Paralokamuna Nundu Deeva | పరలోకమున నుండు దేవ | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Song No.25 - రక్షణ కొరకు కృతజ్ఞత
పరలోకమున నుండు దేవ- నీ పదముల నొనరింతు సేవ=
దురితంబులకు నేను- వెఅచి యున్నానని- కరుణించి నీ సుతుని -ధర
కంపితివిగాదా= అరయంగా నీ ప్రేమ యింతనం- దరము గాదో పరమ
జనక-మరణ పర్యంతంబు నిను నే-మరవంజాలను-వరకృపా నిధి
॥ పరలోక ॥
1. యేసు క్రీస్తుని దయ సేయ-కున్న-మోస మొందెద నెందు కన్న=
దోసంబులకు నేను- దాసుందనై ప్రతి- వాసరంబును నీదు- భాసు
రాజ్ఞలు విడిచి= వేసటలు గల నరకమునంబడాద్రోసిన నది
న్యాయమౌగద- నా సునాధా పేర్మిచేతను- నీ సుతుని నంపించినావు
॥ పరలోక ॥
2. ఎన్నరాని మహిమ నుండి-యేసు-నన్నుం బాలింప నేతెంచి= యెన్న
శక్యము గాక- యున్న పాపము లన్ని- ఛిన్నాభిన్నము జేసి= నన్ను
సమ్మతిపరప-నన్న యగు నా రక్షకుండు- తన్ను తానర్చించి వెండియు-
నున్నతుండై లేచి యిప్పుడు సన్నిధానం బొసంగా నాకు
॥ పరలోక ॥
––పురుషోత్తము చౌధరి
Paralokamuna nundu deeva- nee padamula nonarinthu seeva=
Durithambulaku nenu- verachi yunnaanani- karuninchi nee suthuni -dhara
Kampithivigaadaa= arayangaa nee prema yinthanam- daramu gaado parama
Janaka-marana paryanthambu ninu ne-maravamjaalanu-varakrupaa nidhi
|| Paraloka ||
1. Yesu Kreesthuni daya seeya-kunna-mosa mondeda nendu kanna=
Dosambulaku nenu- daasundanai prathi- vaasarambunu needu- bhaasu
Raagjnalu vidichi= veesatalu gala narakamunambadaadrosina nadi
Nyaayamaugada- naa sunaadhaa peermicheethanu- nee suthuni nampinchinaavu
|| Paraloka ||
2. Ennaraani mahima nundi-Yesu-nannum baalimpa neethenchi= yenna
Shakyamu gaaka- yunna paapamu lanni- chhinnaabhinnamu jeesi= nannu
Sammathiparapa-nanna yagu naa rakshakundu- thannu thaanarchinchi vendiyu-
Nunnathundai leechi yippudu sannidhaanam bosangaa naaku
|| Paraloka ||
––Purushotthamu Chaudhari
Comments
Post a Comment