోడ-

మా ప్రభుండ వంచు నిన్న-మానక మే మొప్పుకొందు

॥ ఓ ॥

1. నిత్యుండవౌ తండ్రి లోకము-నిన్నారాధించుచు నుండు-
సత్యదూతల్ మోక్షమందు-సర్వ ప్రధానుల్ సుభక్తిన్-
నిత్య మేక కంఠముతోడ- నిన్ గొనియాడు చున్నారు

॥ ఓ ॥

2. పరిశుద్ధ, పరిశుద్ధ-పరిశుద్ధ, సేనల దేవా-
ధరపరలోకంబులు నీ -వరమహిమతో నొప్పునటంచు

॥ ఓ ॥

3. కెరూబుల్ సెరూపుల్-నిన్చుం -గీర్తించుచున్నారహహా-
సారెకున్ నిన్నపోస్తలుల-సంఘము స్తోత్రించుచుండున్
కూరిమిన్ బ్రవక్తల సంఘము-కొనియాడుచు నిన్ నుతియించు

॥ ఓ ॥

4. మా మహా జనకా-నిన్ను-మాన్యుండౌ పుత్రున్-బహుశ్రేమగల మా
పరిశుద్ధాత్మను- ప్రీతితో సంఘము భువి నొప్పుకొనున్

॥ ఓ ॥

5. నీవే క్రీస్తు రాజవు-నిత్య కుమారుండవు-నీ వలలో మానవులను-
గావంగం బూనినయపుడు-పావన కన్యా-గర్భంబున బుట్టుట
బహు దీనంబనక-చావు శ్రమ నోడించి-సజ్జనులను దివిం దెరచితివే

॥ ఓ ॥

6. నీవు దేవుని కుడి పార్శ్వంబున- నిత్యము మహిమా సీనుండవు-
నీవు మా న్యాయాధిపతివై- రావలయునని నమ్ముచుందుము-
పావనంబౌ నీ రక్తంబున- సేవకులకుం దోడ్పడు మిపుడే

॥ ఓ ॥

7. నిత్య మహిమలో -నింక-నీదు భక్తులతో -న-గత్యముగ
లెక్కించుము వారలం-గని రక్షించుమి నీ సుజనంబున్

॥ ఓ ॥

8. నీవు దీవించి- నీ నిత్య స్వాస్థ్యంబు-సు-జీవ మిడి వారలం
బాలించి-లేవంగ నెత్తుము సతతము ప్రీతిన్

॥ ఓ ॥

9. ఓ ప్రభువా పాపములో-నుండ కుండంగం దోడ్పడుము- మా
ప్రభువా కరుణించు-మముంగరుణించుము దయతోడన్

॥ ఓ ॥

10. ఓ ప్రభుండా నమ్మి-యున్న మాకుంబ్రేమంజూపు-
శ్రీ ప్రభుండా నిన్నే నమ్మితి- సిగ్గునొంద నీయకుము

॥ ఓ ॥

––మల్లెల దావీదు

O prabhundaa nin nuthinchu- chunnaamu vinayamuthoda-

Maa prabhunda vanchu ninna-maanaka me moppukondu

|| O ||

1. Nithyundavau thandri lokamu-ninnaaraadhinchuchu nundu-
Sathyadoothal mokshamandu-sarva pradhaanul subhakthin-
Nithya meka kanthamuthoda- nin goniyaadu chunnaaru

|| O ||

2. Parishuddha, parishuddha-parishuddha, seenala deevaa-
Dharaparalokambulu nee -varamahimatho noppunatanchu

|| O ||

3. Keroobul seroopul-ninchum -geerthinchuchunnaarahahaa-
Saarekun ninnaposthalula-sanghamu sthothrinchuchundun
Koorimin bravakthala sanghamu-koniyaaduchu nin nuthiyinchu

|| O ||

4. Maa mahaa janakaa-ninnu-maanyundau puthrun-bahushreemagala maa
Parishuddhaathmanu- preethitho sanghamu bhuvi noppukonun

|| O ||

5. Neeve Kreesthu raajavu-nithya kumaarundavu-nee valalo maanavulanu-
Gaavangam booninayapudu-paavana kanyaa-garbhambuna buttuta
Bahu deenambanaka-chaavu shrama nodinchi-sajjanulanu divim derachithive

|| O ||

6. Neevu deevuni kudi paarshvambuna- nithyamu mahimaa seenundavu-
Neevu maa nyaayaadhipathivai- raavalayunani nammuchundumu-
Paavanambau nee rakthambuna- seevakulakum dodpadu mipude

|| O ||

7. Nithya mahimalo -ninka-needu bhakthulatho -na-gathyamuga
Lekkinchumu vaaralam-gani rakshinchumi nee sujanambun

|| O ||

8. Neevu deevinchi- nee nithya svaasthyambu-su-jeeva midi vaaralam
Baalinchi-leevanga netthumu sathathamu preethin

|| O ||

9. O prabhuvaa paapamulo-nunda kundangam dodpadumu- maa
Prabhuvaa karuninchu-mamumgaruninchumu dayathodan

|| O ||

10. O prabhundaa nammi-yunna maakumbremamjoopu-
Shree prabhundaa ninne nammithi- siggunonda neeyakumu

|| O ||

––Mallela Daaveedu

Comments