Sukshēma Shubhakaala | సుక్షేమ శుభకాల | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Song No.59 - సుక్షేమ శుభకాల

1. సుక్షేమ శుభకాల
విశ్రాంతి దినమా
విచార మెల్ల తీర్చు
దైవాదివారమా
ఈనాడు మేము కూడి
దేవాలయంబున
యా త్ర్యేక దేవ స్తుతి
గావింతు మెంతయు

2. నీయందు సృష్టికర్త
విశ్రమ మొందెను
నీయందు యేసు క్రీస్తు
మృత్యు బంధమును
త్రెంచుచు తాను లేచి
చావున్ జయించెన్
నీ యందు పావనాత్మ
మాకియ్య బడెను

3. భూవాసు లీ దినంబు
సంతోష పడుచు
సువార్తవిని, పాడి
మా యేసు స్తోత్రము
పితృ పుత్ర శుద్ధాత్మ
త్రిత్వంబౌ దేవుని
ఉత్సాహ ధ్వనితోడ
నెంతో స్తుతింతురు.
అను: జాకబ్ చేంబర్లేన్

––క్రిష్టఫర్ వర్డ్స్ వర్త్

1. Sukshēma shubhakaala
Vishraanti dinamaa
Vichaara mella teerchu
Daivaadivaaramaa
Eenaadu memu koodi
Devaalayambuna
Yaa tryeka Deva stuti
Gaavintu mentayu

2. Neeyandu Srushtikarta
Vishrama mondenu
Neeyandu Yesu Kreesthu
Mrutyu bandhamunu
Trenchuchu taanu lechi
Chaavun jayinchen
Nee yandu Paavanaatma
Maakiyya badenu

3. Bhoovaasu lee dinambu
Santosha paduchu
Suvaartavini, paadi
Maa Yesu stotramu
Pitru putra Shuddhaatma
Trittvambou Devuni
Utsaaha dhvanitoda
Nento stutinturu.
Anu: Jaakab Chembarlein

––Krishtafar Vards Varth

Comments