Shree Yesu Kartanu Seevajeyutaku | శ్రీ యేసు కర్తను సేవజేయుటకు | Andhra Kraistava Keerthanalu
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Song No.43 - ప్రాతఃకాల స్తుతి
శ్రీ యేసు కర్తను-సేవజేయుటకు మేల్కొను-
శ్రీయేసు కర్తను= శ్రేయముల నెఱింగి=నీకు=
రేయిపవ లొసంగి - యెడ - బాయని యంత
రంగి-య-పాయంబుద్రోయ స-హాయంబుజేయ
॥ శ్రీ యేసు ॥
1. నిదుర యందు నేడు -క్షేమ మొదవగాచినాడు
-సూర్యుడుదయ మాయెంజూడు - నీ
హృదయమున సదమల -పదవు లుదయింప
॥ శ్రీ యేసు ॥
2. అంధకార మణగెన్- హృద- యాంధకార
మణగన్- ప్రభు- నందు దెలివి గలుగన్
ని-బంధనలు డెందమున- కందముగగూర్చి
॥ శ్రీ యేసు ॥
3. కంటిపాప వలెను-నిను-గాయు
వాని దయను-గనుగొంటివి
స్తోత్రమును-జేయు-మింటికిని మంటి క-న్నింటికి
కర్త యని
॥ శ్రీ యేసు ॥
4. కలకల ధ్వనిజేయు-పక్కి-గములు లయను
గూయు-స్వర-ములు ప్రభు స్తుతిజేయు
-నీ-వలయక సొలయక-వెలయగ బాడు
॥ శ్రీ యేసు ॥
5. సేవయందు నీకు-మంచి-యీవు
లిడు పరాకు-గల-భావముబడ
బోకు-నేడు-కావవే-కావవే కావవే యంచు
॥ శ్రీ యేసు ॥
6. పగటి వారమంచు-ని ష్పలపు గ్రియలు ద్రుంచు
యుగ యుగములు జీవించు-పురి-కెగయ నీ దిగులు
విడు-తగు నమ్మకమున
॥ శ్రీ యేసు ॥
7. మింటి నట బాడు- నీ-యొంటి బలిమి
నేడు-ప్రభు నంటియుండ వాడు ని-న్నొంటి
నెన్నంటి కె-న్నింటికి స్వీడడు
॥ శ్రీ యేసు ॥
––భేతాళ జాన్
Shree Yesu kartanu-seevajeyutaku meelkonu-
Shreeyesu kartanu= shreyamula nerringi=neeku=
Reeyipava losangi - yeda - baayani yantha
Rangi-ya-paayambud roya sa-haayambujeeya
|| Shree Yesu ||
1. Nidura yandu nedu -kshema modavagaachinaadu
-Sooryududaya maayemjoodul - nee
Hrudayamuna sadamala -padavu ludayimpa
|| Shree Yesu ||
2. Andhakaara managen- hrudu- yaandhakaara
Managan- prabhu- nandu delivi galugan
Ni-bandhanalu dendamuna- kandamugagoorthi
|| Shree Yesu ||
3. Kantipapa valenu-ninu-gaayu
Vaani dayanu-ganugontivi
Sthotramunu-jeeyu-mintikini manti ka-nnintiki
Kartha yani
|| Shree Yesu ||
4. Kalakala dhvanijeeyu-pakki-gamulu layanu
Gooyu-svara-mulu prabhu sthuthijeeyu
-nee-valayaka solayaka-velayaga baadu
|| Shree Yesu ||
5. Seevayandu neeku-manchi-yeevu
Lidu paraaku-gala-bhaavamubada
Boku-nedu-kaavave-kaavave kaavave yanchu
|| Shree Yesu ||
6. Pagati vaaramanchu-ni shpalapu griyalu drunchu
Yuga yugamulu jeevinchu-puri-kegaya nee digulu
Vidu-tagu nammakamuna
|| Shree Yesu ||
7. Minti nata baadu- nee-yonti balimi
Nedu-prabhu nantiyunda vaadu ni-nnonthi
Nennanti ke-nnintiki sveedadu
|| Shree Yesu ||
––Bethaala Jaan
Comments
Post a Comment