Prabalamuga Ne Prasthuthinchheda | ప్రబలముగ నే ప్రస్తుతించెద | Andhra Kraistava Keerthanalu
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Song No.9 - స్తుతి గీతము
ప్రబలముగ నే- ప్రస్తుతించెద -ప్రభుని కృపలన్ని= ప్రతి దినము
నిను- ప్రచురపరచెద- ప్రభుడ నావిభుడా
॥ ప్ర ॥
1. పొందుగోరి నా-యందు నిలిచిన బంధు మిత్రుడవు- మందమతి
కా-నంద మొసగిన - మహిమ తేజుడవు
॥ ప్ర ॥
2. చింతదీర్చి నా-భ్రాంతి మార్చితి- వెంత వింతిదియో=స్వాంతమున
కడు-శాంతి గూర్చితి- వెంత కరుణిదియో
॥ ప్ర ॥
3. నీతి కరపిన-జాతి మరిపిన -ఖ్యాతి యేసునిదే= నీరసుడ నను-
గారవించిన -నీతి రాజితడే
॥ ప్ర ॥
4. జీవమిచ్చిన జావవచ్చిన- దేవసుత నీవే= జీవదాయక- బ్రోవరా
యిక-జాల మేలనురా
॥ ప్ర ॥
5. నిమిషనిమిషము-నిను భజించెద - నెమ్మనంబునను = శమదమాది
-సుగుణ శోభిత- సమ్మదిని నిమ్మా
॥ ప్ర ॥
––చెట్టి భానుమూర్తి
Prabalamuga ne- prasthuthincheda -prabhuni krupalanni= prathi dinamu
Ninu- prachuraparacheda- prabhuda naavibhudaa
|| Pra ||
1. Pondugori naa-yandu nilichina bandhu mithrudavu- mandamathi
Kaa-nanda mosagina - mahima teejudavu
|| Pra ||
2. Chinthadeerchi naa-bhraanthi maarchithi- ventha vinthidiyo=svaanthamuna
Kadu-shaanthi goorchithi- ventha karunidiyo
|| Pra ||
3. Neethi karapina-jaathi maripina -khyaathi Yesunide= neerasuda nanu-
Gaaravinchina -neethi raajithade
|| Pra ||
4. Jeevamichchina jaavavachchina- deevasutha neeve= jeevadaayaka- brovaraa
Yika-jaala meelanuraa
|| Pra ||
5. Nimishanimishamu-ninu bhajincheda - nemmanambunanu = shamadamaadi
-Suguna shobhitha- sammadini nimmaa
|| Pra ||
––Chetti Bhaanumoorthi
Comments
Post a Comment