Sarva Shakthuni Sthothra | సర్వ శక్తుని స్తోత్ర | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Song No.8 - సర్వశక్తుని స్తోత్రగానము
సర్వ శక్తుని స్తోత్ర గానము -సల్పరే జగ మెల్లను = నిర్వహించును
దాస భారము-నిత్య మెద రాజిల్లను
॥ సర్వ ॥
1. ముదముతో నిర్మాణకుండగు- మూల కర్తను బాడరే = వదన
మీ క్ష్మాన్వంచి దేవుని- వందనముతో వేడరే
॥ సర్వ ॥
2. వేద పారాయణము సేయుచు విశ్వమంత జయింపరే= సాదరముగా
దేవునిక మీ-స్వాంతమున బూజింపరే
॥ సర్వ ॥
3. ఎదను విశ్రాంతిన్ పరేశు-హెచ్చుగా నుతిజేయరే సదమలంబగు
భక్తితో మీ-సర్వ మాయన కీయరే
॥ సర్వ ॥
4. చావు పుట్టు లేనివాడుగ- సంతతము జీవించును =ఈవు
లిచ్చు చుదన్ను వేడు మ-హేష్టులను రక్షించును
॥ సర్వ ॥
5. దాసులై దేవునికి నెదలో దర్పమును బోగాల్పరే= యేసు క్రీస్తుని
పుణ్యవస్త్రము- నే మరక మైదాల్పరే
॥ సర్వ ॥
––మిక్కిలి సమాయేలు
Sarva shakthuni sthothra gaanamu -salpare jaga mellanu = nirvahinchunu
Daasa bhaaramu-nithya meda raajillanu
|| Sarva ||
1. Mudamutho nirmaanakundagu- moola karthanu baadare = vadana
Mee kshmaanvanchi deevuni- vandanamutho veedare
|| Sarva ||
2. Veeda paaraayanamu seeyuchu vishvamantha jayimpare= saadaramugaa
Deevunika mee-svaanthamuna boojimpare
|| Sarva ||
3. Edanu vishraanthin pareeshu-hechchugaa nuthijeeyare sadamalambagu
Bhakthitho mee-sarva maayana keeyare
|| Sarva ||
4. Chaavu puttu leenivaaduga- santhathamu jeevinchunu =eevu
Lichchu chudannu veedu ma-heeshtulanu rakshinchunu
|| Sarva ||
5. Daasulai deevuniki nedalo darpamunu bogaalpare= Yesu Kreesthuni
Punyavasthramu- ne maraka maidaalpare
|| Sarva ||
––Mikkili Samaayelu
Comments
Post a Comment