Vendeda Naadagu Vinathini | వేడెద నాదగు వినతిని | Andhra Kraistava Keerthanalu

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Song No.45 - ప్రాతఃకాల ప్రస్తుతి

వేడెద నాదగు వినతిని గైగొన-వే జగదీశ ప్రభో=

నేడు ప్రతి క్షణ మెడబాయక నా-తోడ నుండవె ప్రభో

॥ వేడెద ॥

1. ప్రాతః స్తవము భవత్సన్నిధి స-ర్వంబున నగు నాదౌ=
చేతస్సున ధర్మాత్మను సంస్థితి- జేయవే సత్కృపను

॥ వేడెద ॥

2. నేపాతకి నజ్ఞానుడప్రభువా -నీవు కరుణజేయు=
పాపాచరణము నందున జిత్తము-బాపుము నాకెపుడు

॥ వేడెద ॥

3. పాపముగని భీతుడనై శంకా -పరత సతమునుండన్=
నాపై నుంచుము నీదగు సత్కరు-ణా దృష్టిని బ్రేమన్

॥ వేడెద ॥

4. నాదగు పాప భరంబంతయు నీ- మీదనే యిడుచుందున్=
నీదు మహాకృప నుండి యొసంగుము- నిర్మల గతి నాకున్

॥ వేడెద ॥

5. అవిరత మతి నిటుల లతులిత గతి నీ-స్తుతి నుతు లొనరింతున్=
భవదంఘ్రులపై నాదగు భక్తిని-బ్రబలింపవే యేసు

॥ వేడెద ॥

––విలియం డాసన్

Veendeda naadagu vinathini gaikona-ve jagadeesha prabho=

Nedu prathi kshana medabaayaka naa-toda nundave prabho

|| Veededa ||

1. Praatha stavamu bhavathsannidhi sa-rvambuna nagu naadau=
Chethasssuna dharmathману sansthithi- jeeyave sathkrupanu

|| Veededa ||

2. Neepaataki najnaanudaprabhuva -neevu karunajeeyu=
Paapacharanamu nanduna jithamu-baapumu naakepudu

|| Veededa ||

3. Paapamugani bheetudanai shankaa -paratha sathamunundан=
Naapai nunchumu needagu sathkaru-naa drushtini breman

|| Veededa ||

4. Naadagu paapa bharambanthayanu nee- meedane yiduchunduн=
Needu mahaakrupa nundi yosangumu- nirmala gati naakun

|| Veededa ||

5. Avirata mathi nitula lathulitha gathi nee-sthuthi nuthu lonаrinthun=
Bhavadanghrulupai naadagu bhakthini-brabalimpave Yesu

|| Veededa ||

––Viliyam Daasan

Comments