Tellavaarinaa Vela | తెల్లవారిన వేళ | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Song No.42 - ప్రాతః స్తవము

తెల్లవారిన వేళ -దెలి వొంది మన క్రీస్తు -దివ్య నామమంబాడరే-

యో ప్రియులారా-దివస రక్షణ వేండరే=తల్లి రొమ్మున దాచు-పిల్ల
రీతిని మనల-జల్లదనముగ రాతి-రెల్లగాచిన విభుని

॥ దెల్లవారిన వేళ ॥

1. నిద్రయిన వేళ - నిపోలాపదలబాపి-నిశ లన్ని గడుపు విభునిన్=
భద్రముగ వినతించి- భయభక్తితో మనము-ముద్రి తాక్షులంగేలు-
మోడ్చి మొక్కుచును

॥ దెల్లవారిన వేళ ॥

2. భానుడుదయం బయ్యె-బద్మములు వికసిల్లె- గానములు
జేసెంబక్షుల్=మానసాబ్జము లలర-మనము కల్వరి మెట్ట-పై నెక్కు
నినుడనెడి-ప్రభుని జూచి వేండ్మన్

॥ దెల్లవారిన వేళ ॥

3. దిట్టముగ ఆ మానేసం-ద్రియ కాయ శోధనలు-పట్టుకొని యుందు
దినమున=దట్టముగ మన నాల్గు-తల్ల యేసుని కరుణ-జుట్టుకొని
రక్షించు-శుభ మడుగుకొనుచున్

॥ దెల్లవారిన వేళ ॥

4. పాపభారము మనము-ప్రభుని పై నిడి గురుని-పాదముల చెంత
నారగి= కాచు కర్త విశాల- కరము మాటున డాగి -యాపదలం
దోలగించు-మని వేండుకొనుచున్

॥ దెల్లవారిన వేళ ॥

––పురుషోత్తమ చౌధరి

Tellavaarinaa veela -deli vondi mana Kreesthu -divya naamambaadare-

Yo priyulaaraa-divasa rakshana veendaree=thalli rommuna daachu-pilla
Reethini manala-jallodanamuga raathi-rellagaachina vibhuni

|| Dellavaarinaa Veela ||

1. Nidrayina veela - nipolaapadalabhaapi-nisha lanni gadupu vibhunin=
Bhadramuga vinathinchi- bhayabhakthitho manamu-mudri thaakshulangeelu-
Modchi mokkuchunu

|| Dellavaarinaa Veela ||

2. Bhaanududayam bayye-badmamulu vikasille- gaanamulu
Jesembakshul=maanasaabhjamu lalara-manamu kalvari metta-pai nekku
Ninudanedi-prabhuni joochi veendman

|| Dellavaarinaa Veela ||

3. Dittamuga aa maaneesan-driya kaaya shodhanalu-pattukoni yundu
Dinamuna=dattamuga mana naalgu-thalla Yesuni karuna-juttukoni
Rakshinchu-shubha madugukonu chun

|| Dellavaarinaa Veela ||

4. Paapabhaaramu manamu-prabhuni pai nidi guruni-paadamula chenta
Naaragi= kaachu kartha vishaala- karamu maatuna daagi -yaapadalam
Dolagimchu-mani veendukonu chun

|| Dellavaarinaa Veela ||

––Purushotthama Chaudhari

Comments