Prabhuvaa Ninnaaraadimpanu | ప్రభువా నిన్నారాధింపను | Andhra Kraistava Keerthanalu
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Song No.46 - ఉదయారాధన
ప్రభువా నిన్నారాధింపను జేరితిమి యుదయ శుభకాంతి ప్రభవింపగా
దేవా నేడు శుభకాంతి విరజిమ్మగా విభవముగను ప్రభాకరముగను-
విరియు నీ తేజంబెలర్పగ - నభి దనంబులగూడి భక్తిని- యాత్మతో
సత్యంబు తోడను
॥ ప్రభువా ॥
1. 1.ఇరులుం గమ్మిన నుండి- యరుణోదయము దనుక- సరిగాపునీవేకాదా-
దేవా రాత్రి- యరిగాపు నీవే గాదా= విరివిగా మా హృదయ సీమల-
నెరసి యుండిన చీకటులు బో- దరిమి శాంతంబైన మనసుల-దయ
బ్రసాదింపను భజింతుము
॥ ప్రభువా ॥
2. అనఘా నీ సాన్నిధ్య-మున నుండగా మా దు-ర్మనసుల నరికట్టుమో-
దేవా మాదుర్మనసుల శుచి జేయుము=వినయ భయభక్తులుదలిర్పగ
వినుచు నీ వాక్యోపదేశము -లనిశమును ధ్యానింప నాత్మను- బనిచి
తుదకు బ్రసన్నమగుము
॥ ప్రభువా ॥
3. పని పాటలో మేమీ- దినము నీకే మహిమ నొనగూర్చ నడిపించుమో-
దేవా నిన్నే-ఘన పరచన్నడిపించుము= తనువు శ్రమచే బడలి నను మా
దారి దుర్గమమైన కనంబడ - వనటజెందక నేది చేసిన- బ్రభువు
కొఱకని చేయ నడుపుము
॥ ప్రభువా ॥
––మొలతాటి విద్యానందము
Prabhuvaa ninnaaraadimpanu jeritimi yudaya shubhakaanti prabhavimpagaa
Devaa nedu shubhakaanti virajimmagaa vibhavamuganu prabhaakaramuganu-
Viriyu nee tejambelarpaga - nabhi dhanambulagoodi bhaktini-yaatmatō
Satyambu todanu
|| Prabhuvaa ||
1. Irulum gammina nundi-yarunodhayamu danuka-sarigaapunivekaadaa-
Devaa raatri-yarigaapu neeve gaadaa=Virivigaa maa hrudaya seemala-
Nerasi yundina cheekatulu bo-darimi shaantambaina manasula-daya
Brasaadimpanu bhajintumu
|| Prabhuvaa ||
2. Anaghaa nee saanidhya-muna nundagaa maa du-rmanasula narikattumo-
Devaa maadurnmanasula shuchi jeyumu=Vinaya bhayabhaktuludalirpagaa
Vinuchu nee vaakyoopadeshamu-lanishamunu dhyaanimpa naatmanu-banichi
Tudaku brasannamagumu
|| Prabhuvaa ||
3. Pani paatalo meemi-dinamu neeke mahima nonagoorcha nadipinchumo-
Devaa ninne-ghana parachannadipinchumu= Tanuvu shramache badali nanu maa
Daari durgamamaina kanambada-vanatajendaka nedi chesina-brabhuvu
Korakani cheya nadupumu
|| Prabhuvaa ||
––Molataati Vidyaanandamu
Comments
Post a Comment